(Telugu) సుమతీ శతక పద్యాలు ...
[:te]ఉత్తమ గుణములు నీచున
కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలం దా
నెత్తిచ్చి కఱగిపోసిన
నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ !
వివరణ : ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లుకానేరదో
అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు .
---------------------------------------------------------
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్
వడిగల యెద్దులఁ గట్టుక
మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ!
వివరణ : అడిగినప్పుడు జీతమియ్యని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది.
--------------------------------------------------------
కనకపు సింహాసమున
శునకముఁ గూర్చుండఁ బెట్టి శుభలగ్నమునం
దొనరఁగఁ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!
---------------------------------------------------
స్త్రీల యెడల వాదులాడక
బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ
మేలైన గుణము విడువకు
ఏలిన పతి నింద సేయకెన్నడు సుమతీ!
వివరణ : స్త్రీలతో ఎన్నడూ గొడవ పడద్దు, చిన్న పిల్లలతో స్నేహం చేసి మట్లాడవద్దు,
మంచి గుణాలను వదల వద్దు,యజమానిని దూషించవద్దు....
---------------------------------------------------
అడియాస కొలువుఁ గొలవకు
గుడిమణియము సేయఁబోకు , కుజనులతోడన్
విడువక కూరిమి సేయకు
మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ !
వివరణ : వృధా ప్రయాసయగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము.
చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయములేకుండా ఒంటరిగా పోకుము.
---------------------------------------------------
అధరము గదలియుఁ గదలక
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ
నధికార రోగపూరిత
బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ !
వివరణ : పెదవి కదలీ కదలకుండా తీయనైన మాటలు మాని, మాటలాడనను నియమము పూని, అధికారవ్యాధిచే నిండిన చెవిటి గ్రుడ్డి పీనుగువంటి అధికారిని జూచుట పాపము.
---------------------------------------------------
అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు
నెప్పుడు నెడతెగక పాఱె డేఱును ద్విజుఁడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరుఁ జొరకుము సుమతీ!
వివరణ : ఋణము ఇచ్చువాడును, వైద్యుడును, ఎల్లప్పుడు ప్రవహించు నదియును, బ్రాహ్మణుడును గల గ్రామమందు నివసించుము. వారు లేనట్టి గ్రామమునందు ప్రవేశింపకుము.
---------------------------------------------------
అప్పుగొని చేయు విభవము
ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్
దప్పరయని నృపరాజ్యము
దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ !
వివరణ : ఋణము దెచ్చుకొని అనుభవించు సౌఖ్యము, ముసలితనమందు పడుచుభార్య,
తప్పిదములను కనిపెట్టని రాజు రాజ్యము సహింపరానిదై చివరకు హాని తెచ్చిపెట్టును.
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి యన్యుల మనముల్
నొప్పించక తానొవ్వక
తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ !
****************************************
పుత్రోత్సాహము తండ్రికి
బుత్రుఁడు జన్మించినపుడే పుట్టదు జను లా
పుత్రునిఁ గనుఁగొని పొగడఁగఁ
బుత్రోత్సాహంబు నాడు పొందు ర సుమతీ !
****************************************
సరసము విరసము కొఱకే
పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొఱకే
పెరుఁగుట విరుఁగుట కొఱకే
ధర తగ్గుట హెచ్చుట కొఱకె తథ్యము సుమతీ !
****************************************
ఎప్పుడు సంపద కలిగిన
నప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్
దెప్పలుగ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁగదరా సుమతీ !
***************************************
ఎప్పుడుఁ దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వకూడదది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ
***************************************
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని మోహరమునఁ దా
నెక్కినఁ బాలుని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ !
***************************************
కనకపు సింహాసనమున
శునకముఁ గూర్చుండబెట్టీ శుభ లగ్నమునం
దొనరగఁ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !
***************************************
కూరిమి గల దినములలో
నేరములెన్నఁడు గలుగనేరవు
మఱియా కూరిమి విరసంబైనను
నేరములే తోఁచుచుండు నిక్కము సుమతీ !
***************************************
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్,
హేమంబుఁ గూడబెట్టిన
భూమీశుల పాలఁ జేరు భువిలో సుమతీ !
***************************************
లావుగలవానికంటెను
భావింపఁగ నీతిపరుఁడు బలవంతుఁడు
గ్రావంబంత గజంబును
మావటివాఁడెక్కినట్లు మహిలో సుమతీ !
***************************************
వినఁదగునెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపఁదగున్
కనికల్ల నిజముఁ తెలిసిన
మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ !
***************************************[:]

Comments
Post a Comment