(Telugu) శ్రీరాముని దయచేతను

[:te]శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా
ధారాళమైన నీతులు
నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ!

తాత్పర్యం: మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము