(Telugu) మనసును మార్చే కొన్ని మాటలు
[:te]అనందం గా ఉండడానికి 5 చిట్కాలు : 1. ద్వేషాన్ని దూరం చేయండి. 2. చెడు ఆలోచనలకు దూరం గా ఉండండి. 3. వీలైనంత సాధు స్వభావం కలిగి ఉండండి . 4. ఎక్కువ ఇవ్వండి. 5. తక్కువ ఆశించండి. 741)వెక్కి వెక్కి ఏడిస్తే వెతలు తీరునా..కలతసెంది కూకుంటే కతలు మారునా.. అంతటి సూరీడుకైనా తప్పదుగా గ్రహణం అంతటితో కృంగిపోతే ఉంటుందా ఉదయం??" 742)సజ్జనులతో సాంగత్యము వలన,వారితో సంభాషించడము వలన మనలోని దుర్గుణములు తొలగిపోతాయి.మంచి వారితో కలిసి మెలసి తిరగడము వంటికి గంధము పూసుకోవడము వంటిది. శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత యెలా దూరము చేస్తుందో , అలాగే సజ్జన సాంగత్యము మనలోని వలక్షణాలని దూరము చేస్తుంది 743)మంచి పుస్తకాలు నిశ్శబ్ద మిత్రులు. అవి మనకి ఎప్పుడూ అందుబాటు లో ఉండే మర్గదర్శకులు. తిరుగు లేని ఉపాధ్యాయులు. 744)ఎప్పుడైతే ఒక వ్యక్తి నిన్ను కోపకూపంలోకి దించాడో, ఆ క్షణమే అతను నిన్ను జయించినట్టు.. 745)మనిషి ఆనందం కన్నా కస్టాలను సులభంగా లెక్కపెడుతున్నాడు. అదే ఆనంద క్షణాలను లెక్కించి ఉండి ఉంటే కస్టాలలో కూడా ఆనందమే కనపడి ఉండేది. 746)నాకు నచ్చిన కొన్ని మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే 1.ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయ...