శ్రీకృష్ణాష్టమి
భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు 5000 సం.॥ ల క్రితం దేవకి మరియు
వసుదేవుల బిడ్డగా ఈ భూమిపై అవతరించాడు. చూడండీ!!, సాక్షాత్తు భగవంతుడు
మానవుడిగా ఈ లోకంలో జరిగే అధర్మాన్ని , అన్యాయాలని నిర్మూలించి మళ్ళీ
అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనకోసమై దిగివచ్చాడు.!! ఇదీ భగవంతునికి మనపై
ఉన్న ప్రేమ, కరుణ, ఆప్యాయత మరియు బాధ్యత.
శ్రీకృష్ణ పరమాత్ముడు మనలాగా ఇంట్లోనో , వైద్యశాలల్లోనో పుట్టలేదు , ఆయన
పుట్టే సమయానికి అయన తల్లిదండ్రులైన దేవకి, వసుదేవులు చెరసాలలో ( జైల్లో)
ఉన్నారు, అలా చేసింది ఆయన మేనమామ ( అంటే దేవకి అన్న అయిన ) అయిన కంసుడు.
అలా భగవంతుడు చెరసాలలలో సరిగ్గా అష్టమి నాడు పుట్టాడు అందుకే మనం ఈ
రోజుని శ్రీకృష్ణ జన్మాష్టమి అని పండుగగా జరుపుకుంటాము.
కంసునికి ఒక ఆసారి ఆకాశవాణి (అశరీర వాణి) ద్వారా ఒక విషయం తెలుస్తుంది ,
అదేటంటే దేవకి వసుదేవులకు పుట్టే సంతానము (బిడ్డ) ఆయనని (కంసున్ని)
చంపుతాడని.!!. అందుకే కంసుడు తన చెల్లి , బావ అయిన దేవకి వసుదేవులని
చెరసాలలో పెట్టాడు.!! ఈవిధంగా 7 సార్లు దేవకి కన్న ప్రతీ బిడ్డని
చంపేసాడు , కాని 8వ సారి అలా జరగలేదు , ఈసారి కృష్ణ పరమాత్ముడు
జన్మించాడు , కాని ఆ కృష్ణపరమాత్ముని మాయ వలన ఎవరికీ బిడ్డ పుట్టిన సంగతి
తెలియదు , అప్పుడు ఆ భగవంతుడు వసుదేవునితో ” నన్ను రేపల్లెలో ఉన్న నంద
మహారాజు ఇంటికి తీసుకుని వెళ్ళు అక్కడ ఆయనకీ ఆడబిడ్డ జన్మించింది , ఆ
ఆడబిడ్డని నువ్వు తీసుకుని నన్ను నందమహారాజుకి అప్పగించు అని చెప్పాడు”
అలా భగవానుని ఆదేశానుసారం వసుదేవునికి ఉన్న ఇనుప గొలుసులు విడిపోయాయి,
చెరసాల కాపలాదారులు మత్తులో ఉండి ఒళ్ళు తెలీకుండా నిద్ర పోయారు, చెరసాల
తలుపులు వాటంతటవే తెరుకున్నై , అలా వసుదేవుడు రేపల్లెకి అ చిన్ని
కృష్ణున్ని తీసుకుని బయలు దేరాడు!! దారిలో భోరుమని వర్షం!! , రేపల్లెకి
వెళ్ళాలంటే యమునా నది దాటాలి , కాని వర్షం కారణగా నది విపరీతంగా ,
ఉధృతంగా ప్రవహిస్తుంది, అప్పుడు వాసుదేవుడు భగవంతున్ని వేడుకుంటే ఆ నది
రెండుగా చీలిపోయి మార్గాన్ని ఇచ్చింది.!! ఇక వర్షంలొ తడవకుండా ఆదిశేషుడు
( పెద్ద పాము) తన పడగ విప్పి వారిని తడవకుండా కాపాడింది!! ఇలా చివరికి
వసుదేవుడు రేపల్లె చేరడం అక్కడ బిడ్డలని తారుమారు చేసి తిరిగి చేరసాలకి
చేరుకున్నాడు, తరువాత చెరసాల తలుపులు వాటంతటవే మూసుకున్నాయి, ఇనుప
గొలుసులు తిరిగి వసుదేవునికి కట్టబడ్డాయి, వసుదేవుని వద్ద ఉన్న ఆడ
శిశువు ఏడుపు వినగానే ఇక చెరసాల కాపలా దారులు నిద్ర లేచి కంసుడికి
తెలియపరిచారు !! విషయం తెలుసుకున్న కంసుడు వెంటనే దేవకి వసుదేవులు ఉన్న
చెరసాల గదికి వచ్చి ఆ శిశువు ఆడ శిశువు అని ఎంత చెప్తున్నా వినకుండా
చంపడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఆ శిశువు ఒక మహా మాయ (దుర్గా దేవత అని
పిలుస్తాము) మారి నీ చావుకి కారణమయ్యే వాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని
చెప్పి అదృశ్యమయ్యింది.
కంసుడు రేపల్లెల్లో ఉన్న శిశువులందరినీ చంపమని అనేక రాక్షసులని పంపాడు.
కాని చిన్ని కృష్ణుడు వారందరినీ చంపివేశాడు. ఆ రాక్షసుల పేర్లు
తెలుసుకోవాలని ఉందా ??!! అయితే వినండి !!
పూతన (పాలు తాగుతూ చంపేసాడు ), తృణావర్తుడు ( సుడి గాలి రూపం ),
శకటాసురుడు ( ఎద్దుల బండి ఆకారం ), కేశి ( గుఱ్ఱం ఆకారం), బకాసురుడు (
కొంగ ఆకారం) , వ్యోమాసురుడు ( గబ్బిలం ఆకారం), వత్సాసురుడు ( ఆవు దూడ
ఆకారం), అఘాసురుడు ( పెద్ద పాము ఆకారం), అరిష్టాసురుడు ( భయంకరమైన ఎద్దు
ఆకారం),.. ఇలా ఎందరినో అతి సునాయాసంగా చంపివేశాడు.!!
ఇక చిన్నతనంలో శ్రీకృష్ణ పరమాత్మ అల్లరి అంటా ఇంతా అని వర్ణించలేము !!
ప్రతీ రోజు ఏదో ఒక గొడవ ఇంటిపైకి తెస్తుండేవాడు , మరియు ఎన్నో చిలిపి
చేష్టలు అవి, డూడలు వాటి తల్లులైన ఆవుల వద్ద పాలు తాగుతుంటే వాటిని
తోసేసి తనే నేరుగా ఆవు పాలు తాగేవాడు, గోపికల ఇళ్ళల్లో దొంగతనంగా వెన్నె
దొంగాలించేవాడు మరియు ఆ వెన్నేని తన మిత్రులతో , కోతులతో పంచుకునేవాడు,
గోపికలు కుండల్లో పాలు పెరుగు తెస్తుంటే ఆ కుండలని పగలగొట్టేవాదు , ఇలా
చెప్పుకుంటూపోతే పెద్ద లిస్తే ఉంది ఆయన చిలిపి కొంటే చేష్టలకి!! ఇలా
వెన్నె దొంగిలించినందుకే ఆయన్ని మనం వెన్నె దొంగా అని అంటాము, ఇక
వెన్నెని ఎలా దొంగిలించేవాడో ఆ చిలిపి పనులకి గుర్తుగా నేడు మనం ఉట్టి
కొట్టే కార్యక్రమాన్ని ఈ కృష్ణాష్టమి రోజు జరుపుకుంటాము!!.
తరువాత తన మేనమామ కంసున్ని చంపి తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులైన దేవకి
వసుదేవులని చెరసాల నుండి విముక్తి చేసాడు!! తరువాత శ్రీకృష్ణ పరమాత్మ
పాత్ర మహాభారతంలో అత్యంత కీలకమైనది!! పాండవుల తల్లి కుంతీ స్వయంగా
శ్రీకృష్ణునికి మేనత్త , అంటే పాండవులకి వరుసకి ఈయన స్వయానా మేన బావ!!!,
అందునా అర్జునుడంటే కృష్ణునికి చాలా ప్రేమ , ఇష్టం!! అందుకే స్వయంగా తన
చెల్లి అయిన సుభద్రని అర్జునునికి ఇచ్చి పెళ్లి చేసాడు!! అంతేకాదు
పిల్లలూ !! శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర సంగ్రామం ద్వారా “భగవద్గీత”
జ్ఞానాన్ని అర్జునికి చెప్పి తద్వారా మనకి ఆ విలువైన జ్ఞానాన్ని మనకి
ఇచ్చాడు. అందుకే శ్రీకృష్ణుడిని మనం “గీతాచార్యుడు” అని అంటాము.
కురుక్షేత్ర యుద్దం వలన ఎందఱో దుర్మార్గులు చనిపొయి తిరిగి ఈ భూమిపై
ధర్మాన్ని నిలబెట్టడానికి కారకుడయ్యి భూభారాన్ని తగ్గించాడు!!
ఇలా అ భాగావానుని గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా చెప్పుకోవచ్చు కొద్ది
సమయంలో ఆయన గురించి చెప్పడం సాధ్యపడదు!! .
కావున పిల్లలు మనకోసం (అంటె ఆయన భక్తులమైన మనకోసం ) భూమిపై అవతరించి మన
కష్టాలని పోగొట్టాడు.!! మరి ఆయనకీ కృతజ్ఞత చెప్పాలి కదా ??!! మరి ఎలా
చెప్పాలి ? ఆరోజు భగవంతున్ని స్మరించి , ఆయన నామాలని ( భగవంతుని పేర్లని)
జపించి ఆయనకీ పూజ చేయాలి!! మీరు చేస్తారు కదూ!!??!!
ఏది ఒక్కసారి అందరం ఆ పరమాత్ముణ్ణి తలుచుకున్దామా !!?? , మరి అనండి ,
“శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః , శ్రీకృష్ణాయ నమః , శ్రీ కృష్ణ భగవాన్ కి జై
!!!”
సర్వం శ్రీ కృష్ణర్పణమస్తు !! స్వస్తి !!

Comments
Post a Comment