Posts

Showing posts from June, 2019

శ్రీ రామచరిత్ర - రామాయణము పోతన భాగవతము నుండి

మత్తేభము: అమరేంద్రాశకుబూర్ణచంద్రుడుదితుండైనట్లునారాయణాం శమునం బుట్టె మదాంధ రావణశిరస్సంఘాతసంఛేదన క్రమణోద్దాముడు రాము డాగరితకు గౌసల్యకున్ నన్ను తా సమనైర్మల్య కతుల్య కంచితజనుస్సంసారసాఫల్యకున్. తూర్పుదిక్కుకు నిండుచంద్రుండు ఉదయించినట్లుగా పొగడదగినదీ, పరిశుద్దురాలూ, సంసారసాఫల్యాన్ని పొందినదీ, సాటిలేనిసాధ్వి అయినా కౌసల్యకు, గర్వాంధుడైన రావణుని తలలను ఖండించుటలో గడిదేరిన శ్రీ రాముడు నారాయణాంశతో జన్మించాడు.  మత్తేభము: సవరక్షార్థము దండ్రి పంప జని విశ్వామిత్రుడుం దోడరా నవలీలం దునుమాడె రాము డదయిండై బాలుడై కుంతల చ్చవిసంపజితహాటకం గపటభాషావిఫురన్నాటకన్ జవభిన్నార్యమఘోటకం కరవిరాజ త్ఖేటకమ్ దాటకన్. * బాలుడైన ఆ రాముడు తండ్రి పంపగా యాగాన్ని కాపాడ్డానికి విశ్వామిత్రునివెంట వెళ్ళాడు. వెళ్ళి బంగారు రంగు జుట్టు కలదీ, కవటపు మాటలతో కూడిన నటనకలిగినదీ సూర్యుడి గుఱ్రాలకంటె వడిగా పరుగులెత్తేదీ, చేత డాలుకలిగినదీ అయిన తాటక అనే రాక్షసిని ఏ మాత్రం దయతలచక అవలీలగా నేలకూల్చాడు.  కందము: గారామున గౌశికమఖ మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్ ఘోరాజిద్రుంచి తోలెను మారీచున్నీచు గపటమంజులరోచున్ * ఆ రాముడు బలవంతుడైన సుబాహుణ్...

(Telugu) సుమతీ శతక పద్యాలు ...

[:te]ఉత్తమ గుణములు నీచున కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యెడలం దా నెత్తిచ్చి కఱగిపోసిన నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ ! వివరణ : ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరగించి పోసినను బంగారము ఎట్లుకానేరదో అదేవిధముగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు . --------------------------------------------------------- అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దులఁ గట్టుక మడి దున్నుక బ్రతక వచ్చు మహిలో సుమతీ! వివరణ : అడిగినప్పుడు జీతమియ్యని గర్వియైన ప్రభువును సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయముచే జీవించుట మంచిది. -------------------------------------------------------- కనకపు సింహాసమున శునకముఁ గూర్చుండఁ బెట్టి శుభలగ్నమునం దొనరఁగఁ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ! --------------------------------------------------- స్త్రీల యెడల వాదులాడక బాలురతో చెలిమి చేసి భాషింపకుమీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నింద సేయకెన్నడు సుమతీ! వివరణ : స్త్రీలతో ఎన్నడూ గొడవ పడద్దు, చిన్న పిల్లలతో స్నేహం చేసి మట్లాడవద్దు, మ...

అసాధ్యం సుసాధ్యం

కొన్ని వందల ఏళ్ళ క్రిందట ఇటలీ దేశంలోని ఒక పట్టణం లో ఒక వ్యాపారస్థుడు ఉండేవాడు. అతని దురదృష్టం కొద్దీ ఒక వడ్డీ వ్యాపారికి పెద్ద మొత్తంలో సొమ్ము బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలై వాడైనా మంచి జిత్తుల మారి. అతనికి తనకి బాకీ ఉన్న వ్యాపారి కూతుర్ని ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలనే దుర్బుద్ధి పుట్టింది. దాంతో అతని కూతుర్ని తనకిచ్చి వివాహం జరిపిస్తే అప్పు మొత్తాన్నీ మాఫీ చేస్తానని ప్రతిపాదన చేశాడు. ఆ వ్యాపారి, అతని కూతురికీ ఈ ప్రతిపాదన వినగానే చాలా భయం వేసింది. ఆ వడ్డీ  వ్యాపారి పందెం ఇలా ఉంది. అతను ఒక ఖాళీ సంచీ లో ఒకే పరిమాణం, ఆకృతిలో ఉండే ఒక తెల్ల రాయి, ఒక నల్ల రాయి వేస్తాడు. ఆ అమ్మాయి ఆ రెండు రాళ్ళలో ఒకటి బయటికి తీయాలి. ఒక వేళ ఆమె నలుపు రాయి బయటికి తీస్తే అతన్ని పెళ్ళి చేసుకోవాలి. ఆమె తండ్రి అప్పు చెల్లించనవసరం లేదు. ఒక వేళ ఆమె తెల్ల రాయి బయటికి తీస్తే ఆమె అతన్ని పెళ్ళి చేసుకోనక్కర్లేదు కానీ తండ్రి బాకీ పడ్డ సొమ్ము చెల్లించనక్కర్లేదు. కానీ ఆమె రాయి తీయనంటే మాత్రం ఆమె తండ్రి జైలు పాలు కావాల్సి ఉంటుంది. వాళ్ళు ముగ్గురూ వ్యాపారి ఇంట్లో ఉన్నారు. వాళ్ళు నిల్చున్న దారిలో రకరకాల రాళ్ళున్నాయి. వాళ...

(Telugu) నిజ జీవితంలో సక్సెస్ఫుల్ పెర్సన్.

[:te] కట్టెలు కొట్టే ఒక బీధ వ్యక్తి ఉజ్జోగం కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెల్తాడు.. తనకు ఎదయినా పని ఇప్పించమని రిక్వెస్ట్ చేసాడు.. ఆ కట్టెలు కొట్టే వాడిని చూసిన పెద్దాయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.. కారణం కండలు తిరిగిన శరీరం అంతకు మించి పని మీద శ్రద్ద పని చేసి సంపాదించాలనే తపన... పని ఇవ్వాలని నిర్దారనకు వచ్చి ఒక అడవి వద్దకు తీసుకుని వెళ్ళి.. ' ఇది మనం లీజుకు తీసుకున్న భాగం.. నీకు సాధ్యమయినన్ని కట్టెలు కొట్టి.. సాయంకాలనికి నాకు లెక్క చెప్పాలి.. ' అని పనిని అప్పగించి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.. కట్టెలు కొట్టే వ్యక్తి తన పనిని మొదలు పెత్తి.. మొదటి రోజు 10 ఎద్దుల బడెలు నిండేలా కట్టెలు రెడి చేసి ఓనర్ కు లెక్క చ ెప్తాడు.. మొదటి రోజు తన పనిని చూసిన పెద్దాయన చాలా సంతోషించి.. తన పనిని గొప్పగా పొగుడుతాడు.. అలాగే రెండవ రోజు కూడా కట్టెలు కొట్టే వ్యక్తి 9 ఎడ్ల బండ్లు నిండేలా కట్టేలు కొడతాడు... సాయంకాలం ఓనర్ కు లెక్క చెప్తాడు... అలా అయిదు రోజులు గడిచే సరికి 6 ఏడ్ల బండ్లు నిండేలా మత్రమే కట్టెలు కొడతాడు.. రోజు రోజుకు పని సామర్ద్యం తగ్గిపోతుందే అని బాద పండిన కట్టెలు కొట్టే వ్యక్తి తన యజమానితో జరు...

(Telugu) కొన్ని మంచి మాటలు!

[:te] ధర్మఏవ హతో హంతి, ధర్మోరక్షతి రక్షతః తస్మాద్ధర్మోన హంతవ్యో మానో ధర్మోహతోవధీత్ ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మనల్నే బాధిస్తుంది.ధర్మాన్ని రక్షిస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి  ధర్మాన్ని నాశనం చేయకూడదు.ధర్మం నశించి మనలను నశింప చేయకుండుగాక. ---------------------------------------------------------------------------------------------- అష్టాదశ పురాణానం సారంసారం సముద్ధృతం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణాల సారాన్ని పిండగ పిండగా తేలినది ఏమనగా పరోపకారం చేస్తే పుణ్యం - పరపీడనం చేస్తే పాపం. ---------------------------------------------------------------------------------------------- అన్నంన నింద్యాత్, తద్రవతము - తైత్తరీయ సంహిత. అన్నాన్ని పారవేయటము కాని, అగౌరపరచటముకాని,వ్యర్ధపరచటముకాని చేయరాదు.శ్రద్ధగా చేయాలి. ----------------------------------------------------------------------------------------------- గుణాః పూజాస్థానం గుణిఘ నచ లింగం న చవ వయః గుణాలే గౌరవానికి కారణం.గుణవంతుల విషయంలో లింగభేదం కాని వయోభేదం కాని పాటించకూడదు. --------------------------------------------------------...

(Telugu) శ్రీరాముని దయచేతను

[:te] శ్రీరాముని దయచేతను నారూఢిగ సకలజనులు నౌరాఁయనగా ధారాళమైన నీతులు నోరూరఁగఁ జవులుపుట్ట నుడివెద సుమతీ! తాత్పర్యం:  మంచిబుద్ధి గలవాడా! శ్రీరాముని దయవల్ల నిశ్చయముగా అందరు జనులనూ శెభాషని అనునట్లుగా నోటి నుంచి నీళ్లూరునట్లు రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను చెప్పెదను.[:]

(Telugu) అక్కరకు రాని చుట్టము

[:te] అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా నెక్కినఁ బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ! తాత్పర్యం :  అవసరమునకు పనికిరాని చుట్టమును, నమస్కరించి వేడిననూ కోరిక నెరవేర్చని భగవంతుని, యుద్ధ సమయమున ఎక్కినప్పుడుముందుకు పరిగెత్తని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయును. ఈ పద్యం లో అవసరం లో మన వెంట రాని బంధువులను వదిలెయ్యడమే మంచిదని చెప్తున్నారు. ఈ విషయం లో ప్రతి ఒక్కరి జీవితం లో ఏదో ఒకఅనుభవం ఎదురయ్యే ఉంటుదని నా అభిప్రాయం. చిన్నప్పటి నుంచి ప్రతీ ఇంట్లో బంధువులను గురించి వచ్చిన ఎన్నో సమస్యలు చూసేఉంటాము. అసలు మనకి ఏదన్నా సమస్య వస్తే దాని పర్యవసానం గురించి బాధ పడటం కన్నా మన బంధువులు ఏమనుకుంటారు, మన గురించి మనకుటుంబాలలో ఎలాంటి మాటలు వినాల్సివస్తుంది అన్న విషయాలే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంటాయి. ఓకోసారి వాస్తవం లో జరిగే దాని కన్నా ముందుగానే ఎక్కువ ఊహించి భయపడి బాధపడే వాళ్ళను నేను, మీరు చాలా సార్లు చూసే ఉంటాము. ఏదయినా విషయం లో మనకి జరిగితే ఎలాస్పందిస్తామో ఎదుటి వాళ్ల గురించి కుడా అలాగే ఆలోచించగలిగితే మనిషిగా మన జీవితానికి కొంతైనా సార్ధకత్వం వస్తుందని నా అభిప్రాయం. ఎలాంటిమాటలక...

(Telugu) అడిగిన జీతంబియ్యని

[:te] అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరనుగొల్చి మిడుకుటకంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుకవచ్చు మహిలో సుమతీ! తాత్పర్యం :  అడిగినప్పుడు జీతమును ఈయని గర్వి అయిన ప్రభువును సేవించి జీవించుట కంటే, వేగముగా పోగల ఎద్దులను నాగలికి కట్టుకునిపొలమును దున్నుకొని వ్యవసాయం చేసుకోవడం మంచిది. కూటికోసం కోటి విద్యలు అన్నట్టుగా...మన జీవనభ్రుతి కోసం ఎక్కడో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం. యజమాని దగ్గర వినయ విధేయతలతో మనకి అప్పగించిన పనిని నిజాయితీగా, బాధ్యతగా చేస్తూ ఉంటాం.  ఐతే ...  అందరు   boss లూ  ఒకలా   ఉండరు  :)  మన చేత బాగా గొడ్డు చాకిరీ చేయించుకుని న్యాయంగా జీతం పెంచాల్సివచ్చినప్పుడు కానీ , తప్పనిసరి అవసరానికి సెలవు తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, చాలా నిర్ధయగా, అధికార గర్వంతో ప్రవర్తించే యజమాని (boss :) ) దగ్గర ఉద్యోగం చేయడం కన్నా మన సొంత శక్తుల మీద ఆధారపడి బతకడం మేలు అని ఈ పద్యం నుంచి భావం వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా మనకి అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి... ఈ సుమతీ పద్యాన్ని ఒకసారి గుర్తుతెచ్చుకుందాం. మీరేమంటారూ మరి?? మరొక చిన్న విషయం... ఈ పద్యంలో  మిడిమేలం  అని ఒక పదప్రయోగం ఉంది. గమనించారా..? గర్వం, ...

