Posts

(Telugu) ఆర్థిక వ్యవహారాలలో వ్యక్తి పొరపాట్లు

[:te]ఆర్థిక విజయాన్ని సాధించాలంటే అందుకు తగ్గ కృషితోపాటు, అందుకు సంబంధించిన పరిజ్ఞానం కూడా చాలా అవసరం. పరీక్షలు – ఫలితాలు పవన్ కాలేజీలో చేరాడన్న మాటే కానీ ఏ రోజూ చదువుమీద ధ్యాస పెట్టింది లేదు. పేరుకు తగ్గట్టే గాలికి తిరిగేవాడు. ఎంతసేపూ ఆటలు, అల్లరి అన్నట్లుగా వుండేవాడు. అన్ని అలాగే జరిగిపోతే అది కాలేజి ఎందుకు అవుతుంది? ఒక శుభ ముహూర్తాన పరీక్షలు వచ్చి పడ్డాయి. పవన్ ఏమీ చదవకుండా వెళ్ళి పరీక్ష రాశాడు. మరో వారానికి లెక్చరెర్ మార్కులు ఇచ్చేశాడు. ఇరవై మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు. అదే సమయంలో పావని అనే అమ్మాయి కూడా కాలేజిలో చేరింది. ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డాడు పవన్. ఎవరూ లేని టైమ్ చూసి ప్రొపోజ్ కూడా చేసేశాడు. ఆ అమ్మాయి ఏ మాత్రం తొణకకుండా - “మన కాలేజిలో నెలకి ఒక పరీక్ష పెడతారు కదా. అందులో ఎనభై శాతం మార్కులు తెచ్చుకోని చూపించు. అప్పుడు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను ” అంది మొదటిసారి పరీక్ష ఫెయిల్ అయ్యాను కాబట్టి ఈసారి కష్టపడాలి అనుకున్నాడు. అతి కష్టం మీద పుస్తకం తెరిచి ఓ నాలుగు ఛాప్టర్లు చదువుకున్నాడు. దాంట్లో నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చినా నలభై మార్కులైనా వస్తాయని ఊహించాడు. కానీ పరీక్షలో మూడ...

(Telugu) చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం ప్రణాలిక

[:te]మహేష్ కి కవల పిల్లలు. కొడుకు హరి, కూతురు లావణ్య. ఇద్దరిలో కొడుకు అంటే ఎక్కువ ప్రేమ మహేష్ కి. ఆ సంగతి తెలిసినా లావణ్య అదేం పెద్ద విషయం కానట్టు వుండేది. ఎప్పుడూ తన చదువులు, ఇంట్లో పనులే తప్ప ఇలాంటివి అసలు పట్టించుకునేది కాదు. హరి అలా కాదు. తండ్రికి తనంటే ఇష్టమని తెలుసు కాబట్టి అదే అదనుగా ప్రతి దానికీ మారాం చేసి తనకు కావాల్సినవన్నీ సాధించుకునేవాడు. హరి వల్ల ఎక్కువసార్లు లావణ్యే నష్టపోతుండేది. పిల్లలు ఇద్దరూ ఏడో తరగతికి వచ్చినప్పటి నుంచీ వాళ్ళకి డబ్బులు అవసరం అవుతాయని ఇద్దరికీ పాకెట్ మనీ ఇచ్చేవాడు మహేష్. అందులో కూడా కొడుకుకి నెలకి ఐదొందలు ఇస్తే, కూతురికి రెండు వందలే ఇచ్చేవాడు. లావణ్య అందుకు బాధపడకుండా, ఇచ్చిన డబ్బుని పొదుపుగా వాడుకుంటూ మిగిలిన డబ్బుని దాచిపెట్టుకునేది. హరి చేతికి అందిన డబ్బు మొత్తం ఖర్చు పెట్టి ఇంకా కావాలని గొడవ చేస్తుండేవాడు. ప్రతి సంవత్సరం హరి పాకెట్ మనీ రెండింతలు అయితే, లావణ్యకి ఇచ్చే డబ్బు చాలా స్వల్పంగా పెరిగేది. ఇలా ఒక పది సంవత్సరాలు గడిచాయి. హరి అప్పులు చెయ్యడం మొదలుపెట్టాడు. అవి కూడా పెరిగిపోయి వ్యవహారం పీకల్దాకా వచ్చింది. దాంతో మళ్ళీ డబ్బు కావాలని తండ్రి దగ్గ...

ఇల్లు కొనాలంటే

జీవితం అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు కదా. సంపాదించిన డబ్బుని అనుభవించడం కూడా ఆవసరమే. అనుభవించాలంటే ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినా ఆనందాన్ని ఇచ్చే ఒక ముఖ్యమైన ఖర్చు గురించి నీకు ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. ఇద్దరు మిత్రులు కిరణ్, చరణ్ అని ఇద్దరు స్నేహితులు వుండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఇంజనీర్లయ్యారు. కిరణ్ నాగపూర్లో గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాడు. చరణ్ కి పూణేలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఇద్దరూ ఉరు వదిలి వెళ్ళేటప్పుడు కలుసుకున్నారు. “ఉద్యోగం వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఎలాగూ పెళ్ళి సంబంధాలు చూస్తారు. ఈలోగా ఎలాగైనా మంచి ఇల్లు కొనుక్కోని స్థిరపడాలి” అన్నాడు కిరణ్. “నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇల్లు కొనడం అంటే ఇరవై ముఫై సంవత్సరాల పాటు జీతంలో ముఖ్యమైన భాగాన్ని వడ్డీగా కట్టడమే. ముఫై లక్షలు అప్పు చేస్తే దాదాపు డెభ్బై రెండు లక్షలు కట్టాలి. అందుకే తెలివి తక్కువ వాళ్ళు ఇల్లు కొంటారు, తెలివైన వాళ్ళు అందులో అద్దెకు వుంటారు అని ఆర్థిక నిపుణుడు వార్నర్ బఫెట్ అన్నాడు. నేను ఎప్పటికీ అద్దె ఇంట్లోనే వుంటాను” అన్నాడు చరణ్. ఎవరి అభిప్రాయం వ...

(Telugu) సంపాదనని సంపదగా మార్చుకోవాలంటే

[:te]కోటేశ్వరరావు ఎప్పుడో కొన్న పొలం ఇప్పుడు అనుకోకుండా మంచి ధర పలకసాగింది. కొత్తగా రాజధాని ఆ పక్కనే పెడుతున్నారని వార్త రావడంతో ఆ పొలానికి కోటి రూపాయలు ఇస్తామంటున్నారు చాలామంది. నిజానికి కోటేశ్వరరావుకి ఆ పొలం అమ్మాలన్న ఆలోచన ఏ మాత్రం లేదు. కాకపోతే అమ్మాలని అతడు నిర్ణయించుకోడానికి మూడు కారణాలు వున్నాయి. మొదటి కారణం అతని ఆర్థిక పరిస్థితి. గవర్నమెంట్ ఉద్యోగం చెశాడు కాబట్టి పెన్షన్ వస్తోంది. ఆయన, భార్య పార్వతి సంతోషంగా కాలం గడపడానికి అది చాలు. కాకపోతే ఏదైనా అనారోగ్యమో, అనుకోని మరో పెద్ద ఖర్చో వచ్చి పడిందంటే చేతిలో నయాపైసా లేదు. కూతురు గిరిజ ఏ నిముషంలో అయినా కాన్పుకి రావచ్చు. అప్పుడు ఎంత ఖర్చౌతుందో తెలియదు. అందుకోసమన్నా పొలం అమ్మి కాస్త డబ్బు చేతిలో వుంచుకోవాలని ఆలోచన మొదలైంది. రెండో కారణం పొలం పని చేసే ఓపిక లేకపోవడం. కోటేశ్వరరావు స్థిరపడింది గుంటూరులో. పొలం వున్న ఊర్లో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కౌలుకి ఇచ్చినా తీసుకునేవాళ్ళు లేరు, కూలీలు అసలే దొరకట్లేదు. అంత శ్రమపడి వ్యవసాయం చేసినా గిట్టుబాటు అయ్యే దిగుబడి వుంటుందని నమ్మకం లేదు. అందువల్ల కూడా ఈ పొలాన్ని అమ్మేస్తేనే మేలేమో అని అనుకున్...

(Telugu) సంపద అంటే డబ్బుతో కూడబెట్టేది మాత్రమే కాదు

[:te]రామవరం శివార్లలో వున్న వీర్రాజు పొలం చివర ఒక మర్రి చెట్టు మొలకెత్తింది. చెట్టు పెరిగి పెద్దదైన తరువాత కష్టం చేసిన రోజు అలసట తీర్చుకునేందుకు నీడ దొరుకుతుందని వీర్రాజు ఆ చెట్టుకి నీళ్ళు పట్టాడు, దడి కట్టాడు. చెట్టు పెరిగి పెద్దదైంది. అయితే అదో చిత్రమైన మర్రి చెట్టు. మామూలుగా మర్రి అంటే పెద్ద పెద్ద కొమ్మలతో, ఊడలతో నాలుగు వైపులకీ విస్తరించాలి కదా! అది అలా కాకుండా చెట్టంతా ఒకచోటే ఉండిపోయి, ఒక కొమ్మ మాత్రం తెగ పెరుగుతూ పోయింది. కొన్నాళ్ళకి వీర్రాజు పొలంలో కన్నా పక్కన వున్న పొలంలో ఎక్కువ నీడ పడసాగింది. అయినా సరే వీర్రాజు ఆ చెట్టును అలా వదిలేశాడు. ఇదిలా వుంటే రామవరం దగ్గర్లో వున్న పట్టణంలో భూపతి అనే పెద్దమనిషి వున్నాడు. ఆయనకు ప్రత్యేకమైన వస్తువులను సేకరించడం అంటే ఎంతో ఇష్టం. ఎవరెవరో మహాకవి వాడిన కలము, ఇంకెవరో మహారాజావారి కత్తి ఇలాంటి వస్తువులు ఎన్నో ఆయన సేకరించాడు. ఆయన ఇంటి ఆవరణలోనే అతి పెద్ద గుమ్మడికాయ కాసే గుమ్మడిపాదు, తట్టల కొద్దీ పూలు విరగబూసే మల్లెతీగ ఇలాంటి మెక్కలు చెట్లు అనేకం వున్నాయి. అలాంటి భూపతికి వీర్రాజు పొలంలో వున్న చిత్రాల మర్రిచెట్టు గురించి తెలిసింది. వెంటనే ఇద్దరు మనుషుల...

(Telugu) మెరిసెందుకు టమాటా రసం

[:en]మెరిసెందుకు టమాటా రసం అన్ని ఇంట్లొ దొరికె పండ్లు, కూరగాయలే వీటితొనే అందాన్ని సంరక్షించు కొవచ్చు కీరదోస రసానికి గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్లో భద్రపరచండి. ఎండలోకి వెళ్లడానికి గంట ముందూ, వచ్చిన తరవాతా ముఖానికి రాసుకోవాలి. గంధం పొడికి చిటికెడు పసుపూ, కొంచెం పాలూ కలిపి ముఖానికి రాసుకొని, కొన్ని నిమిషాలయ్యాక కడిగేసుకుంటే ముఖం కాంతిమంతంగా మారుతుంది. తేనెకి పాల మీగడని కలిపి ముఖానికి మర్ధన చేసుకోవాలి. ఇలా వారానికి నాలుగైదు సార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. తాజా పాలకి, చిటికెడు ఉప్పూ నిమ్మరసం కలిపి రాసుకుంటే చర్మ రంద్రాలు శుభ్రపడి తెరుచుకుంటాయి. దీనివల్ల ముఖం తాజాగా ఉంటుంది. అలాగే బొమాటో రసానికి నిమ్మరసం కలిపి రాసుకున్నా మంచిదే. నెయ్యి గ్లిజరిన్ కలిపి రాసుకుంటే, మంచి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. ముల్తానీ మట్టి, గులాబీ | రేకలూ, వేపాకులూ, తులసి ఆకులూ కలిపి మిక్సీలో పేస్తులా చేసుకుని ముఖానికి రాసుకున్నా మంచిదే. [:de]మెరిసెందుకు టమాటా రసం అన్ని ఇంట్లొ దొరికె పండ్లు, కూరగాయలే వీటితొనే అందాన్ని సంరక్షించు కొవచ్చు కీరదోస రసానికి గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఆ మి...

రామయ్య - రాబందు

రామయ్య పొలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదిలేశాడు, ఆ తరువాత రామయ్య భోజనం తరువాత అలసటగా ఉండి ఒక పాతగోడ ప్రక్కగా నిద్రించాడు, ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావటం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది, ఈ అలజడికి నిద్ర లేచిన రామయ్య రాబందు చేసిన సహాయూనికి ఆశ్చర్యపడ్డాడు నీతి: ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.