(Telugu) మీకొసం కొన్ని మాటలు

[:te]747)మనకు తగని ప్రదేశములలో మనకు గల గొప్పతనము, ఆధిక్యత ప్రదర్శింపకపోయని మాత్రాన మన ఔన్నత్యమునకు భంగము కలుగదు కొండ ఎంత పెద్దదైననూ అద్దములో చిన్నదిగా కనిపించును కదా!
748)తెలివైన వాడికి సలహా అవసరంలేదు, మూర్ఖుడు సలహ వినడు.
749)ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దూఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితోనే అల్లాడుతూంటారు. అత్యంత ప్రేమానురాగాల్లొ ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం తెస్తుంది.
750)ప్రేమనేది ప్రమాదం లాంటిది అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు - విశ్వ..!
751)సంతోషం సీతాకోకచిలక లాంటిది.దాని కోసం పరిగెత్తితే అందకుండా ఎగిరిపోతుంది. ప్రశాంతంగా కూర్చుంటే అలవోకగా వచ్చి పైన వాల్తుంది
752)విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు. విచారం లేకపోతే కోరికలుండవు. సుఖం నశించినప్పుడు అనురాగం ఉండదు.
753)నిజం మాట్లాడడానికి మించిన దైవత్వం లేదు. నిజం పలకడానికి ధైర్యం కావాలి.
754)నెయ్యిలేకపొయినా ,కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు, కాని పెట్టెదేదయినా ప్రేమతొ పెట్టండి.అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది.కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం,పెట్టేవారి ఆప్యాయత,ప్రేమ ముఖ్యం
755)మనకి విధి ఎదైన పండు ని అందిచినప్పుడు వీలైనంత త్వరగా దాన్నుంచి రసం పిండి తాగాలి. ఆలస్యం చేస్తే పండు పాడయ్యే అవకాశం ఉంది.
756)దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.ప్రతీ జీవిలోను ఉన్నాడు.ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే ,మన హృదయాలు అంత పవిత్రమవుతాయి.
757)చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు,కానివాడు మానవ సమాజానికే బరువు
758)ఇష్టపడి ఇచ్చేది దానం, అయిష్టంగా ఇచ్చేది లంచం.
759)ఎదుటివారినుంచి నువ్వు ఏది ఆశిస్తావో దాన్ని నువ్వు కూడా ఎదుటివారికి చేస్తే స్నేహం పదికాలాలపాటు వుంటుంది
760)బాధ్యతలు నిర్వర్తించ లేనిదే బంధాలనుంచి బయటపడలేం !! ప్రేమించకుండా ప్రేమేమిటో చెప్పలేం!!
761)మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ‌ విషయం గుర్తుంచుకుంటే మనము జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలము
762)వ్యక్విగత సేవలకంటే సామాజిక సేవలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. ప్రతివారూ సేవలో పాల్గొనాలి. సేవకుడే నాయకుడైననాడు ప్రపంచం అభివృధ్ది చెందుతుంది
763)అవసరానికి ఇచ్చింది అర్ధరూపాయైనా అది జీవితంలో తీర్చుకోలేని ఋణం.
764)మన జీవితములో అనేక వేలమంది సహాయ సహకారములు పొందుతున్నము. ఇతరులకు ఎల్లవేళలా సహాయపడుతూ ఆ ఋణాన్ని తీర్చుకోవాలి. ఇతరులకు సహాయపడాలన్న కోరికతో వీలైనంత సేవచేయటములో ఆత్మానందం లభిస్తుంది. ఈ సేవలు ఎప్పుడూ ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమతో చేసినప్పుడే దైవప్రీతిని పొందగలము. అసలైన సంఘసేవకు కావలసిన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం అప్పుడే లభిస్తాయి.
765)ప్రకృతిలో ప్రతి ఒక్కదానికీ తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక కోడి ఆ సంగతి తెలుసుకోకుండా నెమలి తనకంటే అందంగా ఉందని, నెమలి ఈకలు ఉన్నంత అందంగా తన ఈకలు లేవని ఉడుక్కుంది. ఆకోపంతో తన ఈకలు అసహ్యంగా కనిపించాయేమో పీకేసుకుంది.అప్పుడు ఏమవుతుంది? ఈకలు పీకిన కోడవుతుంది కాని నెమలి అయిపోతుందా? మరొకరికి ఉన్న వాటిని మనకు లేవని దిగులు పడకూడదు, మనలో ఉండే మంచి లక్షణాలకు మెరుగులు పెట్టి ప్రత్యేకత సంపాదించుకోవడం విజ్ఞత అవుతుంది కాని, ఉడుక్కుని మనలో ఉన్న సమర్ధతను కూడా పోగొట్టుకోవడం మంచిది కాదు కదా!
766)జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితములో ఈ‌ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడే అజ్ఞాని.సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుట ఎంతటి సత్యమో, ఇది కూడా అంతే సత్యము.
767)మంచి ఎక్కడున్నా ప్రోత్సహించాలి ఉన్నత ఆశయం ఎవరి దగ్గర వున్నా వేల గొంతులతో ప్రచారం కల్పించాలి .ఆ సేవలు నలుగురికి తెలియాలి .అది ప్రతి మనస్సుని కదిలించాలి .ఆ స్పందనతో ప్రతి ఒక్కరు చేయగలిగినంత సాయం చేయాలి.... స్పందించే ప్రతి మనస్సుకి శతకోటి వందనాలు.
768)తక్కువ ఆశించాలి ,ఎక్కువ త్యాగం చేయాలి..అప్పుడే దేవుడు ఇచ్చిన ఈ జన్మ సఫలిక్రుతం కాగలదు
769)ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని వలన మనకు సంతోషము కలుగుతుందా అని ప్రశ్నించుకొని తర్వాత కొనసాగాలి.
770)తెలుసుకోవడం సృజనను పెంచుతుంది ,సృజన ఆలోచనకు దారి తీస్తుంది .ఆలోచన జ్ఞానం పెంచుతుంది, జ్ఞానం మిమ్ములను గొప్పవారిని చేస్తుంది
771)సేవే లక్ష్యం ప్రేమే మార్గం ..నువ్వు వెలిగి ప్రక్క వాడిని వెలిగించు
772)కృషి అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది
774)తీపు దొరకని వాడు చేదుని వెలుగు దొరకని వాడు చీకటిని మెచ్చుకుంటాడు. అదే జీవితం
775)గర్వం శత్రువుల్ని పెంచుతుంది - మిత్రుల్ని పారద్రోలుతుంది
776)తెలిసేవరకూ బ్రహ్మవిద్య - తెలిస్తే సాధారణ విద్య
777)చెడు మాట్లాడకు,చెడు వినకు చెడు చూడకు
778)నదులు చక్కని నీళ్ళని ఇస్తాయి .గోవులు చక్కని పాలు ఇస్తాయి.భూదేవి చక్కని పంటలునిస్తుంది ..మరీ మనిషి? ఇవ్వడాన్ని మనిషి నేర్చుకున్నాడా అని ప్రశ్నిస్తే ,సమాధానం చెప్పడం కష్టమే .'ఇవ్వడానికి మన దెగ్గర ఏమి వుందని ? మన దెగ్గర ఏమి వుందని మనిషి ఆత్మ వంచన చేసుకుంటున్నాడు.. ఆనందం అనేది చాలా గొప్ప అనుభూతి ,దాన్ని పొందడం మన చేతుల్లో లేకపోయినా ,ఇవ్వడం మన చేతుల్లోనే వుంది!..దాన్నే ఇద్దాం పది మందికి !..
779)ఉన్నతమైన ఆశయానికి మనవంతు సాయం అందిస్తే అదో గొప్ప మానసిక సంతృప్తి
780)ఉపకారాన్ని మించిన ధర్మం లేదు ,అపకారాన్ని మించిన పాపం లేదు .ఎవరు పరోపకారం కొరకు పాతుపడుతరో వారి జీవితం సఫలం అవుతుంది
781)నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి
782)నిజానికి ఏ వస్తువు విలువైన దానికి తగిన స్థానాన్ని చేరినప్పుడే ,దాని యోగ్యతకు,శక్తికి తగిన కార్యానికి ఉపయోగపడినప్పుడే కదా ఆ వస్తువుకి సార్ధకత.మానవ జన్మ కూడా అంతే !.
783)ఎదుటివారిన బాధ పెట్టి మనం పొందే సంతోషం కన్నా..
784)మనం బాధపడుతూ ఎదుటివారిని సంతోష పెట్టడం చాలా గొప్పది..! విశ్వ..!
785)మనం చేసే సహాయం ప్రతిఫలం ఆశించనిదైతే..సహాయం పొందిన వారి మనసులో మన స్థానం సుస్థిరమవుతుంది..! విశ్వ..!
786)మనం చేసే సహాయం పేరు ప్రక్యాతలను ఆశించేదైతే..నువ్వు చేసిన ఆ సహాయానికి నిజమైన పేరు స్వార్ధం అవుతుంది..! విశ్వ..!
787)అవసరంలో ఉండే స్నేహితుడికి ఉపయోగపడని స్నేహితుడు..అవసరాలకు మాత్రమే మనతో స్నేహం చేసే స్నేహితుడు అలా పిలవడానికి అనర్హుడు..! విశ్వ..!
788)ఇష్టపడి చేసే సహాయం మనసుకి తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది..కష్టపడి అయిష్టంతో చేసే సహాయం మనసుకి అసహనాన్ని ఆవేదనని ఇస్తుంది..! విశ్వ..!
789)మనవ సేవే మాధవ సేవ అనే నిజం మనో నేత్రంతో చూసే వారికి తెలుస్తుంది..కాని సమాజంలో సహజంగా చూసే కళ్ళకు నిజానికి మనం చేసేది సహాయమే అయినా ఊడిగంలా కనిపింస్తుంది..! విశ్వ..!
790)గమ్యం అనేది ఒక అవకాశం కాదు ,అది ఎన్నుకోవలసిన ఒక లక్ష్యం ,అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు ,కృషితో చేయాల్సినది
791)అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు.. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికి తెలుసుకోలేడు..! విశ్వ..!
792)సంతృప్తి సహజ సంపద, ఆడంబరం కృత్రిమ దారిద్య్రం
793)సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకటం లాంటిది
794)లే... నిన్ను నువ్ఞ్వ తెలుసుకో... గెలిచే వరకూ పోరాడు బలమే జీవనం. బలహీనతే మరణం
795)అభిమానించే వాళ్ళకు దూరంగా ఉండటం నరకానికి దగ్గరగా ఉండటం రెండూ ఒక్కటే..! విశ్వ..!
796)కొన్ని ఇష్టాలు కావాలంటే కొన్ని ఇష్టాలను వదులుకోక తప్పదు...కష్టాల కడలిలో కెరటాలకు భయపడితే సుఖాల తీరం చేరుట అసాధ్యం...! విశ్వ..!
797)తీరికలేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే దిగులుపడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు
798)దుఃఖాన్ని సృష్టించుకోవట మానేస్తే అందరూ సహజంగానే ఆనంద హృదయులౌతారు.
799)ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు ఎప్పటికీ ఒంటరి కాలేడు.
800)ఈ సృష్టిలో లోతైనది ఏది అంటే సహజంగా సముద్రం అంటారు కాని నేను వెంటనే జీవితం అంటాను...ఎందుకంటే సాగరంలో మునిగితే ప్రాణాలతో తీరం చేరే అవకాసం ఉంటుంది కాని సంసార సాగరంలో మునిగితే తేలడం ఉండదు....అందులోనే ప్రాణాలు వదిలేయాలి తప్పదు...! విశ్వ..!
801)భగవంతునికి ప్రత్యేకమైన రూపం లేదు.. ప్రత్యేకమైన లోకం లేదు..మనం సృష్టించుకున్న కధలే మతాలుగా వృద్ధి చెందాయి నిజానికి మానవత్వమే నిజమైన మతం..అందుకే అన్నారు మానవ సేవే మాధవ సేవ అని అందుకే ఆయనని సర్వాంతర్యామి అన్నారు...! విశ్వ..!
802)ఆనందం చెప్ప లేనిది,సంతోషం పట్టరనిది కోపం పనికిరానిది,ప్రేమ చెరిగిపోనిది,కానీ స్నేహం మరువలేనిది
803)భయమూ తలుపుతట్టింది ! సాహసం తలుపుతీసింది ! నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణించుకో
804)బాధలు పడినప్పటికీ నీతి తప్పకుండా నిజాయితీగా, నిశ్చలంగా ఉండగలిగిన వాళ్ళల్లో అదొక విధమైన తేజస్సు ఉంటుంది
805)తెలియక చేసే తప్పుని క్షమించకపోవడం తప్పు...తెలిసి చేసే తప్పుని క్షమించడం చాలా పెద్ద తప్పు...! విశ్వ..!
806)తెలిసి చేసిన ప్రతీ తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు...చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కనుక దాని జోలికి వెళ్లకుంటే మంచిది...! విశ్వ..!
807)ఏ పనినైనా చేసే ముందు నిన్ను నవ్వు ప్రశ్నించుకో...నువ్వు చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక వస్తుంది...మంచి అనిపిస్తే చేసేయి చెడు అనిపిస్తే ఆపేయి...! విశ్వ..!
808)చేసిన తప్పును ఒప్పుకుంటే శిక్షలో కొంత తగ్గించడంలో తప్పులేదు...తప్పు చేసి చేయలేదని సమర్ధించుకుంటే రెట్టింపు శిక్షించడంలో కూడా తప్పులేదు...! విశ్వ..!
809)తినడానికి తిండిలేక ఉండటానికి గూడులేక కడుపుకాలి...ఆకలితో అలమటించే పిల్లలకు పట్టడన్నం పెట్టి ఉండటానికి స్థానం కల్పిస్తే...బ్రతకడానికి మార్గం సూచిస్తే నేరస్తుడనేవాడు ఉండదు...! విశ్వ..!
810)కులం, మతం, ప్రాంతం..
811)మనకొద్దు వీటి రాగ ద్వేషాలు..!మనం మనుషులం.. మానవత్వం మన సొంతం..! మనం బతుకుతూ సమస్త జీవులు బతికేందుకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మనవంతు కృషి చేద్దాం..!
812)పరీక్షలు జీవితంలో చాలా ఎదురవుతాయి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని నిలిచే వాడే విజేత...! విశ్వ..!
813)కులమతాలనేవి మనం పుట్టించినవి కాని మానవత్వమనేది మనలో మనతోనే పుట్టేది...మానవత్వం ముందు అంటరాని తనం తలదించక తప్పదు అప్పుడే మనం మనుషులతో సమానం...అలా జరగని పక్షంలో మనం మనిషి రూపంలో జన్మించిన మృగాలతో సమానం...! విశ్వ..!
814)చీకటిలో ఉన్నానని చింత పడకు..దానిని చీల్చుaకొని వచ్చే వెలుగు కోసం ఎదురు చూడు ..ఓటమి పొందానని కలత చెందకు ,ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు .నమ్మకం నీ చేతిలో ఒక యుద్ధం .ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు ..విజయం అన్ని వేలలలా నీ చెంతనే ఉంటుంది
815)శ్రమ నీ ఆయుధం అయితే విజయం తప్పక నీ బానిస అవుతుంది
816)అక్షరాలతో సావాసం చేయవలసిన బాల్యం అష్టకష్టాల పాలు కాకుండా ఉండేందుకు... బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.. భావి భారత పౌరులకు నవ సమాజాన్ని నిర్మించాలి...! విశ్వ..!
817)నమ్మకం అనేది నీలోనే ఉండే ఆయుధం లాంటిది... దాని తోడుగా తలబడితే ప్రతి యుద్దంలో విజయం నిన్నే వరిస్తుంది...! విశ్వ..!
818)కష్టం వస్తే కన్నీరు రానీయకు, నష్టం వస్తే నిరాశను రానీయకు...నీ ధైర్యమే నిన్ను నువ్వు ఇష్టపడే తీరానికి చేరుస్తుందని మరువకు...! విశ్వ..!
819)ఒక సారి ఓడినంత మాత్రాన ప్రతిసారి ఓటమి తప్పదనే భయాన్ని విడిచిపెట్టు...తప్పకుండా రెండో సారి నువ్వు గెలుస్తావు, అలా జరగలేదంటే నీలో భయం ఇంకా ఉందనేది వాస్తవం...! విశ్వ..
820)పెద్దలు చెప్పిన మాట : నాకు దేశం ఏమిచ్చిందని కాదు, దేశానికి నేను ఏమిచ్చానని ఆలోచించాలి !అది ప్రతి పౌరుడూ తన దేశం గురించి చేయవలిసిన పని !
821)పెద్దల కాళ్ళకు నమస్కరించాలంటే చిన్నతనంలో చిన్నతనంగా ఉండేది...కాని పెద్దవాడినయ్యాక తెలిసింది, అలా చేయడంలోనే పెద్దరికం ఉంటుందని...! విశ్వ..!
822)ప్రతి జీవికీ ప్రకృతి సిద్ధమైన భాద్యతలూ, కుటుంబ పరమైన భాద్యతలూ, సామాజిక పరమైన భాద్యతలూ ఉంటాయి ! తమవి కాని హక్కులు లభించలేదని, భాధ్యతలను విస్మరించడం, జీవితాలను త్యజించడం, అవివేకం, అన్యాయం, అనాగరికం, అనైతికం
823)aakalestundi ani annam tinatam prakruthi.aakalestundi ani yedutivadini dochukuni tinatam vikruthi.aakalestundi ani yedutivadiki petti tinatam samskruthi.
824)మనం ఎప్పుడు ఈ స్థాయిలోనైతే ఉన్నామో ఆ స్థాయి కూడా లేని వారు సమాజంలో చాల మంది ఉన్నారు. కనుక మనం ఉన్న స్థాయిని భగవంతుడు మనకి ఇచ్చిన వరంగా భావించాలి. ఆ స్థాయిలోని ఆనందాన్ని అనుభవిస్తూ ,ఆ భాద్యతలకి న్యాయం చేస్తూ ,అంతటితో ఆగకుండా అదే రంగంలో మరో మెట్టు పైకి ఎదగడానికి ప్రయత్నించాలి. .ఏదైనా కారణం వలన ముందుకు ,వెళ్ళలేకపోయినట్లుయితే 'అయ్యో' అంటూ అసంతృప్తి చెందకూడదు .ఆ సమయంలో ఎక్కడైతే ఉన్నామో దానితో సంతృప్తి చెంది ,అందులోని సౌక్యాన్ని అనుభవిస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి.అప్పుడే మన జీవితం ఆనందమయమవుతుంది.
825)విజయం అంటే మనం కోరుకొని ఎదురు చూసి వెనుకడుగు వేయకపోవడం !
826)ప్రపంచంలో చీకటి అంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుగుతురని దాచలేదు ,లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు
827)మనకుగల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం .మనం చేసే పనుల్ని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు
828)పైకి కఠినంగా కనిపించే మృధువైన స్వభావానికి రూపాన్ని ఇస్తే నాన్న...! విశ్వ..!
829)నిన్నటి చేదును మరిచిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది
830)ఓటమి గురువు లాంటిది.ఏమి చెయ్యకూడదో ఎలా చెయ్యకూడదో అది నేర్పుతుంది
831)పడుకుంటే చదువుకి కోపం, చదివితే నిద్రకు కోపం, ఏమి చేసేది భగవంతుడా...! విశ్వ..!
832)నాయకత్వమంటే దారిపోడువునా ముందు నడవడం కాదు బాట వెయ్యడం,త్రోవ చూపడం
833)నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలో ఒడుదొడుగులు నిన్నేమి చెయ్యలేవు
834)మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించడం చాలా కష్టం. ఆ ఛాయలు ఎంతో కొంత మనలో కూడా ఉంటేనే అది సాధ్యం
835)jeevitam lo sarvam kolpoina okati matram migile vuntundi.....adhe bavishyathu.
836)మనకు కష్టాలలో దేవుడు గుర్తొస్తున్నాడు అంటే, మనం సరైన దారి వెతకడానికి ప్రయత్నించడం ఆపేశాము అన్నమాట
837)gamyam patla entha sradha vahistamo....aa gamyam cherataniki velle margam patla kuda antha sradha vahinchali.
838)మనల్ని భగవంతుడు ఎలా సృష్టించి ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిని ఆనదంగా అనుభవించాలి. అప్పుడే జీవితాలు ఆనందమందిరాలు అవుతాయి.
839)Brathaka nerchina vaadu brathukuthaadu... brathukunelina vaadu jeevishtaadu
840)Brathakadam kosam jeevinchakandi...jeevinchadam kosam brathakandi...
841)apanammakam tho vachina gelupu kante...nammakam tho vachina otami samtrupthinistundi.
842)దేవుడు ఈ భూమి మీదకి పంపింది మన బ్రతుకు మనం బ్రతకడానికి మాత్రమే కాదు ,నలుగురికి సాయం చేయడానికి.మనకి వున్నది పది వ్రేళ్ళు .దాన్నే అందరితోపంచుకొందాం
843)నువ్వు నిన్న అనుకున్నది జరగలేదని ఆలోచన వద్దు ..నీ కోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు,కొత్త ఉత్సాహంతో మరో ప్రయత్నం ప్రారంభించు ఎంతో అద్భుతాలను సాధించవచ్చు .
844)చీకటిలో వున్నాని చింత పడకు దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు ,ఓటమి పొందానని కలత చెందకు,ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు నమ్మకం నీ చేతిలోనే ఆయుధం ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్ళు విజయం అన్ని వేళలల నీ చెంతనే వుంటుంది
845)కనిపించే మనిషిని ప్రేమించని వాడు ,ఆ కనిపించని దేవుడ్ని ఎలా ప్రేమించ గలుగుతాడు కాబట్టి మనిషి మనిషిని ప్రేమించడమే మానవత్వం ...
846)బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు నీకు అప్పుడు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది
847)manishi jeevitam lo mundadugu veyyataniki rende rendu karanalu okati sradha rendavadi bayam.
848)మనిషి జీవితం లో ముందడుగు వెయ్యటానికి రెండే రెండు కారణాలు ఒకటి శ్రద్ధ రెండవది భయం .
849)మనం మన స్థితిగతులను బట్టి గాక సామాజిక పరిస్థితులను బట్టి మన గొంతు పెద్దది లేదా చిన్నది చేయడం నేర్చుకోవాలి !
850)అపజయాలు కలిగిన చోటే గెలుపు మాట వినిపిస్తుంది.ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
851)ఇద్దరి మధ్య వైరం సంభవించిదంటే అందుకు వారిలో ఒక్కరే కారణం కావచ్చు. కాని అది ధీర్గ కాలం కొనసాగిందంటే దానికి ఇద్దరు భాద్యులే
852)ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు ఉపయోగించుకోవడమే వివేకం
853)ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు వుంటాయి ,అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం అదే శ్రమించడం !.
854)సత్యం ఒక్కటే మానవ జీవితాన్ని సన్మార్గంలోకి తీసికొనివస్తుంది.
855)నిరాశకు లోనై లక్ష్యం మరచి పోవటం అవివేకం...నీ అత్మబలాన్ని అయుధంగా చేసుకో నీ గమ్యం చేరకుండా నిన్ను ఏ శక్తి అడ్డుకోలేదు... (Mana community lo Lucky garu petttina blog lonchi peduthunnanu)
856)కష్టాల చిట్టా విప్పకు ,అందరికి అవి మామూలే .నీకున్న సుఖాలను చూడు ,కొందరికే అవి పరిమితం .
857)ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం . అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం
858)సంపాదన లేని వాడికి ఖర్చు పెట్టె హక్కు లేదు,అలాగే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు
859)ధైర్యమంటే ..ఓటమిలోనూ గుండెనిబ్బరాన్ని కోల్పోకపోవడమే
860)ఎదుటివాడు ఇచ్చే గౌరవం మన గొప్పతనంగా భావించకూడదు, అది ఇచ్చే వాడి వినయం అంతే
861)ఒక వ్యక్తి జీవితం లో సాధించ లేనిది, వ్యక్తులు వ్యవస్థ గా ఒక జీవితం లో సాధించవచ్చు!
862)మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు
863)పొరపాటు సహజమంటూ ప్రతీ సారి ఉపేక్షిస్తే అది అలవాటుగా మారే ప్రమాదముంది
864)జీవితం మంటే వందసంవత్సరాల కాలం కాదు, వేల సంవత్సరాల జ్ఞాపకం..! జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తు పెట్టు కోవటం కాదు..!!ప్రపంచానికి మనం గుర్తుండేల చేయడం.!!
865)సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.
866)జీవితం అంటే అర్దం-పరమార్దం; ఈ రెండు కలిస్తేనే జీవితం. మనిషి పుట్టడం అర్ధమైతే , మనిషి జన్మ కి ఒక సార్ధకత ఉంటేనే ఆ మనిషి జీవించడానికి ఒక పరమార్దం
867)ఎదుటివాడి కాష్టాలను చూసి బాధ పడేవాడు మహాత్ముడు --స్వామి వివేకానంద
868)ప్రతి రాయిలోను ఒక శిల్పం దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు.. ఉలి తొ చెక్కాలి. అప్పుడే ఆ రాయిలోనుంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది.. అలాగే ప్రతి మనిషి జీవితం లొ అతీతమైన శక్తి దాగుంటుంది. దాన్ని ఎప్పుడైతె గుర్తిస్తామో మనమంటే ఏమిటో నిరూపించుకోవచ్చు....
869)ఆలోచన వికసించే పుష్పం, ఆలాపన దానికి అంకురం, ఆచరణయే ఫలం
870)ఆత్మ విశ్వాసంతో ఆశించేదేదైనా నిత్య జీవీతంలొ నిజమౌతుంది.
871)అవకాశం రావడం గొప్ప కాదు, అవకాశం నిరూపించుకోవడం గొప్ప
872)పేదరికం అనుభవించిన వారికే డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డాబుసరి వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనస్సు డబ్బుని దుబార చేయనివ్వదు - సరోజిని నాయుడు
873)అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం ఇదే మనకు కావలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి ముందడుగే వేయండి
874)మని ప్రపంచానికి అనుగుణంగా సర్దుకుంటారు, కేవలం అవివేకులు మాత్రమే ప్రపంచాన్ని తమకు అనుగుణంగా సరిదిద్దాలని పట్టుపడతారు--జార్జ్ బెర్నార్డ్ షా--
875)ఇతరులను అర్దం చేసుకున్నవాడు విఙ్ఞాని, కాని తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. వివేకం లేని విఙ్ఞానం ప్రయొజన శూన్యం
876)మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి.
877)ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. భాధ్యత తీసికో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది
878)పూలలొ సువాసన, మనిషిలొ యోగ్యత దాచినా దాగవు
879)సుఖ దుక్కాలను సమానంగా అనుభవించడానికి మనిషి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ,ఎవైడైతే చలించకుండా ఉంటాడో అలంటి వాడు స్థితప్రజ్ఞుడు
880)జీవించినా,పొరాడినా,నటించినా....పుట్టుకకి మరణానికి ఒక్కటే అందరు...జన్మించేది తల్లివొడిలొనే...మరణించేది మట్టివొడిలొనే.
881)విద్య,వివేకం బావిలోని నీళ్ళ వంటివి.వాడినకొద్దీ ఊరుతూ ఉంటాయి
882)కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.
883)సంతోషం సగం బలం ,ఆనందం పరమౌషధం
884)మనం సమాజానికి ఏదో అయిపోతోందని భాదపడేకంటే సమాజంలో మన భాగస్వామ్యాన్ని గుర్తెరిగి ,మనవంతు సేవగా మన పిల్లల్ని నవ సమాజానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలి --- స్వామి వివేకానంద
885)కళ మనిషికి దేవుడిచ్చిన అరుదైన వరం. దాన్ని అనునిత్యం సాధన చేస్తూనే ఉండాలి
886)జీవితం! ఎదుటివారి కళ్ళల్లోకి ప్రేమగా చూడడం ...లేదా ఎదుటివారి కళ్ళల్లొ ప్రేమని చూడడం ...
887)గెలుపు అంటే అనుకున్నది సాదించటం కాదు ,సాదించిన దానిని నిలబెట్టుకోవడం ..అదో నిరంతర ప్రయాణం .ప్రయత్నించే వాడు గెలుస్తాడు లేదా ఓడిపోతాడు ,కానీ ప్రయత్నించని వాడు తప్పకుండా ఓడిపోతాడు
888)జీవితం అంటే ఓడిపోవడానికి కాదు గెలుపు తలుపులు తెరచి చూడడానికే
889)నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
890)చిరునవ్వుతో కూడినవైఖరి ప్రతికూల పరిస్ధితులను కూడా అవకాశాలుగా మార్చగలదు
891)సమాజం మార్పు కోరుకునే ప్రతి వాడికి ..తనని తను మార్చుకోవాలన్న ఆలోచన ఎందుకు రాదు...ప్రతి వాడు తనని తను మార్చుకుంటే చాలు సమాజమే కాదు ప్రపంచమే మారుతుంది ....అశోక్ .......
892)ఆశ ఆశ అని ఎందుకు రా పరిగెడతావు ..చివరకు నీ చావు కూడా నీకు నరకం అయినపుడు నాకు మరణం ప్రసాదించు దేవుడా అని ఆశ పడతావు...ఈది నిజం......
893)నిన్నటి గురించి బాధ లేని వాడు ...ఈ రోజు గురించి ఆలోచన లేని వాడు .. రేపటి గురించి బయం లేని వాడు .... మనిషే కాదు ... కానీ అల బ్రతకాలని ప్రతి మనిషికి ఆశ.......
894)ఈ ప్రపచం చాల బాధ పడుతుంది ..కారణం చెడు వ్యక్తులు చేసే యుద్ధం వాళ్ళ కాదు ..దానికి మంచి వ్యక్తుల నిశబ్ధమే కారణం....మనకెందుకులే అనుకునే మంచి వ్యక్తుల కారణంగానే ఈ ప్రపంచం చాల బాధ పడుతుంది.....అశోక్
895)పది మందికి సహాయం చేయాలన్న ఉద్దేశం ఉన్న ప్రతి వాడు దేవుడే....
896)ఒకరు చేసిన తప్పును పదే పదే గుర్తుచేసి, వారిని మరింత బలహినులను చేసే దాని కన్నా వారిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయవచు కదా...అప్పుడు ఎవరు తమ బలహీనతలను చూసి బాధ పడదు......( శ్రీ రామ కృష్ణ ప్రభ ) ( అశోక్ )
897)చేసిన మేలు ఎన్నడూ గుర్తుంచుకోకు, పొందిన మేలు ఎన్నడూ మరచిపోకు.
898)చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి..
899)ఒక తల్లి ఏడుస్తుంటే ఏమీ తెలియని పసి పాపా కూడా ఓదార్చాలని చుస్తుందే .. అలాంటింది ఇప్పటి యువతరం తమ తలిద్రనులను శోకసముద్రం లో వదిలేసి పనికిరాణి ప్రేమ కోసం చస్తున్నారు.. వద్దు మిత్రమా ఇలాంటి చవులు మనకు వద్దు .....అశోక్
900)తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.
901)తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.
902)తమ చావుకు ముందే పిరికివాళ్ళు అనేకసార్లు మరణిస్తారు
903)తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం -
904)సమస్యకు చావు పరిష్కారమైతే ఎప్పుడో ఈ ప్రపంచం స్మసానమై ఉండేది...
905)సమస్యలు ధీటుగా ఎదిరించి నిలిచినవాడే నిజమైన ధైర్యవంతుడు.. ఆత్మహత్యతో ఆత్మవంచన చేసుకొనేవాడు పిరికివాడు...! విశ్వ..!
906)సమస్య చీమల పుట్టలాంటిది, ఆదిలోనే గుర్తించి తొలగిస్తే దానివలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..నిర్లక్ష్యం చేస్తే మాత్రం విషపూరితమైన పాముల పుట్టగా మారి ఏకున మేకై కూర్చుంటుంది, జటిలమై నిలుస్తుంది..! విశ్వ..!
907)అసూయ వద్దు. అవతల వారికి మేలు జరిగితే మనకే జరిగినట్లు భావిద్దాం. లేదా మనం కూడా ఆమేలు పొందే యత్నం చేద్దాం.
908)చక్కటి ఆలోచన, సరైన ముందుచూపు లేని మనిషి జీవితంలో అడుగడుగునా ఆపదలు చుట్టుముడతాయి.
909)నీటిని మరిగిస్తే అందులోనున్న మలినాలు మరణిస్తాయి.. వడబోస్తే స్వచ్చమైనవి అవుతాయి...అదే విధంగా మనిషి తన తప్పులను తాను తెలుసుకొని.. సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తే స్వచ్చమైన నీటితో సమానం అవుతాడు...! విశ్వ..!
910)ప్రేమించడం నేరం కాదు కాని నిన్నకాక మొన్న నీలో పుట్టిన ప్రేమ కోసం...యవ్వనపు మత్తులో నువ్వు పుడతావని తెలిసింది మొదలు నిన్నే ప్రేమించే నీ తల్లిదండ్రుల ప్రేమను మరిచి ప్రవర్తించడం క్షమించరాని నేరం...! విశ్వ..!
911)కన్నీటి విలువ కష్టాలు విలువ తెలిసినవాడు కాగితం మీద కలం పెడితే భావం గుండెల్లోంచి , భాష అనుభవం నుంచి ,శిల్పం ఆవేశం నుంచి శైలి ఆవేదన నుంచి వస్తాయి ...
912)తన మనస్సు మీద నిగ్రహాన్ని సాధించలేని వ్యక్తి తన జీవితంలో ఎన్ని ఘన విజయాలు సాధించినా వృధా...! విశ్వ..!
913)కళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు మనసు మళ్ళిన ప్రతిచోటికి మనిషి వెళ్ళకూడదు ...!
914)కన్నీటి విలువ కష్టాలు విలువ తెలిసినవాడు కాగితం మీద కలం పెడితే భావం గుండెల్లోంచి , భాష అనుభవం నుంచి ,శిల్పం ఆవేశం నుంచి శైలి ఆవేదన నుంచి వస్తాయి ...
915)దైవమిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలువదు
916)తెలిసిన మూర్ఖుడు తెలియని చవట కన్నా పేద చవట ...- మేలియర్
917)అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరేవరకూ శ్రమించండి.
918)విద్య అనే మహావృక్షం వేళ్ళు చేదుగాను ఫలితం మధురం గాను ఉండును...!
919)ప్రతి మనిషి బ్రతకడానికి నీరు, కూడు, గూడు, గుడ్డ, డబ్బు ఎంత ముఖ్యమో వ్యక్తిత్వం అంతకన్నా ముఖ్యం...! - విశ్వ..!
920)గెలవాలనే తపన అందరికీ ఉంటుంది కాని గెలుపు కోసం ఎవరైతే శ్రమిస్తారో వారే విజేతలుగా నిలుస్తారు...! - విశ్వ..!
921)ప్రతీ నిమిషం ఎందరో పుడుతున్నారు మరెందరో మరణిస్తున్నారు, అందులో ఒకరిగా నువ్వు ఉండకూడదు...మనం ఉన్నా లేకున్నా మన పేరు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సాధించాలి అప్పుడే మన జన్మకు అర్ధం ఉంటుంది...!- విశ్వ..!
922)జన్మనిచ్చిన తల్లిని, జీవితాన్ని ఇచ్చిన తండ్రిని, చదువు చెప్పిన గురువుని...జన్మ భూమిని, ప్రాణ స్నేహితున్ని మరిచి బ్రతికేవాడు భూమికి భారం, బ్రతికున్న శవంతో సమానం...! - విశ్వ..!
923)మనం మాట్లాడే మాటలు కోమలంగా ఉండాలే కాని కర్కశంగా ఉండకూడదు...మన మాటలతో ఎవరినైనా మెప్పించేలా ఉండాలే కాని నొప్పించేలా ఉండకూడదు...!
924)తనకోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది. కాని ఇతరుల కోసం పాటు పడటం ఉత్తేజం కలిగిస్తుంది.
925)చేతినిండా పని,మనస్సు నిండా ఆలోచనలు ఈ రెండు మనిషి ప్రగతి రధానికి రెండు చక్రాలంటివి.
926)పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.
927)వికారమైన మనస్సు కంటే వికారమైన ముఖమే మంచిది.
928)మన పెదాలపై చిరునవ్వు ఎదుటివారి అలసటను క్షణకాలం దూరం చేసినా మనం దన్యులమే.
929)కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు.
930)ఇక్కడ నీ కోసం కన్నీళ్లు పెట్టే వాళ్లే కాదు....కనీసం ఆ కన్నీళ్లు వస్తే తుడిచే వాళ్లు కూడా ఉండరు....
931)తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
932)జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం
933)హార్దికంగా దెబ్బ తిన్న వాడికి చెయ్యాల్సింది ఆర్దిక సహాయం కాదు...మాట సహాయం... నేనున్నాననే గుండె ధైర్యం.........
934)అన్యాయం ,అత్యాచారం చేసేవాడికన్నా సహిన్చేవాడే పెద్ద ద్రోహి ...
935)మంచి చేసిన వారికీ మంచి చెయ్యటం గొప్ప కాదు .హాని చేసిన వారికీ ఇంతకుముందు వారు చేసిన చెడు గురించి ఆలోచించక ఉపకారము చేయువాడే నేర్పుకలవాడు --- సుమతి శతకం
936)విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకొన్నవాడే గొప్పవాడు
937)జీవితంలో అత్యున్నత స్థాయికి చేరినవారంతా ఏదో ఒకసారి ఓడిపోయినవారే,సుఖ సంతోషాలను అనుభావిస్తున్నవారంతా కష్టం రుచి తెలిసినవారే ..కాబట్టి తాత్కాలికమైన అపజయాలన్నీ చూసి బెదిరిపోకుండా ఎదుర్కోవాలి.అలాంటప్పుడే విజయంలోని మాధుర్యం తెలిసేది
938)జీవించడం అన్నది ముఖ్యంకాదు ఈ కొద్ది జీవితంలో మనం ఏమి చేసామన్నది ముఖ్యం.
939)తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
940)జీవితానికి అత్యున్నత లక్ష్యం ఏర్పరుచుకోవడం కష్టం. ఏర్పరుచుకుంటే దాన్ని సాధించడం సులభం.
941)అజ్ఞాని లేదా విజ్ఞాని తో చర్చ అర్ధవంతమైనది. కాని అర్ధజ్ఞాని తో చర్చ అర్ధం లేనిది.
942)ఎదుటి మనిషి చేసే తప్పులను క్షమించి సరిదిద్దే వాడు తన జీవితం లొ చాలా అరుదు గా తప్ప్పు చేస్తాడు.
943)నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.
944)అనురాగం కొనగలిగే ధనముంద ఈ లోకంలో ,
మమకారం విలువేంటో మరువకు సిరి మైకంలో ,
ఆనందం కొనలేని ధనరాశితో ఆనాధగా మిగిలకు
తెలిసి అడుగు వెయ్యకు ఎడారి వంటి ఆశలు వెనక
945)పాము బ్రతికి ఉన్నప్పుడు, చీమలను తింటుంది..పాము చనిపోయినప్పుడు, చీమలు దాన్ని తింటాయి.కాలం ఏ సమయములోనైనా మారవచ్చు, కాబట్టి,నీ జీవితములో ఎవరినీ నిర్లక్ష్యం చేయకు
946)ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తద్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం.
947)నిన్ను పుట్టిచ్చిన అ దేవుడి ఋణం తిరుచుకోగాలేవోమో గాని.. నిన్ను కన్నా, అ తల్లి ఋణం మాత్రం ఈ జన్మ లో తిర్చుకోలేవు...ట్రై చేస్తూనే ఉండు ...అశోక్
948)నాకు మల్లి జన్మ అంటూ ఉంటె నా తల్లి కి తల్లి గా పుట్టి .....ఆ తల్లి ఋణం తీర్చుకోవాలని ఉంది...
949)తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
950)అలిసిన అల విసుగు చెందక ఎలాగితే నింగిని తాకాలని ఎగిసెగిసి పడుతుందో అలాగే పట్టువదలని నీ కల నిజమయ్యే వరకు ద్రుఢమైన సంకల్పంతో .. సుస్థిరమైన నిర్ణయంతో .. నిర్మలమైన మార్గంతో . ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేయి నీకు కాదేది అసాధ్యం...! -- విశ్వ
951)చేసిన సహాయం ఎప్పుడు తిరిగివస్తుందా అని మాత్రం ఎదురుచూడకండి.జీవితంలో దానం చేయడం అనేదాన్ని ఒక భాగంగా మార్చుకోండి.అప్పుడే ఆ జీవితానికి ఓ అర్ధం పరమార్ధం --రఘురాం
952)కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు.
953)చీకటిని చీల్చుకొని వెలుగు ఉద్భవించిన క్షణం.. మానవాళి జీవితాలలో దీపావళి...! విశ్వ..!
954)జీవితంలో అత్యున్నత స్థాయికి చేరినవారంతా ఏదో ఒకసారి ఓడిపోయినవారే,సుఖ సంతోషాలను అనుభావిస్తున్నవారంతా కష్టం రుచి తెలిసినవారే ..కాబట్టి తాత్కాలికమైన అపజయాలన్నీ చూసి బెదిరిపోకుండా ఎదుర్కోవాలి.అలాంటప్పుడే విజయంలోని మాధుర్యం తెలిసేది
955)పెద్ద పెద్ద వేదాంత గ్రంథాలకన్నా చిన్న సూక్తులే మనిషి గుండెకి సూటిగా తగిలి హృదయానికి గాఢంగా హత్తుకోగలుగుతుంటాయి.
956)చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చ్యాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది.
957)అహంకారం - ఆత్మ విస్వాశం మద్య తారతమ్యమే నీ జీవిత జయ-అపజయాల మద్య అంతరాన్ని శాసిస్తుంది.
958)నీవు ఎంత ఐశ్వర్య వంతుడివి?అది తెలుసుకోవడానికి, నీ డబ్బుని లెక్కించకు.కేవలం, ఓ కన్నీటి బొట్టుని కార్చు..దాన్ని తుడచుటకు, ఎన్ని చేతులు చేరతాయో లెక్కించు అదే నిజమైన ఐశ్వర్యం.
959)జీవితం ఒక సముద్రం లాంటిది ,గమ్యం లేకుండా ముందుకు వెళ్తూనే ఉంటుంది.ఈ ప్రయాణంలో ఏమి మనతో మిగలదు, కేవలం అలల వలే మనలను తాకే ఇతరుల జ్ఞాపకాలే.
960)పుష్పానికి సూర్యరశ్మి ఎంత అవసరమో
మనిషికి చిరునవ్వు అంత అవసరము
మన జీవితాలకు సంవత్సరాలు జత చేయడం కాదు
మనం జీవించే సంవత్సరాలకు ప్రాణం పోయడమే చాలా ముక్యమైనది
961)జీవితములో అన్నిటికన్నా ముక్యం - ఒక లక్షాన్ని కల్గివుండి దాన్ని చేరుకోవడమే.
962)జీవితములో మాధుర్యమును అనుభవించాలంటే,(చేదు) గతాన్ని మరచి పోయే శక్తి ఉండాలి.
963)ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.
964)విద్య ఐశ్వర్యంలో ఆభరణము వంటిది; దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది.
965)సమస్యలు లేని మనిషి ఉండడు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది . కానీ కొంచం లోతుగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు ఒక పరిష్కారమనేది ఉంటుంది. అదే అనుభవాల స్థిరీకరణ.
966)ఏదో జరగాలని ఎదురుచూస్తూ కూర్చుంటే ఓటమి తద్యం. ఏది చేయాలో నిర్ణయించుకుని ముందుకు సాగితే గెలుపు సాధ్యం
967)నిన్ను పుట్టిచ్చిన అ దేవుడి ఋణం తిరుచుకోగాలేవోమో గాని.. నిన్ను కన్నా, అ తల్లి ఋణం మాత్రం ఈ జన్మ లో తిర్చుకోలేవు...ట్రై చేస్తూనే ఉండు ..
968)నాకు మల్లి జన్మ అంటూ ఉంటె నా తల్లి కి తల్లి గా పుట్టి .....ఆ తల్లి ఋణం తీర్చుకోవాలని ఉంది...
969)తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
970)అలిసిన అల విసుగు చెందక ఎలాగితే నింగిని తాకాలని ఎగిసెగిసి పడుతుందో అలాగే పట్టువదలని నీ కల నిజమయ్యే వరకు ద్రుఢమైన సంకల్పంతో .. సుస్థిరమైన నిర్ణయంతో .. నిర్మలమైన మార్గంతో . ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేయి నీకు కాదేది అసాధ్యం...!
971)చేసిన సహాయం ఎప్పుడు తిరిగివస్తుందా అని మాత్రం ఎదురుచూడకండి.జీవితంలో దానం చేయడం అనేదాన్ని ఒక భాగంగా మార్చుకోండి.అప్పుడే ఆ జీవితానికి ఓ అర్ధంపరమార్ధం
972)కామంనకు మించిన వ్యాధీ, బ్రాంతికి మించిన శత్రువూ, కోపానికి మించిన అగ్నీ, విద్యకు మించిన ఆనందం వేరొకటి లేదు
973)చీకటిని చీల్చుకొని వెలుగు ఉద్భవించిన క్షణం.. మానవాళి జీవితాలలో దీపావళి...! విశ్వ..!
974)పాము బ్రతికి ఉన్నప్పుడు, చీమలను తింటుంది..పాము చనిపోయినప్పుడు, చీమలు దాన్ని తింటాయి.కాలం ఏ సమయములోనైనా మారవచ్చు, కాబట్టి,నీ జీవితములో ఎవరినీ నిర్లక్ష్యం చేయకు
975)అనురాగం కొనగలిగే ధనముంద ఈ లోకంలో ,
మమకారం విలువేంటో మరువకు సిరి మైకంలో ,
ఆనందం కొనలేని ధనరాశితో ఆనాధగా మిగిలకు
తెలిసి అడుగు వెయ్యకు ఎడారి వంటి ఆశలు వెనక
976)అమ్మ ఋణం తిర్చుకోలేని బిడ్డల ఖర్మ ఫలం ఎన్ని పుణ్యనదులలో మునిగినా కరిగిపోదు...!.
977)ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మర్గాలున్నాయో అన్ని వినియోగించుకునేవాడే వివేకి
978)వ్యక్తి ఎంత తాను ఎదిగిన అంత ఒదిగి ఉంటె ఆ వ్యక్తి అందరి చేత గౌరవింపడతాడు
979)దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మ ని సృష్టించాడు...ప్రతి వాడు ఆ దేవుడు నాకేం ఇచ్చడు అనుకుంటునదే తప్ప తనకు కూడా లేని వరం మరియు ఈ సృష్టిలో విలువ కట్టలేని అమ్మ ప్రేమను ప్రసాదించాడు అని తెలుసుకోలేడు అందుకే మనిషి కోరుకోకున్న .. మనిషి అల్ప సంతోషి కదా ఏ వరం ఇచ్చిన దాని కన్నా ఎక్కువ కావాలని కోరుకుంటాడు.. అందుకే అన్నిటిని మిచ్చిన అమ్మను ఇచ్చాడు ....ఆ దేవుడు అన్నిటిని అనుబవించాడు అమ్మ ప్రేమను తప్ప.. ఆ దేవుడికి తెలుసు అమ్మ ప్రేమను మిచ్చిన వరం కానీ, ప్రేమ కానీ, ఇ లోకం లేదు అని ఎందుకంటే అందరికి అధిపతులు ఐన బ్రాహ్హ విష్ణు మహేశ్వరులకు అమ్మ లేదు కదా..
980)విజయాలు పరాజయాలు మానవ జీవితంలో సహజం...పరాజయాలు ఎదురైతే ,నిస్పక్షపాతంగా విశ్లేషణ చేసుకో...
కారణాలు గమనించి సరిదిద్దుకో ,తప్పు చేయడం తప్పు కాదు ,తప్పుని సరిదిద్దుకొకపోవడమే తప్పు..,ఆటంకాలని ఎదురుకోవడం నేర్చుకో ..మరింత ఉత్సాహంగా అడుగు ముందుకి వెళ్ళు.
981)చదువు పాటాలు చెప్పి పరిక్షలు పెడుతుంది,జీవితం పరిక్షలు పెట్టి పాటలు నేర్పుతుంది
982)మనం చేసే మంచి చెడులకు అనుగుణంగానే ఫలితాలు ఉంటాయి.అనుభవించే వాటికి కారణాలు మన కార్యల్లోనే కనబడతాయి.
983)సమస్యలు లేని మనిషి ఉండడు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది . కానీ కొంచం లోతుగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు ఒక పరిష్కారమనేది ఉంటుంది. అదే అనుభవాల స్థిరీకరణ.
984)కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఆశాజీవిగా బ్రతకటం ఎంత అవసరమో ,ఇంకొకరికి భాద చూసినప్పుడు కూడా వారి భాదను పోగెట్టి, వారికొక ప్రోత్సాహకరమైన మాట చెప్పటం అంతే అవసరం
985)సంసార భారం మోయడం కంటే సముద్ర సాగరం ఈదడం సులువు
986)ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే.
987)అన్నిటికీ భయపడే వారు ,భాద్యత స్వీకరించాలేని వారూ ,జీవితంలో ఎదగలేరు
988)కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది.ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకరమవుతుంది
989)నాది అనుకునే స్వార్ధం మరానన్నిరోజులు ఈ మనుషులు మారారు ,ఈ లోకం మారదు........అశోక్ ..
990)మనిషి ఉన్నత లక్ష్యాలను సాదిన్చలనుకొనప్పుడు ,వచ్చే ఆటంకాలను లెక్క చెయ్యకుండా ,అనుకున్న పనిని సాదించేదాకా అలిసిపోకుండా ధైర్యంతో ముందు అడుగు వేయాలే తప్ప భయపడి వెనుతిరగరాదు .అప్పుడే మనిషి కార్యసాధకుడవుతడు
991)దాన గుణమనేది మనిషికి పుట్టుకతో వాచీ సహజ గుణం.అంతే కానీ అది మనిషి సంపద మీద ఆధార పడేదిగా ఉండదు.
992)మాట మెల్లగా మాట్లాడాలి ,పని పదునుగా చేయాలి మనిషి కార్యశీలి కావాలి
993)ఆత్మ విశ్వాసం,దృడ సంకల్పం ఈ రెండు ఉంటె ,జీవితంలో మనిషి సాధించనది ఏదీ లేదు
994)తీసుకోవడంకన్న ఇవ్వడంలోనే సంతృప్తి ఉంది.పెత్తనం కన్నా సేవే పవిత్రం
995)తియ్యని కలలకు చేదు నిజాలు తోడు అయితే అది జీవితం, ఆ చేదు నిజాలను పెదాలు మద్య నొక్కి పెడితే అది చిరునవ్వు, ఆ నవ్వులు అందరికి పంచితే ఆనందం, ఆ అనందం ప్రేమ తో ఆరంబం...ద్వేషంతో సమాప్తం !
996)మనుషులను వారి డీగ్రీలను, మేధోసంపత్తిని చూసి అంచనా వేయకండి. అతని మనసును, ఆలోచనా విధానాన్ని బట్టి అంచనా వేయండి
997)కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.కొత్త ఆశలు ,కొత్త ఆశయాలు .కొత్త నిర్ణయాలు .బాధలు పోవాలి.దుఖం నశించాలి.అందరి సమస్యలు సమసిపోవాలి.కష్టాలు,కన్నీళ్లు లేని కొత్త ప్రపంచం రావాలి.చీకటి లేని వెలుగు లోకంలో జీవించాలి.కష్టాలు వచ్చాయని ,రాకుడదని వాపోడం కంటే వచ్చేదేదైనా కానీ,వాటిని ఎదుర్కునే శక్తీ దేవుడు అందరికి ఇవ్వాలని కోరుకుంటూ...నూతన సంవత్సర శుభాకాంక్షలు....
998)ఓర్పు ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
999)ఓటమి అనేది కుంగిపోవలసినది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి పనికివచ్చే నిచ్చెన అది
1000)తనలో తాను తృప్తి పొందలేనివాడు బయట ఎక్కడా దానిని పొందలేడు[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము