దిన ప్రార్థన


  1. ప్రపంచమంతట విస్తరించి వున్న అన్ని నాగరికతల యందు వారములోని ఏదు రోజులను ఒక్కొక్క పేరుతో పిలువబడి అయా రోజును ఒక్కొక్క గ్రహము (దేవత) అధిప్టించి, పాలించుచున్నవని అందరికి తెలిసినదే. ప్రకృతితో సహజీవనము చేయుచున్న మనిషిమీద, అతని రోజువారి జీవితముమీద, ఈ గ్రహముల ప్రభావము వున్నవని, ప్రపంచములోనున్ను అన్ని నాగరికతల యందు ఇదే విషయమున్నట్లు స్పష్టముగా గోచర మవుతున్నది. ఈ విధముగా ప్రకృతిలోని గ్రహములు మానవుల మీద పని చేయు విధము, దాని ప్రభావములను అనాది నుండి ఙ్ఞానులు, ఋషులు, మునులు గ్రహించి తెలియబరచినారు ఈ ఙ్ఞానమే తరతరములుకు ప్రవహిస్తూ వస్తున్నది.


  2. భారతదేశంలోని ఙ్ఞానులు, ఋషులు, మునులు వారి తపోశక్తి ద్వారా దర్శించిన అంతర్ ఙ్ఞానముతో, ఆయా రోజులను పొలించేది గ్రహములు, వారి యొక్క అధిస్ఠాన దేవతలు (స్థూలముగా గ్రహము, సూక్షముగా అధిస్ఠాన దేవత) మన నిత్యజీవనంపై ఈ గ్రహముల ప్రభావము, సులభమైన మార్గములో వాటి దోషములను నివారించు కొను రీతిని తెలియపరచినారు.


  3. ఏదైనా ఒక గ్రహము యొక్క దోషము లేదా దోష తీవ్రత తగ్గించవలెననిన ఆ గ్రహమునకు సంబ్ంధించిన మంత్రమును జపించుట లేదా ధ్యానించుట ద్వారా ఆ గ్రహమును శాంతింపజేసి ఆ దోషమును పరిహారము చేసుకొనవచ్చును.


  4. జపము లేదా ధ్యానము కొరకు వారముల పేర్లు ఈ వారములను పాలించే గ్రహముల పేర్లు వాటికి సంబంధించిన మంత్రములు ఈ క్రింద ఇప్వబడినవి.


రోజులు

గ్రహము

అధిష్ఠాన దేవత

మంత్రము

ఆదివారం

సూర్యడు

బ్రహ్మ

నమో సూర్యాయ నమః

సోమవారం

చంద్రుడు

పార్వతి

నమో సోమాయ నమః

మంగళవారం

కుజుడు

సుబ్రహ్మణ్య

నమో మంగళాయ నమః

బుధవార్

బుధుడు

విష్ణువు

నమో బుధాయ నమః

గురువారం

గురువు

బృహస్పతి

నమో బృహస్పతయే నమః
(లేదా)
నమో గురవే నమః

శుక్రవారం

శుక్రుడు

లక్ష్మి

నమో శుక్రాయ నమః

శనివారం

శని

వేంకటేశ్వర

నమో శనైశ్చరాయ నమః



  • ఆదివారము - మంత్రము - నమో సూర్యయ నమః
    అర్థము - ఆదివారమునకు అధిపతి అయిన సూర్య దేవునకు సమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణుచేయు చున్నాను.


  • సోమవారము - మంత్రము - నమో సోమాయ నమః
    అర్థము - సోమవారమునకు అధిపతి అయిన చంద్ర దేవునకు సమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణు చేయు చున్నాను.


  • మంగళవారము - మంత్రము - నమో మంగళాయ నమః
    అర్థము - మంగలవారమునకు అధిపతి అయిన కుజ దేవునికి సమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణుచేయు చున్నాను.


  • బుధారము - మంత్రము - నమో బుధాయ నమః
    అర్థము - బుధారమునకు అధిపతి అయిన బుధ దేవునికి సమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణు చేయు చున్నాను.


  • గురువారము - మంత్రము - నమో బృహస్పతయే నమః (లేదా) నమో గురువే నమః 
    అర్థము - గురువారమునకు అధిపతి అయిన బృహస్పతి దేవునకు(గురువునకు) సమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణు చేయు చున్నాను.


  • శుక్రవారము - మంత్రము - నమో శుక్రాయ నమః
    అర్థము - శుక్రవారమునకు అధిపతి అయిన శుక్ర దేవునకు సమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణు చేయు చున్నాను.


  • శనివారము - మంత్రము - నమో శనైశ్చరాయ నమః
    అర్థము - శనివారమునకు అధిపతి అయిన శని దేవునకు సమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణు చేయు చున్నాను.




  1. మన ఋషులు, మునులు చంద్రుడు మరియు భూమి యొక్క నీడలను రాహు, కేతువులుగా గుర్తించినారు. ఈ రాహుకేతువులు (నీడ) నిరంతరము చలెస్తూ వుంటాయి. ప్రతి దినములో ఒక నిర్ధిష్ఠ సమయమందు ఈ ఛాయాగ్రహముల ప్రభావము మానవులపై పడుతుంది. ఈ కాలములను రాహు కాలము, మరియు గుళికకాలములని అందురు. మన నిత్యజీవనమునై వీటి ప్రభావములను నివారించు కొనుటకు ఋషలు, మునులు తగు మంత్రములను సూచించి, రాహుకాలము మరియు గుళిక కాలములలో ఈ మంత్రములను జపము లేదా ధ్యానము చేయుట ద్వారా ఈ ఛాయా గ్రహముల యొక్క దుష్ఫలితమ్లను నివారించికొనవచ్చునని సూచించినారు.


  2. రాహు గ్రహ ప్రభావము వలన కలిగెడు వ్యాధులు క్యాన్సర్, చర్మవ్యాధులు, మానసిక వ్యాధులు, ద్వంద్వ వ్యక్తిత్వము, మతి భ్రమణము మొదలైనవి. ఈ ఛాయా గ్రహము ప్రభావము వల కలిగెడు దుష్ఫలితములను నివారించుకొనటకు నిర్ణయించిన మంత్రము "నమో రాహువే నమః" ఈ మంత్రము యొక్క అర్థము ఏమనగా రాహు కాలమునకు అధిపతి అయిన రాహునకు నమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణు చేయు చున్నాను.


  3. కేతు గ్రహ ప్రభావము వలన కలిగెడు వ్యాదులు మానసికముగా క్రుంగడము శారేరా రోగములు, నిరాశ, వైరాగ్యభ్రాంతి మైదలైనవి. ఈ గ్రహ ప్రభావము వలన కలిగెడు దుష్ఫలితములను నివారించు కొనుటకు నిర్ణయించిన మంత్రము "నమో కేతివే నమెః" ఈ మంత్రము యొక్క అర్థము ఏమనగా గుళిక కాలమునకు అధిపతి అయిన కేతువునకు నమస్కరిస్తూ అతనికి నా ఆత్మను శరణు చేయు చున్నాను.


  4. రాహుకేతువులు ఛాయగ్రహములై చరిస్తూ ప్రతి రోజూ నిర్ధిష్ఠముగా వేరు వేరు సమయములలో ప్రభావములు చూపునందువల్ల, పంచాంగము ద్వారా ప్రతిదినము వీరి సమయములైన రాహుకాలము మరియు గుళిక కాలములను గుర్తించి ఆయా సమయములలో మంత్రములను జపించి లేదా ధ్యానించి మంచి ఫలితములను పోందవచ్చును.


  5. మన దిన ప్రర్థనలో ఆ రోజును అధిష్ఠించిన గ్రహమునకు సంబందించిన మంత్రమును దైనందిక కార్యములు మైదలు పెట్టుటకు ముందు జపమాల నహాయముతో ౧౦౮ సార్లు కనులు మూసుకొని, నాలుక, పెదవులు కదల్చకుండా మౌనముగా మంత్రమును మనసులో జపము చేయవలెను. తద్వారా ఆ రోజునకు సంబంధించిన గ్రహ ప్రభావము వలన కలుగు ఆటంకములు, విఘ్నముల యొక్క తీవ్రతను తగ్గించుకొన వచ్చను.


  6. ఎవరి జాతకములోనైనా ఏదైనా ఒక గ్రహము అనుకూలముగా లేకున్నను లేదా నీచత్వము (బలహేనత) పొందియున్నట్లయితే ఆ గ్రహమునకు సంబంధించిన మంత్రమును, ఆ గ్రహమునకు సంబంధించిన రోజున 108 సార్లు గాని, అంతకన్నా ఎక్కువసార్లు గాని జపము లేదా ధ్యానము చేయవచ్చును. ఈ పద్ధతే ఛాయా గ్రహములకు కూడా వర్తించును.


  7. ధ్యానము చేయువార్ వారి ధ్యానమునకు ముందు పైన తెలియపరిచిన రోజువారి మంత్రములను ఆయా రోజులలో వారి ధ్యానమునకు ముందు 108 సార్లు జపము చేసి, 3 నుంచి 5 నిమిషముల సేపు దేర్ఘ ప్రాణయామము చేసి తరువాత ధ్యానము ప్రారంభించినచో ఫలితములను అధికముగా పొందవచ్చును.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము