(Telugu) కొన్ని మంచి మాటలు!

[:te]



ధర్మఏవ హతో హంతి, ధర్మోరక్షతి రక్షతః
తస్మాద్ధర్మోన హంతవ్యో మానో ధర్మోహతోవధీత్

ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మనల్నే బాధిస్తుంది.ధర్మాన్ని రక్షిస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి  ధర్మాన్ని నాశనం చేయకూడదు.ధర్మం నశించి మనలను నశింప చేయకుండుగాక.
----------------------------------------------------------------------------------------------
అష్టాదశ పురాణానం సారంసారం సముద్ధృతం
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం.

18 పురాణాల సారాన్ని పిండగ పిండగా తేలినది ఏమనగా పరోపకారం చేస్తే పుణ్యం - పరపీడనం చేస్తే పాపం.
----------------------------------------------------------------------------------------------


అన్నంన నింద్యాత్, తద్రవతము - తైత్తరీయ సంహిత.


అన్నాన్ని పారవేయటము కాని, అగౌరపరచటముకాని,వ్యర్ధపరచటముకాని చేయరాదు.శ్రద్ధగా చేయాలి.


-----------------------------------------------------------------------------------------------


గుణాః పూజాస్థానం గుణిఘ నచ లింగం న చవ వయః


గుణాలే గౌరవానికి కారణం.గుణవంతుల విషయంలో లింగభేదం కాని వయోభేదం కాని పాటించకూడదు.


-----------------------------------------------------------------------------------------------

కరార విందేన పదార విదం,ముఖారవిందే వినివేశయంతం


వటస్య పత్రస్య పుటేశయానం,బాలం ముకుందం మనసాస్మరామి.


పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.



[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము