అక్షయ తృతీయ

అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఇంతకీ అక్షయ తృతీయ అంటే ఏమిటోఎలా వచ్చిందో తెలుసుకుందామా?!అక్షయం అంటే క్షయం లేనిది అని అర్థంఅంటే శాశ్వతంగా ఉండేదిఅందుకే బంగారంస్థలాలుపొలాలు లాంటి విలువైన వాటిని అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం మొదలుపెట్టారుఈరోజు బంగారం కొంటేమంచిదనిఅదృష్టం కలసివస్తుందని నమ్ముతారుఈరోజు పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారుఅక్షయ తృతీయ పర్వదినం కోసం వ్యాపారులు ప్రత్యేక నగలు తయారుచేస్తారుముఖ్యంగా లక్ష్మీదేవి రూపాన్ని చిత్రించిన నాణాలురత్నాలు పొదిగిన నగలు ఈరోజు విశేషంగా కొంటారు.


పురాణాల్లో అక్షయ తృతీయ విశిష్టత 

వేద వ్యాసుడు అక్షయ తృతీయనాడే మహాభారతం ఆరంభించాడువ్యాసుడు చెబుతుంటేవినాయకుడు రాశాడువిష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయనాడే.
త్రేతాయుగం అక్షయ తృతీయ నాడే ప్రారంభం అయిందిఅక్షయ తృతీయ నాడు చాలామంది విష్ణుమూర్తిని ప్రార్ధించిఉపవాసం ఉంటారుదానధర్మాలు చేస్తారుబియ్యంఉప్పునెయ్యిపంచదారకూరగాయలుపసుపుపండ్లుబట్టలువస్తువులు - ఇలా ఎవరికి తోచినవి వారు దానం చేస్తారు.
మహా ధనవంతుడు అయిన కుబేరుడు కూడా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజిస్తాడు.
అయోధ్య రాజు తీర్ధంకర రిషభదేవ సర్వ సంపదలూ త్యజించిజైన సన్యాసిగా జీవించదలచాడుజైన స్వాములు సర్వసంగపరిత్యాగులుఆఖరికి తమ ఆహారాన్ని కూడా తాము వండుకోరుఆకలేసినాదాహమేసినా యాచనకు వెళ్తారుఒకరోజు రిషభదేవునికి ఆకలి వేసి యాచనకు వెళ్లాడుఅయితే తమ రాజు అడుగుతున్నది ఆహారం అని ఎవ్వరికీ అర్ధం కాలేదుమహారాజు తమను అభ్యర్ధిస్తున్నాడు అంటే ధనమే అనుకున్నారుఇక అయోధ్య ప్రజలు రాజుగారికి బంగారంనగలువజ్రవైఢూర్యాలుఏనుగులుగుర్రాలుఖరీదైన దుస్తులు లాంటివెన్నో ఇచ్చారుఒక్క ఆహారం తప్ప అన్నీ ఇచ్చారుపాపంరిషభదేవుడుఇక ఆయనకడుపు కాలిపోతోంది అని చెప్పలేకఆకలితో అలమటిస్తూ అలా ఉండిపోయాడుఒక సంవత్సరం అలాగే ఉండిపోయాడుచివరికి ఆయన మనవడు శ్రేయాంశ కుమారుడు తాతగారి ఆకలిని గ్రహించి చెరుకురసం ఇచ్చాడుసరిగ్గా ఆరోజు అక్షయ తృతీయఅప్పటినుంచి జైనులకు అక్షయ తృతీయ పవిత్రదినం అయిందిఉపవాసం ఉంటారుపరస్పరం కానుకలు ఇచ్చుకుంటారు.
హిందువులుజైనులు విశేషంగా జరుపుకునే అక్షయ తృతీయను 'అఖ తీజ్అని కూడా అంటారువైశాఖమాసంశుక్లపక్షం మూడవ రోజు అక్షయ తృతీయ.అక్షయ తృతీయనాడు ఏం చేస్తారు ?
ధన దేవత లక్ష్మీదేవిని పూజిస్తారుసంవత్సరం పొడుగునా ధనధాన్యాలు పుష్కలంగా రావాలని కోరుకుంటారు.
మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి,నాలుగు దిక్కులకు నాలుగు నాణాలను విసిరేస్తారుఇలా చేయడం వల్ల సంపదలు రావడానికి ద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు.
బెంగాల్లో అక్షయ తృతీయ నాడు వ్యాపారులు గణపతికిలక్ష్మీదేవికి పూజలు చేసికొత్త పద్దు పుస్తకాలు తెరుస్తారు.
ఈరోజు గురువులకు దక్షిణ ఇస్తారుపేదలకు దానధర్మాలు చేస్తారు.
పూరీ రధయాత్రకు అవసరమైన రధాలను తయారుచేయడం కోసం ఒరిస్సా రైతులు అక్షయ తృతీయ నాడు మట్టిని తవ్వుతారుచాలామంది అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండివసుదేవుని ప్రార్థిస్తారు పవిత్ర దినాన గంగానదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందిఎదైనా వ్యాపారం ప్రారంభించడానికి అక్షయ తృతీయ చాలా మంచిది.


అక్షయ తృతీయనాడు బంగారం కొనకపోతే ఏమవుతుంది ?
ఇంతకీ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా బంగారం కొనడం అనే సంప్రదాయం ఎలా వచ్చింది - అనే సందేహం కలగడం సహజం.
అక్షయ తృతీయనాడు బంగారం కొనాలనే ఆచారం పూర్వం నుంచీ ఉన్నది కాదుదక్షిణాదిన అసలే లేదు సంప్రదాయం ఉత్తరాదినుండి మనకు వచ్చింది.. ఈమధ్యకాలంలో మరీ వ్యాప్తి చెందిందిఇది ఖచ్చితంగా వ్యాపారుల చలవేతమ లాభం కోసం విస్తృతంగా ప్రచారం చేశారుఇక సామాన్యులు అక్షయ తృతీయనాడు బంగారం కొంటేకలసివస్తుంది అని నమ్మి దీన్ని ఒక ఆచారంగా పాటిస్తున్నారుడబ్బు ఉంటేబంగారంస్థలాలు ఎప్పుడైనా కొనుక్కోవచ్చుఅవి ఆస్తులుగా మిగులుతాయిఅక్కరకు పనికొస్తాయికానీఅక్షయ తృతీయనాడే కొనాలనే నియమం ఎక్కడా లేదుపోటీ ప్రపంచంలో ఏదో నెపంతో వ్యాపారులు మనచేత వస్తువులు కొనిపించాలి అనుకోవడం సహజంఅంతమాత్రాన డబ్బు చేతిలో లేకుంటే అప్పు చేసి కొనాల్సిన అవసరం లేదు కదా!

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము