(Telugu) కఠినమైన పెంపకంతో... చదువు పాడైపోతుంది
[:te]పిల్లల పెంపకానికి సంబంధించి ఎన్ని పరిశోధనలు జరిగినా, ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది. పిల్లలకి సంస్కారం నేర్పడమే ముఖ్యమైన ధ్యేయంగా ఉండాలనీ, దండనతో పిల్లలు మొద్దిబారిపోతారనీ... ఇలా రకరకాల విషయాలని నిపుణుల ద్వారా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా కఠినమైన శిక్షణలో పెరిగే పిల్లలు, చదువులో వెనకబడిపోతారని తేల్చారు.
చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచీ తగినంత ప్రేమని పొందనివారు, క్రమేపీ ఆ లోటుని స్నేహితుల దగ్గర భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తారట. అలా స్నేహితులకి అధిక ప్రాధాన్యతని ఇచ్చే క్రమంలో తనదైన వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పుకొస్తున్నారు పరిశోధకులు. నేరప్రవృత్తి, లైంగిక విశృంఖలత వంటి తాత్కాలిక లక్ష్యాలకి ప్రాధాన్యతని ఇస్తూ దీర్ఘకాలిక లక్ష్యాలైన చదువు, వ్యక్తిత్వం వంటి ప్రాధాన్యతలను వారు విస్మరించే ప్రమాదం ఉందంటున్నారు. ఇలాంటి పిల్లల్ని ముందుగానే గమనించడం వల్ల వారిని తిరిగి సరైన దారికి తీసుకువచ్చేలా తగిన కౌన్సిలింగ్‌ను అందించవచ్చని సూచిస్తున్నారు. అయినా చేతులు కాలేదాకా చూసుకుని కౌన్సిలింగ్ ఇచ్చేకంటే, తల్లిదండ్రులే కాస్త జాగ్రత్తగా తమ పిల్లలను పెంచుకుంటే సరిపోతుంది కదా![:]

Comments
Post a Comment