(Telugu) అడియాస కొలువుఁ గొలువకు

[:te] అడియాస కొలువుఁ గొలువకు గుడిమణియము సేయఁబోకు కుజనులతోడన్‌ విడువక కూరిమి సేయకు మడవినిఁదో డరయఁకొంటి నరుగకు సుమతీ! తాత్పర్యం :  వృధా ప్రయాస అగు సేవను చేయకుము. గుడి ధర్మకర్తృత్వమును చేయకుము. చెడ్డవారితో స్నేహము చేయకుము. అడవిలో సహాయంలేకుండా ఒంటరిగా పోకుము. ఈ పద్యంలో ఈ వృధా ప్రయాస అయిన సేవ చేయద్దని చెప్తున్నారు. ఒకోసారి మన యజమానికి ధర్మబద్దంగా ఆలోచించే మనస్తత్వం లేకపోతే, మనం ఎంతో కష్టపడి చేసే పని వల్ల కూడా మనకేమి ఉపయోగం కలగదు. మన సేవ వల్ల ఉపయోగం ఉండదని తెలిసినా కొన్ని పరిస్థితుల దృష్ట్యా తప్పక చేయాల్సివస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన వ్యక్తిత్వానికి సరిపడే నిర్ణయాన్ని తీసుకోడానికి, మళ్లీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి చాలా గుండె ధైర్యం కావాలి. కాని  " స్వధర్మే   నిధనం   శ్రేయః   పరధర్మో   భయావహః "  అని చెప్పినట్టుగా మన సొంత విలువలకి, నిర్ణయాలకి కట్టుబడి ఉంటే కష్టమైనా, సుఖమైనా అందులోనే ఆత్మ సంతృప్తి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇక చెడ్డవారితో స్నేహం చేయకూడదని మనం చిన్నప్పుడు చాలా పంచతంత్రం కథల్లో నేర్చుకున్నాము. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అతని చుట్టూ ఉన్న స్నేహితులని బట్టి తెలుస...

(Telugu) అప్పుగొని సేయు విభవము

[:te] అప్పుగొని సేయు విభవము ముప్పునఁ బ్రాయంపుటాలు మూర్ఖుని తపమున్‌ దప్పురయని నృపురాజ్యము దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ! తాత్పర్యం :   రుణము   తెచ్చుకొని   అనుభవించు   సౌఖ్యము ,  ముసలితనంలో   పడుచు   భార్య ,  తప్పులను   కనిపెట్టని   రాజురాజ్యము   సహింపరానివి .  చివరకు   హాని   కలిగించేవి . అప్పు చేసి పప్పు కూడు తరహాలో జీవించకూడదు.. అది ఎప్పటికైనా ముప్పే అని ఈ పద్యం చెప్తుంది. మన పెద్దవాళ్ళు అన్నట్టు పెళ్లి చేసుకోవడానికి కాస్త ఈడు జోడు ఉండాలి అంటూ ఉంటారు. నేననుకోడం ఏంటంటే ఈ శతకం రచనాకాలంలో కన్యాశుల్కం లాంటి దురాచారాలు ఉండేవేమో కదా... అప్పట్లో చిన్న చిన్న అమ్మాయిలని పండు ముదుసలికిచ్చి పెళ్ళిళ్ళు చేసేవారు ధనం కోసం. అలా చేయడం ఎంత ఘాతుకమో కదా..అలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయి ఆ ముసలినే ఇష్టపడి అతని దగ్గరే ఉండే అవకాశం చాలా తక్కువ కదా..ఆయా మనుషుల మనస్తత్వాన్ని బట్టి ఇవన్నీ చాలా సమస్యలకి దారి తీస్తాయి చివరికి. ఇక పోతే ..తప్పులను కనిపెట్టని రాజు రాజ్యం.. అంటే జనాల కోసం కాకుండా తమ స్వార్ధం చూసుకునే ఈనాటి ప్రభుత్వాలు, రాజకీయనాయకుల లాగ అన్నమాట. ఇవన్నీ ఎప్పటికైనా హాని కలిగించేవేనని ఈ పద్యం లో నీతి వ...

(Telugu) అల్లుని మంచితనంబును

[:te] అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్యవిద్య, కోమలి నిజమున్‌ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ! తాత్పర్యం:  అల్లుడి మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ఞానం, ఆడదానియందు నిజం, పొల్లు ధాన్యములో బియ్యం, తెల్లని కాకులూ లోకములోఉండవు. అల్లుడు అనేవాడు ఎప్పుడూ అత్త మామలని పీడించడానికే తప్ప మంచిగా ఉండడని ఈ పద్యంలో చెప్తున్నారు. మన తెలుగు సాంప్రదాయంలో కట్నాలు, సారెలు, సాంప్రదాయాలు కూతురికి ప్రేమగా కానుకలు ఇచ్చేందుకు వచ్చాయి. కానీ, చివరికి అవి అల్లుడి హక్కులాగా మారాయి. మనంప్రపంచం చాలా మారింది, అందరూ చదువుకుని చాలా విజ్ఞానవంతులవుతున్నారు. అందుకని అబ్బాయిలు చాలా మారిపోతున్నారు అనిఅనుకుంటున్నారు అందరూ. మారే వాళ్లు చాలా తక్కువ శాతం మంది. ఎంత చదువుకున్నా, ఏ దేశం వెళ్ళినా కట్న కానుకలని మాత్రం మర్చిపోట్లేదు. అన్నిటికంటే బాధాకరమైన సంగతి ఏంటంటే మన భారతదేశం లో వేరే అన్ని రాష్ట్రాల్లో ఈ కట్నాల గోల మన తెలుగు వాళ్ళంత లేదు. ఇందులో మనమే ప్రధమ స్థానం. మా అబ్బాయికి 2 కోట్లు కట్నం అని ఒకళ్ళు, 4 కోట్లు అని ఒకళ్ళు...చివరికి ప్రస్తుతం పెళ్లి వ్యాపారం కూడా real estate ని మించిపోతుంది. విదేశాలకి వెళ్...

(Telugu) ఆఁకొన్న కూడె యమృతము

[:te] ఆఁకొన్న కూడె యమృతము తాఁకొందక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్‌ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువగలవాఁడె వంశ తిలకుఁడు సుమతీ! తాత్పర్యం:  లోకంలో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతము, బాధ పొందకుండా ఇచ్చువాడే దాత, ఆవేశాన్ని ఓర్చుకొనేవాడే మానవుడు, ధైర్యంకలవాడే వంశశ్రేష్ఠుడు. ఆకలితో ఉన్నప్పుడు అన్నం అమృతంలాగా ఉంటుందంటున్నారు. ఈ సంగతి మనందరికీ కనీసం ఒక్కసారయినా అనుభవం అయ్యే ఉంటుదని కదా...! అసలు అలాంటివి అప్పుడప్పుడు జరిగితేనే మనకు కూడా ఆ విలువ తెలిసి వస్తుంది. ఈ సంగతి చెప్తుంటే నాకొకటి జ్ఞాపకం వస్తుంది. నేను ఇంటర్మీడియట్ చదవడానికి హాస్టల్ లో మొదటిసారిగా చేరాను. మెస్ కి వెళ్ళిన ప్రతీ పూట నా కంచంలో కనీసం సగభాగం పడెయ్యడానికి ఉండేది. నిజానికి ఆ హాస్టల్ లో భోజనం చాలా బావుంటుంది. ఆ సంగతి నాకు తరవాత వేరే వేరే hostels కి వెళ్ళినప్పుడు అర్ధం అయింది :) అప్పట్లో నాకు రోజూ సరిగ్గా తినబుద్ది కాక పడేస్తూనే ఉండేదాన్ని. అలా ఎంత అన్నం వేస్ట్ అయ్యిందో అప్పుడు ఆలోచించలేదు కానీ, ఇప్పుడు గుర్తు వస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. అయితే ఒక సారి నేను Masters చదువుతున్నప్పుడు ఒక ఆదివారం ఉదయం నుంచి ఏమీ తినక చాలా ఆకలిగా ఉంది. మా మ...

(Telugu) ఇమ్ముగఁ జదువని నోరును

[:te] ఇమ్ముగఁ జదువని నోరును అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్‌ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! తాత్పర్యం:  ఇంపుగా పఠింపని నోరు, అమ్మా అని పిలిచి అన్నం అడగని నోరు, తమ్ముడూ అని పిలవని నోరు కుమ్మరివాడు మన్ను తవ్విన గోయితోసమానం సుమా! ఈ సృష్టిలో ప్రతీ జీవి తన భావాలని ఇంకో జీవికి తెలియపరుస్తుంది ఏదో ఒక రకంగా..ఏ సైగలతోనో...కానీ, మరే జీవికీ లేనిది, మనుషులకి మాత్రమే ప్రత్యేకంగా దేవుడిచ్చిన వరం...మాట్లాడగలగడం. కానీ, చాలా సార్లు చాలామంది మనుషులు నోరు తినడానికి మాత్రమే ఉన్నట్టు ప్రవర్తిస్తారు. లేదా...ఏదయినా మాట్లడేయచ్చు నోరు ఉంది కాబట్టి అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఈ పద్యం లో చూడండి ఏమి చెప్పారో...చక్కగా నోరారా చదవని, అమ్మా, తమ్ముడూ..అని ప్రేమగా పిలవని నోరు...మట్టి గుంటతో సమానం అంటున్నారు. దీనితో పాటు మనం పాటించాల్సింది ఇంకోటి ఉంది. మనకి నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని నోటికెంత మాటొస్తే అంత మాటలు మాట్లాడకూడదు. మీరు గమనిస్తే, ఎదుటి వాళ్లు భయం చేతనో, ప్రేమ చేతనో ఎదురు మాట్లాడలేరు అనుకున్నప్పుడే అలా అడ్డదిడ్డంగా మాట్లాడే పొగరు వస్తుంది. ఉదాహరణకి చాలా మంది పై అధికారులు ...

(Telugu) ఉడుముండదె నూరేండ్లును

[:te] ఉడుముండదె నూరేండ్లును బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌ మడుపునఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ! తాత్పర్యం:  ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటిజీవితాలన్నీ నిరుపయోగాలే. మానవునిజీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి. ఈ సృష్టి లో ఎన్నో రకాల జీవులున్నాయి. ఈ సృష్టిలో ప్రతీ జీవికి, ప్రతీ వస్తువుకీ ఏదో ఒక అర్ధం ఉంటుంది తప్పకుండా.. నిజం చెప్పాలంటే ప్రాణులన్నీ కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలి. అప్పుడే ఈ సృష్టి సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. అంటే బ్యాక్టీరియా లాంటి జీవులు లేకపోతే ఈ ప్రపంచంలో ఏది degrade అవ్వదు. అలాగే శాఖాహారులు, మాంసాహారులు అయిన ఎన్నో జీవులు దేని జీవన విధానం అది పాటించడం వల్లనే ఈ జీవన చక్రంఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ...ఇంక మనిషి విషయానికి వస్తే, ఈ జీవ పరిణామ క్రమంలో ఎదిగిన అన్నీ జీవుల్లోకీ ఉన్నతమైన, తెలివైన ప్రాణి మానవుడే. అందుకే మనం మిగతా అన్ని జీవుల్ని మచ్చిక చేసుకోడమే కాకుండా ఎన్నోరకాలుగా exploit కూడా చేస్తున్నాము. అన్ని జీవులకంటే బాగా అభివృద్ధి చెందిన మెదడు మనిషికి మాత్రమే ఉంది. ఆల...

(Telugu) ఉత్తమ గుణములు నీచు

[:te] ఉత్తమ గుణములు నీచు కెత్తెర గునగలుగనేర్చు నెయ్యడలం దా నెత్తిచ్చి కరగిపోసిన నిత్తడి బంగారుమగునె ఇలలో సుమతీ! తాత్పర్యం:  బంగారానికి సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించిపోసినా బంగారం ఎట్లుకానేరదో అదేవిధంగా లోకంలో నీచునకుఎక్కడా ఏ విధంగానూ మంచి గుణాలు కలగవు. చెడ్డవారి గురించి, మూర్ఖుల గురించీ, నీచ స్వభావం గురించి మన తెలుగులో ఎన్నో తెలుగు పద్యాలు ఉన్నాయి కదా...! ఇదీ అందులో ఒకటి. ఎన్ని కిలోల ఇత్తడి తెచ్చి ఇచ్చినా బంగారం తో సమానం కాదు అనే ఉపమానం ఉపయోగించి ఈ పద్యంలో నీచుని స్వభావాన్ని వివరిస్తున్నారు. మంచి-చెడు అంటే నాకొకటి గుర్తొస్తుంది. ఈ ప్రపంచంలో మంచి-చెడు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అసలు అది మన ఆలోచనల్లో ఉంటుందని నాకనిపిస్తుంది. అంటే...మంచి-చెడు అనేవి relativity (తెలుగులో??) కి సంబంధించినవి కదా..అంటే ఒకరి దృష్టిలో మంచి అయినది మరొకరి దృష్టిలో చెడు అయ్యే అవకాశం ఉంది. అలాగే పరిస్థితిని బట్టి మంచిచెడులు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఏదన్నా అపాయంలో ఉన్నప్పుడు ఒక ప్రాణిని చంపినా గాని అది తప్పు అవ్వదు. కానీ, అదే మరో పరిస్థితిలో అయితే తప్పు అవుతుంది కదా..ఒకోసారి ఇద్దరు మనుషులకి భేదా...

(Telugu) ఉదకము ద్రావెడు హయమును

[:te] ఉదకము ద్రావెడు హయమును మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్‌ మొదవుకడ నున్న వృషభము జదువని యా నీచుకడకుఁ జనకుర సుమతీ! తాత్పర్యం:  నీరు తాగే గుర్రం దగ్గరకు, కొవ్వుతో విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్నఆబోతు వద్దకు, విద్యనేర్వని అల్పుని దగ్గరకువెళ్లకుము. ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఆయా సమయాల్లో ప్రవర్తించాలని ఏ పద్యంలో నీతి. ఆ విషయాన్నే ఉదాహరణలతో ఈ పద్యంలో వివరించారు. చదువుసంధ్యలు లేని ఒక మామూలు మనిషికి కూడా అర్ధమయ్యే రీతిలో రాయడమే సుమతీ శతకం యొక్క గొప్పతనం. ఇక్కడ చెప్పిన సందర్భాలు ఆ కాలానికి సరితగ్గవి కానీ, ఇప్పుడు మనకి ఎదురయేవి కాదులే..! మనం ఎవరైనా తెలిసిన వాళ్ళింటికి వెళ్ళామనుకోండి . ఒకోసారి మనం పరాయి వాళ్ళం ఉన్నా గానీ, వాళ్ళింట్లో ఏదో పరిస్థితి వల్ల వారి స్వంత విషయాలు మాట్లడుకోడమో, వాదించుకోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు మనం అల్లాంటి పరిస్థితి నుంచి బయటపడడం మంచిది. అనవసరంగా వారి స్వవిషయాల్లో ఆసక్తి గానీ, జోక్యం గానీ చేసుకోకపోడమే మనకి మంచిది. ఒకోసారి వాళ్లు వాదించుకుంటూ, మరో పక్క మనకి చెప్తూ ఉంటారు. "చూడండి...ఎలా చేసారో...ఎప్పుడూ ఇంతే. మీరే చెప్పండి నా తప్పేముంది. అదీ...ఇదీ.....

(Telugu) ఉపకారికి నుపకారము

[:te] ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ! తాత్పర్యం:  మేలు చేసిన వానికి మేలు చేయుట గొప్ప కాదు. హాని చేసిన వానికి అంతకుముందు వాడు చేసినదోషాలను లెక్కచేయక ఉపకారంచేసేవాడే నేర్పరి. చూసారుగా..పైన పద్యాన్ని..మీకేమనిపిస్తుంది? అదంతా నిజమే కానీ, ఈ రోజుల్లో అంత మహాత్ములెవరుంటారు? ఒకవేళ అలా చేద్దామనుకున్నా అలాంటి మనుషులు ఈ ప్రపంచంలో బతకలేరు. ఇప్పటి పరిస్థితులు అలాంటివి మరి. ఏం చేస్తాం?? అని ఒక నిట్టూర్పు విడుస్తున్నారా? మీ మనసులో ఏమనుకుంటున్నారో సరిగ్గా చెప్పానా? :) నాకయితే ఎవరికీ ఉపకారం చేయకపోయినా ఫరవాలేదు కానీ, అపకారం మాత్రం చేయకుండా ఉండగలిగితే చాలు అనిపిస్తుంది. మనం ప్రపంచంలో జరిగే చాలా సంఘటలని చూసినప్పుడల్లా మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం అసలెటుపోతోంది? ఏమిటీ విపరీత సంఘటనలు..అనిపిస్తుంది. ఉదాహరణకి ఎవరి మీదో కోపంతో ఎవరో బాంబులు పెట్టి, దానికి అభం శుభం తెలియని సామాన్య ప్రజలు పార్కుల్లోనూ, హోటళ్ళలోనూ , రోడ్ల మీద ఇలాంటి మామూలు ప్రదేశాల్లో బలి అయిపోతుంటే చాలా బాధేస్తుంది. కానీ, ఏమి చెయ్యాలో అర్ధం కాదు. మతాల పేరు మీద, దే...

(Telugu) ఎప్పుడు దప్పులు వెదకెడు

[:te] ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వ గూడ దదియెట్లన్నన్‌ సర్పంబు పడగనీడను గప్పవసించిన విధంబు గదరా సుమతీ! తాత్పర్యం : నల్లతాచు నీడలో నివశించే కప్ప బతుకు ఎంత అస్థిరమో ఆవిధంగానే ఎప్పుడూ తప్పులు వెతికేయజమానిని సేవించే వాడి బ్రతుకుప్రాణభయంతో కూడినదే సుమా! ఎలాంటి యజమాని కొలువు చేయకూడదో.. ఈ పద్యంలో వివరిస్తున్నారు. ఎప్పుడూ తప్పులు వెతికే యజమాని దగ్గర పని చేయకూడదనీ, అలా చేస్తే పాము నీడలో బ్రతికే కప్పలాగా ఎప్పుడూ అపాయమేనని అంటున్నారు. ఏంటోనండీ.. ఈ పద్యం లో ఇలా ఉంది కానీ, అసలు అలాంటి ఉత్తమమైన బాస్ లు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారండీ బాబూ? అవునా కాదా...? మీరే చెప్పండి. అసలు ఉద్యోగం దొరకడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో, బాస్ చాలా మంచి వాడవ్వాలని కోరుకుంటే మనకి ఇంక ఉద్యోగాలొచ్చినట్టే... కదా... :( అంటే నా ఉద్దేశ్యం బాసులందరూ విలన్లని కాదు గానీ..ప్రతీ బాస్ లో కొంచమైనా విలనిజం ఉంటుదని అన్నమాట...అంతే కదా మరి...హ్హ హ్హ హ్హ... అసలు టీ టైములో టీ తాగడం కంటే కూడా సహోద్యోగులందరూ సేద తీరేది బాస్ ని తిట్టుకునే కదా.. :) ఏది ఏమైనప్పటికీ ఈ పద్యం మన ప్రస్తుత పరిస్థితులకి సరిగ్గా అన్వయించుకోడం కష్టమే అనిపిస్తుంది...

(Telugu) ఎప్పుడు సంపద కలిగిన

[:te] ఎప్పుడు సంపద కలిగిన అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్‌ దెప్పలుగ జెరువునిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ! తాత్పర్యం:  చెరువు నిండా నీరు చేరగానే వేలకొద్దీ కప్పలు అందులో చేరునట్లే సంపద కలిగిన వారి వద్దకే బంధువులు ఎక్కువగా జేరుకొందురు. ఈ పద్యం తెలియని తెలుగు వాళ్లు దాదాపుగా ఉండరనుకుంటున్నాను. పెద్దగా చదువురాని వాళ్లు కూడా ఈ పద్యం చెప్తూ ఉంటారు. మరి ఈ పద్యం లో ఉన్న విషయం అలాంటిది కదా..! నిజానికి ఈ పద్యం లో నీతి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జీవితంలోకి తరచి చూసినా కనీసం ఒక్క అనుభవం అయినా కనిపిస్తుంది. ఒకటేమిటిలే.. చాలానే ఉంటాయి. ఈ పద్యం లో బంధువులు అన్నారు గానీ, స్నేహితులకీ, కుటుంబ సభ్యులకీ కూడా ఇది చాలా సందర్భాల్లో వర్తిస్తుంది. అంటే అందరూ అలా ఉంటారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు గానీ, అలాగే ఎక్కువ శాతం మంది ఉంటారన్నది మాత్రం అందరూ ఒప్పుకునే వాస్తవం. ఏదో సినిమా పాటలో చెప్పినట్టు.. డబ్బుంటే సుబ్బారావు గారు అంటారు లేకపోతే సుబ్బి గాడు అంటారు. అంటారు అంటారు కాదు గానీ..మనందరం అలాగే అంటాం కదండీ..!! ఉదాహరణకి ఎవరన్నా కోట్ వేసుకుని కనిపించారనుకోండి.. ఎవరయ్...

(Telugu) ఏరకుమీ కసుగాయలు

[:te] ఏరకుమీ కసుగాయలు దోరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ పారకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ! తాత్పర్యం:  భూమిపై... పచ్చికాయలు ఏరి తినకు. చుట్టాలను దూషించకు. యుద్ధం నుంచి వెనుతిరిగిపారిపోకు. పెద్దల ఆజ్ఞలను జవదాటకు సుమా! చూసారుగా ఈ పద్యం..! మీరేమంటారు మరి.. :) బంధువులని దూషించకూడదంటా ... ఇంతకుముందే బంధువుల గురించి వచ్చే అపాయాలని గురించి అనుకున్నాం కదా..! ఇప్పుడేమో ఇది...ఏది ఏమైనా సందర్భానుసారం నీతిని కూడా తీసుకోవాలి. అంటే బంధువులందరినీ ఏమీ అనకూడదు...వేరే వాళ్ళని అనచ్చని కాదు గానీ.. ఎవరినైనా పూర్తిగా విషయ పూర్వాపరాలు తెలుసుకోకుండా మాట జారకూడదు. అది స్నేహితులైనా, బంధువులైనా సరే...! కానీ, ఒకవేళ బంధువులైనా కూడా నిజంగా చెడు చేయాలనుకునేవారిని దూషించకుండా ఎలా ఉంటాం? :) అంతే కదా..! పచ్చి కాయలు తినద్దంట..:) అయినా పచ్చివి తింటే అరగదు మొదటి పాయింట్..ఇంకోటి ఏంటంటే, పచ్చివి కోసేసి వృథా చేయడం కన్నా పండే దాకా ఉండడం ఉత్తమం కదా..! :) ఇలా కాదు కానీ, అలాంటి పసి మొగ్గల్నీ, పసి పిందెలనీ కోసేయ్యకూడదు అని కూడా కవి ఉద్దేశ్యం అయ్యి ఉండచ్చు అనుకుంటున్నా.. ఒక రకంగా అది మనిషి మనస్తత్వాన్ని కూడా ప్రతిబింబిస్...

(Telugu) ఒకయూరికి నొక కరణము

[:te] ఒకయూరికి నొక కరణము నొక తీర్పరియైన గాక వొగిఁదరుచైనం గకవికలు గాక యుండునె సకలంబును గొట్టువడక సహజము సుమతీ! తాత్పర్యం :  ఒక గ్రామానికి ఒక లేఖరి, ఒక ధర్మాధికారి ఉండాలి. అలాకాక ఎక్కువమంది అయితే అనేక గందరగోళాలుపుట్టి సమస్తం చెడిపోవుటసహజము. చూశారుగా ఈ పద్యంలో నీతి. చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఏ పని అయినా ఎవరు చేయాలో వాళ్లు చేయాలి. అలాగే ఒకేసారిఎక్కువమంది తల దూర్చకూడదు. అలా చేస్తే అది ఖచ్చితంగా నష్టానికే దారి తీస్తుంది చివరికి. ఇంగ్లీషులో కూడా ఇదే అర్ధాన్ని చెప్పే ఒక ప్రసిద్ధ సామెతఉంది. "Too many cooks spoil the broth" అని. ఎక్కువమంది ఒకే వంటలో వేలు పెడితే ఎలా ఉంటుందండీ మరి?? నువ్వు ఉప్పు వేసావా? కారం వేసావా? అది వేస్తే ఇలా ఉంటుంది.. అలా ఉంటుంది.. అనుకుంటూ ఒకటికి రెండు సార్లు వేసి లేదా మర్చిపోయి..అందరి పాక శాస్త్ర ప్రావీణ్యంపోటాపోటీగా ఉపయోగించి చివరికి మొత్తం పారబోయాల్సి వస్తుంది.అంతేగా మరి..! ఇదే కాకుండా..ఎవరైనా ఏదైనా సమస్యలో ఉంటే.. ఒకేసారి చాలామంది బోలెడు సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ ఒకేసారి అన్ని విరుద్ధమైనభావాల్ని వ్యక్తపరుస్తూ ఇంకా ఎక్కువ కంగారుని, అయోమయాన్ని, భయా...

(Telugu) ఒల్లనిసతి నొల్లనిపతి

[:te] ఒల్లనిసతి నొల్లనిపతి నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే గొల్లండు గాక ధరలో గొల్లండును గొల్లడౌను గుణమున సుమతీ! తాత్పర్యం:  తన్ను ప్రేమించని భార్యను, యజమానిని, స్నేహితుడ్ని విడిచి పెట్టడానికి అంగీకరించనివాడే వెర్రి గొల్లవాడు గానీ జాతిచేత గొల్లవాడైనంత మాత్రాన గుణాల్లో వెర్రి గొల్లవాడు కాదు. పైన చూసారుగా..! స్నేహమైనా, ప్రేమైనా, చివరికి ఉద్యోగం చేయాల్సిన చోట కూడా ఇరువైపులా నుండి పరస్పర అంగీకారం, ఇష్టంఉండాలని ఈ పద్యంలో చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా.. ఇంకా మన చుట్టూ ఉన్న సమాజంలో బలవంతపు ప్రేమలు, పెళ్ళిళ్ళు, లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. ఏ మనిషికైనా ప్రతీ విషయంలో తనకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఏ రంగు డ్రెస్వేసుకోవాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఏమి తినాలి... ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతీ ఒక్క విషయంలోమనకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్క అభిరుచికి గానీ, అభిప్రాయానికీ గానీ కారణాలు అడిగితేమనమెవ్వరమూ సమాధానం చెప్పలేము. ఎందుకంటే మనిషి భావాలకు, మనసు స్పందనకు కారణాలు ఉండనవసరం లేదు. యాధృచ్చికంగా దీనికి సంబంధించిందే ఈ రోజు పొద్దునే 'మ...

(Telugu) ఓడలు బండ్లవ్వచ్చూ..బండ్లు ఓడలవ్వచ్చూ..!!

[:te] ఓడల బండ్లును వచ్చును ఓడలు నాబండ్ల మీద నొప్పుగ వచ్చును ఓడలు బండ్లును వలెనే వాడంబడు గలిమిలేమి వసుధను సుమతీ! తాత్పర్యం: నావలపై బళ్లు, బళ్లపై నావలు వచ్చునట్లే, భాగ్యవంతులకు దారిద్య్రం, దరిద్రులకు భాగ్యం పర్యాయంగా వస్తూంటాయి. అందరూ అంగీకరించాల్సిన ఒక గొప్ప జీవన సత్యాన్ని చాలా సరళంగా చెప్పారు ఈ పద్యంలో.. ఈ సంగతి మనకి తెలిసినదిగానే అనిపించినా నిజానికి ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలామంది మర్చిపోతుంటారు. సిరిసంపదలు శాశ్వతం కాదని తెలిసినా సిరిననుసరించే గౌరవమర్యాదలు ఇవ్వడమనేది లోక రీతి అయిపోయింది. భాగ్యవంతుల అడుగులకు మడుగులొత్తడం ఒక ఎత్తయితే.. సంపద లేదన్న కారణంగా శక్తి సామర్ధ్యాలు ఉన్నవారిని చిన్న చూపు చూడడం మరింత బాధాకరమైన విషయం. ఒక వ్యక్తికి ఎంత వరకు విలువని ఇవ్వాలి, ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి అనే విషయాన్ని వాళ్ల కులగోత్రాలు, వంశ చరిత్ర, సిరిసంపదలు వగైరా.. లాంటి విషయాలని చూసి నిర్ధారణకి రాకుండా వాళ్ల వాస్తవీకమైన వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వగలిగినట్టయితే మనకు చాలా సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదాహరణకి ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనుకోం...

మాఘస్నానం (హంసలదీవి)

స్నానము : మనము ప్రతిరోజూ చేసే స్నానము శరీర శుభ్రతకోసము చేస్తాము. కొందరు వేడినీరు స్నానము చేస్తారు. తల శుభ్రతకోసము ప్రతిరోజూ తలస్నానము చేసేవారూ ఉన్నారు. విధిగా వారానికి ఒకసారైనా తలస్నానము చేయాలి. స్నానానికి మంచినీరే వాడాలి. పూర్వము నదులన్నీ తాము పుట్ట్టిన ప్రాంతము నుండి కొండలు , అడవులు దాటి రావడము వలన నీరు స్వచ్చము గాను వనమూలికల మయమై ఔషధ గుణాలు కలిగిఉండేవి. ఎటువంటి మలినాలూ , రసాయనాలు , మురికినీరు కలిసేవికావు . అలా ప్రవహించే నదినీటిలో స్నానము చేస్తే ఆరోగ్యము గా ఉండేవారు. కానీ ప్రపంచమంతా పారిశ్రామికమైన తరువాత , జనాభా విపరీతముగా పెరగడము వలన , నదీప్రాంతాలలో పరిశ్రములు  నెలకొల్పడమువలన , బహిరంగ ప్రదేశాలలో మల మూత్రాలు విసర్జించడము మూలంగా నదీజలాలు పూర్తిగా కలుషితమైపోయినవి . పూర్వము పుణ్యము వస్తుందనే నెపముతో నదీస్నానాలను , చలినీటి స్నానాలను ,నీటీప్రవాహ స్నానాలను ప్రోత్సహించేవారు. అదే ఆచారము ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఎంతమాత్రము ఆరోగ్యప్రదమైనది కాదు. పుణ్యము మాట ఏమోగాని ఇప్పుడు నదీస్నానాలు, కోనేరు స్నానాలు , పుష్క్రరస్నానాలు ఏమాత్రము ఆరోగ్యకరమైనవి కావు . కాలము తో పాటు ఎన్నోమార్పులు జరుగుతూ ఉన్...

అష్టాదశ శక్తి పీఠాలు ( శక్తిపీఠాలు )

Image
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అ...

(Telugu) 12 అంకెతో మనుజులకు ఉన్న అనుబంధం

[:te]అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తే...

ఉత్తములు - మధ్యములు - అధములు : లక్షణాలు

ఆలోచనల, ప్రవర్తనా ధోరణి బట్టి మన సమాజంలో మూడు రకాల మనుషులు ఉన్నారు. వారు అధములు, మధ్యములు, ఉత్తములు. అధములు: తమంతట తామే వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.  అయితే వాటిని స్థిరంగా తీసుకోలేరు. మిత్రులను తరచూ మారుస్తుంటారు. అందుకే వీరికి మిత్రులూ తక్కువే వీరు సంబంధాలను నిలకడగా ఉంచుకోరు. వీరి ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. డబ్బు విలువ తెలీదు. విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. అప్పులు కూడా ఎక్కువ. చదువు విలువ తెలీదు. సమయపాలన ఉండదు. ఏ పనీ టైంకు చేయరు. వీరు ఎవర్నీ నమ్మరు. నమ్మినట్లు నటిస్తారు అంతే. వీరికి నీతి వాక్యాలు  రుచించవు. తనకు ఎవరైనా మంచి చెపితే వారిపైనే విరుచుకు పడతారు. వీరు అనుక్షణం ఎదుటివారిలో తప్పులు వెతుకుతుంటారు. దేవుడిని నమ్మరు. తన తర్వాతే దేవుడు అనుకుంటారు. తమకు జరుగుతున్న కష్టాలకు ఎదుటివారిని, దేవుడిని నిందిస్తారు. బద్ధకం ఎక్కువ. ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. వీరు బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. పొగడ్తలకు దాసోహం అవుతారు. పొగడ్తలతో వీరిని లొంగదీసుకోవచ్చు. అంతేకాదు, వీరికి భయంకూడా ఎక్కువే. ప్రతీదానికీ విపరీతంగా భయపదిపోతూ ఉంట...

(Telugu) సుమతీ శతక పద్యాలు

[:te]వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగిర పడక వివరింప దగున్ కనికల్లగా నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరించంగా అపరాకారికి ఉపకారము నేప మెన్నక చేయువాడు నేర్పరి సుమతీ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతీ బద్దకము సంధ్య నిద్దుర వద్దు సుమీ దద్దిరంబు వచ్చును దానన్ గద్దిన్తురు పెద్ద వారలు మొద్దందురు తోటి వారలు ముద్దు సుమీ[:]

(Telugu) వేమన పద్యాలు

[:te]అనువుగాని చోట నథికులమనరాదు కొంచెముండుటెల్ల కొదువు గాదు కొండ అద్దమందు కొంచమై యుండదా? విశ్వదాభిరామ వినుర వేమ! అల్పుడెపుడుఁబల్కు నాడంబరముగాను సజ్జ నుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ వినురవేమ! అనగ అనగ రాగము అతిశయిల్లుచు  నుండు తినగ తినగ వేము తియ్య నుండు సాధనమున పనులు సమకూరు ధర లోన విశ్వదాభిరామ వినుర వేమ! అల్పబుద్ధివాని కధికార మిచ్చిన దొడ్డవారినెల్ల తొలగగొట్టు చెప్పుతినెడు కుక్క చెరకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినుర వేమ! ఆత్మశుద్ధి లేని ఆచరమేల భాండ శుద్ది లేని పాకమేల చిత్తశుద్ది లేని శివ పూజ లేలయ విశ్వదాభి రామ వినుర వేమ ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినుర వేమ ! కనియు గానలేఁడు కదలింపఁడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతం బిది విశ్వదాభిరామ వినుర వేమ! గంగిగోవు పాలు గంటిడైనను చాలు కడివెడైన నేమి ఖరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినుర వేమ! చదువు జదువకున్న సౌఖ్యంబులును లేవు చదువు జదివెనేని సరసుడగును చదువు మర్మమెరిగి చదువగ చూడుము విశ్వదాభిరామ వినుర వేమ...

(Telugu) వ్యక్తి అభ్యున్నతికి ఉపయోగపడే 5 సూత్రాలు.

[:te]1. అందరూ బాగుండాలని మనం అనుకుంటే, ప్రపంచంలో మనం చేసే ప్రతిపని గురించీ, అది చేసే విధానం గురించీ పునరాలోచించుకోవాలి. 2. విప్లవాలు కొన్నిసార్లు శ్రేయస్సుకు దారితీయవచ్చు. కాని సామాన్యంగా అవి ఒక నియంతను మరికొందరి నియంతలతో భర్తీచేస్తాయి. 3. ప్రతి రొజూ కాకపోయినా కనీసం నెలకోసారైనా, మీరు మరింత మెరుగైన వ్యక్తిగా పరివర్తన చెందుతున్నారా? లేదా? అని బేరీజు వేసుకోండి! 4.మీరెంత చైతన్యవంతంగా, ఉత్సాహంగా, పారవశ్యంగా ఉంటారన్నది కేవలం మీ తీక్షణత మీద ఆధారపడి ఉంటుంది. 5.ఆర్ధిక శ్రేయస్సుకై మనుషుల శ్రేయస్సుతో మనం రాజీ పడుతున్నాము. మన జీవితాలకు వివేకం మార్గనిర్దేశనం చేయవలసిన సమయం ఆసన్నమైనది.[:]

(Telugu) మంచి జీవితానికి నిపుణుల చిట్కాలివీ

[:te] కన్ను తెరచింది మొదలు... కన్ను మూసే వరకు ఆగని ప్రయాణమే జీవితం. 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే'.. అన్న చందంగా ఉంటే కాలగర్భంలో తెరమరుగైపోతాం. అలా కాకుండా... ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలనుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు మనతో మనం పోటీ పడాల్సిందే. సామాన్యులు ఎందరో మన కళ్లముందే పలు రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఓ పట్టు పట్టాలేగాని... మీరూ అంతే! అందుకు ఏం చేయాలో తెలుసుకోవాలని ఉందా? చదవండి మరి... జీవితంలో స్థిరపడి ఉన్నత స్థితికి చేరుకోవాలనే లక్ష్యం యువకులు అందరి ముందు ఉంటుంది. ఇదే లక్ష్యంతో ఎంతోమంది భాగ్యనగరికి వస్తుంటారు. చాలామంది ఏదో ఒక ఉద్యోగం లేదా వ్యాపకంలో మునిగిపోయి రాజీ పడతారు. అయితే అనుకున్నది సాధించడానికి రాజధానిలో అనువైన పరిస్థితులు, వసతులు ఎన్నో ఉన్నాయి. మరిన్ని విజయాలు మూటగట్టుకోవాలన్నా, మంచి కొలువు కొట్టేయాలన్నా, జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలన్నా... కార్యరూపానికి ఆమడ దూరంలో ఆగిపోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. లక్ష్యసాధన దిశగా మనం నడవడం ప్రారంభిస్తే విజయాలు మీ వెంట పరుగులు తీస్తాయి. 'ది బెస్ట్‌' ఎలా? జ్ఞానం, శక్తి, సామర్థ్యాలను ఉపయోగిస్తే మనం ఎంత ఉన్నతం...

(Telugu) పెళ్ళి ప్రమాణాలు

[:te] ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి..!! అని ప్రమాణాలు చేసుకొని ఒకటి అవుతున్నారు... మరి చిన్న చిన్న కారణాలకి ఎందుకు విడాకుల వరకు వెళుతున్నారు...! నాలుగు గోడల మధ్య ఉండవలసిన భార్యా భర్తల తగాదాలను సర్ది చెప్పే పెద్దవారితో కాకుండా, అహంకారం కోసం ఆదిపత్యం కోసం ఆజ్యం పోసే వారితో పంచుకొని, వారి సలహలు స్వీకరించి తమ జీవితాలను చేజేతుల నాశనం చేసుకోవడంతో పాటు, మనతోపాటే జీవితం అనుకున్న వారిని దుఖః సాగరంలో ముంచుతున్నారు... ప్రపంచంలో ఏ రెండు గడియారాలు ఒకే సమయాన్ని చూపించవు, అలాగే 100% ఒకే అభిప్రాయాలున్న మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరి మద్య బేధాలు సహజం.. కాని వాటిని సర్దుకొని పోవడంలోను, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోను, అభిప్రాయాలను, భావాలను మరొకరు గౌరవించుకోవడంలోనే ఆనందంకరమైన జీవితం ఉంది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు... కాబట్టి ఒకరు మూర్ఖంగానో కోపంగానో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండగలిగితే చాలు భార్యా భర్తల జీలితం సజావుగా సాగుతుంది....... [:]

(Telugu) భార్యా భర్తల మధ్య సహనం

[:te]భార్యా భర్తల మధ్య సహనం ఓర్పు ఉంటే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో ఈ చిన్న కథ ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను......చదవగలరు. మంచి ఎండలో ఒక మహిళ నీటిని చాలా దూరం నుండి కష్టపడుతూ తెస్తోంది. రెండు బిందెలను ఇంటిముందు పెట్టి చిన్న బిందెతో నీటిని తెస్తూ అందులో పోస్తోంది. ఇంతలో ఆమె భర్త ఆకలితో ఎండలో చెమటలు కక్కుతూ లోనికి వచ్చాడు. ఇంటి ముందు ఉన్న బిందెలను గమనించకుండా వాటిని కాలితో తన్నాడు. బిందెలలో నీళ్ళన్నీ క్రింద ఒలికిపోయాయి. కోపంతో రగిలిపోయిన అతను తన భార్య కోసం బయటనే నిలబడ్డాడు. ఆమె రానే వచ్చింది. ఆమెను చూసి కోపంతో ఇలా అన్నాడు భర్త. " అసలు నీకు బుద్ధుందా? నీళ్ళ బిందెలను వాకిలికి అడ్డంపెట్టి ఎలా వెళ్ళావు. ఆకలితో ఇంటికి వచ్చిన నాకు ఆ బిందెలను తన్నడం వలన కాలికి దెబ్బ తగిలింది. నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో! ఎలా పెంచారో! తెలివితేటలు లేనిదాన్ని నాకు కట్టబెట్టారు." అన్నాడు. " ఇక మాటలు చాలించండి.....ఇప్పుడుకూడా నేను నీటి బిందెను తెస్తుంటే కనీసం అందుకో్కుండా తెచ్చిపోసిన నీటిని కూడా క్రింద పడేశారు. భార్య ఎంతకష్టపడి నీళ్ళు తెస్తుందో అని ఆలోచన కూడా లేదు మీకు. పైగా మా పుట్టింటివారిన...