(Telugu) పాపాయి ఎదగాలంటే... ప్రేమని పంచాల్సిందే!
[:te]మాతృత్వం ఒక తీయని వరం. కాదనం! కానీ పుట్టిన పాపాయిని ప్రేమగా పెంచుకోవడం ఓ అందమైన అనుభవం. వారు మనల్ని చూసినప్పుడల్లా చిందించే చిరునవ్వులు, మన మాటలకు ఊ కొట్టడాలూ... ఏవీ వ్యర్థం కావంటున్నారు శాస్త్రవేత్తలు. పైగా ఇవి వారి మానసిక వికాసానికి చాలా అవసరం అని చెబుతున్నారు.
అయోమయం నుంచి
అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఆహ్వానించేందుకు ఓ సరికొత్త ప్రపంచం సిద్ధంగా ఉంటుంది. ఆ ప్రపంచంలో తన వారు ఎవరు, తనకి తరచూ వినిపించే స్వరాలు ఎవరివి అన్న అభిప్రాయానికి వచ్చేందుకు పిల్లవాడికి కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో తల్లి బిడ్డల అనుబంధం అతని మెదడు మీద శాశ్వతమైన ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశోధకులు.
స్కానింగ్ చేస్తే
పసిపిల్లలకు భాష వచ్చినా రాకపోయినా వారితో మాట్లాడుతూ ఉండటం మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. దీనివల్ల వారు తల్లిదండ్రులను త్వరగా గుర్తుపట్టడంతో పాటుగా తాము సురక్షితంగా ఉన్నామన్న నమ్మకంతో ఉంటారని చెబుతారు. అయితే ఇలా తల్లులు వారి పసిపిల్లలతో ముద్దుముద్దు మాటలు మాట్లాడేప్పుడు, వారి మెదడు లోపల ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అని గమనించేందుకు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తల్లీబిడ్డల మెదడుని స్కానింగ్ చేసి చూశారు.
అవి వ్యర్థ పదాలు కావు
తల్లులు పాపాయిలతో గారాబంగా మాట్లాడుతున్నప్పుడు... తల్లీబిడ్డల మెదళ్ల మధ్య ఒకరకమైన అనుసంధానం ఏర్పడటాన్ని స్కానింగ్‌లో గమనించారు. ఇలాంటి సమయంలో పాపాయిల మెదుడులో భాషని నేర్చుకోవడానికి సంబంధించిన వ్యవస్థ చురుకుగా రూపుదిద్దుకుంటోందని స్పష్టమయ్యింది. అంతేకాదు! పసిపిల్లలతో మాట్లాడేటప్పుడు ఏదో మొక్కుబడిగా కాకుండా... వారి కళ్లలోకి నేరుగా చూస్తున్నప్పుడు, పాపాయిల మెదడులో మరింత సానుకూలమైన స్పందనలు కలిగాయట.
ప్రేమే మూలం
పాపాయి పట్ల ప్రేమతో వ్యవహరించినప్పుడు మన స్వభావం వేరుగా ఉంటుంది. తనతో ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించడం, కబుర్లు చెప్పడం, తిరిగి వారు ఏదో ఒక శబ్దం చేసేలా ప్రోత్సహించడం, నవ్వించడం, లాలి పాటలు పాడటం వంటి చర్యలన్నీ ప్రేమ, ఓర్పుతోనే సాధ్యమవుతాయి. ఇలా ఆట ద్వారా మాట ద్వారా పాపాయిలో సహజమైన మానసిక వికాసం ఏర్పడుతుంది. అలా కాకుండా చిన్న వయసులోనే వారి పట్ల పెద్దగా శ్రద్ధ చూపించకపోతే, వారి మెదడు కూడా ఒత్తిడి లోనవుతుందని అంటున్నారు పరిశోధకులు. దీని వల్ల సహజంగా, నిదానంగా ఉండాల్సిన వికాసం అడ్డదిడ్డంగానూ అకస్మాత్తుగానూ కలుగుతుందట. ఫలితంగా వారి జీవితమే ప్రభావితం అవుతుందని హెచ్చరిస్తున్నారు.[:]

Comments
Post a Comment