(Telugu) ప్రాణాయామము

[:te]అన్ని పద్దతులలో ధ్యానమునకు ముందు దీర్ఘ ప్రాణాయామము (ఊపిరిని నిండుగా పీల్చి వదలడం) చేయమని చెప్పబడి వున్నది. ధ్యానము చేయనువారు కూడా ఈ దీర్ఘ ప్రాణాయామాన్ని ఆచరిచవచ్చును. ఇది అత్యంత సహజమైన, సాత్వికమైన, ప్రాణాయామము.
దీర్ఘ ప్రాణాయామము చేయ విధము:
కుర్చిలోగాని, నెలమీద దుప్పటి పరవికొని గాని కూర్చొనవలెను.
వీపు భాగము నిటారుగా వుంచకొనవలెను.
కనులు మూసుకొనవలెను. నాలుక పెదవులు కదలవద్దు.
ఇప్పుడు ఊపిరితిత్తులలో వున్న గాలి మైత్తాన్ని బయటకు పూర్తిగా వదలివేయవలెను. తరువాత నాశికా రంద్రముల ద్వారా గాలిని ఊపిరితిత్తుల నిండువరకు పీల్చుకొని తరువాత గాలిని నాశికా రంద్రముల ద్వారా పూర్తిగా వదిలిచేయవలెను. మళ్ళి గాలిని దీర్ఘముగా పీల్చుకొని మళ్ళి పూర్తిగా వదిలిచేయ వలెను. ఈ విధముగా ౩ నుండి ౫ నిమిషముల సేపు ఈ దీర్ఘ ప్రాణాయామ సాధన చెయవలెను.
మీరు ధ్యాన సాధన చేయువారైతే ధ్యానమునకు ముందు ఈ ప్రాణాయామమును చెయవలెను.
దీర్ఘ ప్రాణాయామము జరుగు విధము:
మీరు గనక గాలిని గాడంగా పీల్చినట్లయిత్ గాలి నాశికా రంద్రముల ద్వారా చేగంగా లోపలికి ప్రవహించి ఊపిరితిత్తులను పూర్తిగా ఆక్రమిస్తుంది.
అప్పుడు ఊపిరి తిత్తులలోని బహురంద్రములు గాలిలోని ప్రాణశక్తిని (ఆక్సిజన్) పీల్చుకొంటాయి. అందువల్ల ఊపిరితిత్తులలోని రక్తము పూర్తిగా ప్రానశక్తిలో నిండివుంటుంది. ఈ రక్తము శరీరములో అన్ని భాగముల యందు ప్రవహించి ఆ భాగముల లోని జీవికణముల మైత్తాన్ని పాణశక్తితో నింపి వేస్తుంది. శరీరంలోని అణువులు పూర్తిగా పాణశక్తితో నిండడం వల్ల శరేరము పూర్తి శక్తివంతముగాను చైతన్య వంతముగాను తయారవుతుంది.
తగినంత ప్రాణశక్తి (ఆక్సిజన్) లేని కారణం వలన శరేరములో మూలకణముల ఉత్పత్తి జరుగుట లేదు. ఇప్పుడు దేర్ఘ ప్రాణాయామము ద్వారా పాణశిక్తని (ఆక్సిజన్) శరీరములోనికి పంపుట వలన మూల కణముల ఉత్పత్తి బాగుగా జరిగి శరీర ఆరోగ్యస్థితి మెరుగుపడుతుంది. అదే విధముగా ప్రాణశక్తితో కూడిన రక్తం మెదడును చేరి అందులోని ప్రతి అనువును శుద్ధి చేసి వాటి పనితీరును మెరుగు పరుస్తుంది. సహజముగా మెదడుకు తగినంత పాణశక్తి (ఆక్సిజన్) అందని కారణం వలన మానసిక రోగములు అనగా మనసికంగా క్రుంగడం (డిప్రషన్) మొదలైనవి సంభవిస్తాయి. ఈ ప్రాణయామ సాధన వల్ల ఇటువంటెవి తోలగి పోతాయి. మరియు పోగొట్టుకున్న ఉత్సాహాన్ని, ఉలాసాన్ని పోందవచ్చు. మనసికముగా క్రంగడ్ం, అలజడి, విసుగు, దుఃఖము, భయము మొదలైనవి తీసివేయుటకు దీర్ఘ ప్రాణాయామము మంచి సాధనము.
మీకు ఎప్పుడైతే మానసికంగా కొంచెం కృంగినట్లు, విసుగు, అలజడి మొదలైనవి ఉన్నట్లు అనిపిస్తే వెంటనే ఈ దీర్ఘ ప్రాణాయామ సాధన ఆచరణలో పెట్టండి. ప్రాణాయామ సాధన ద్వారా శరీరంలో అధికంగా ప్రాణశక్తి (ఆక్సిజన్) నింపుటవలన జరిగే మార్పులను మీరే సులభంగ గమనించగలరు. మనము మొక్కలకు రోజూ తగినంత నీరు అందించినట్లయితే ఏ విధముగా పుష్పించగలదో అదే విధముగా ఈ దీర్ఘప్రాణాయామము మన మెదడును వికసింపజేయును. ఈ విధముగా వికసింపబడిన మెదడు ప్రకాశవంతముగా పనిచేయుటవలన శరీరములో అన్ని అవయవములు చక్కగా పనిచేయును. అందువలన ఈ దీర్ఘప్రాణాయామము శారీరిక, మానసిక అరోగ్యములను కలుగజేయును.

ఆధ్యాత్మిక సాధనకు సూత్రము

03 - 05 నిమిశములు - దీర్ఘప్రాణాయామము

30 - 40 నిమిశములు - ధ్యానము రోజుకు ఒకసారి

గాని, లేదా రెండు సార్లు గాని సాధన చేయవలెను.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము