దంపతులు - ఆది దంపతులు





*దంపతులు - ఆది దంపతులు*

శివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ పక్కన కూర్చున్న పేరంటాలితో గుసగుసగా ఈ మాటలు అంది..


ఇదేం విడ్డూరం అమ్మాయ్!

పార్వతి దేవి *ఎండకన్నెరుగని పిల్ల*, పరమేశ్వరుడేమో  *ఎండలో ఎండిపోతూ వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం*!


ఆమె తనువంతా *సుగంధ లేపనాలు*, అతడి శరీరమంతా *బూడిద గీతలు*.

ఆమె చేతులకు *వంకీలు*,

అతడి చేతులకు *పాము పిల్లలు*.

ఎక్కడా పొంతనే లేదు చూస్తూ ఉండూ...నాలుగు రోజులైతే పెళ్ళి పెటాకులవుతుంది! అంది.


నాలుగు రోజులు కాదు, నాలుగు యుగాలు గడిచిపోయాయి... 

కానీ వారు *ఆదిప్రేమికులు*, *ఆదిదంపతులు* గా 

వర్ధిల్లుతూనే ఉన్నారు.  

"బయటికి కనిపించే రూపాన్ని కాదు

శివుని *అంతః సౌందర్యాన్ని* చూసింది పార్వతి దేవి"

అతడు *విష్ణువు* అయితే ఆమె *లక్ష్మీ దేవీ*.

అతడు *సూర్యడైతే* ఆమె *నీడ*. 

అతడు *పదం* అయితే ఆమె *అర్థం*.

అలా అని ఆ దంపతుల మధ్య

*విభేదాలు* రాలేదా అంటే వచ్చాయి,

ఆ కాపురంలో *సమస్యలు* తలెత్తలేదా అంటే తలెత్తాయి.    

*ప్రతి సమస్య తర్వాత ఆ బంధం మరింత బలపడింది.*

*ప్రతి సంక్షోభం ముగిశాక ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు*.

ఏ ఆలుమగలైనా *పట్టువిడుపుల* పాఠాల్ని

శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి!


ఒకసారి శివుడు *మాట చెల్లించుకుంటే*,

మరోసారి పార్వతి *పంతం నెగ్గించుకుంటుంది*!


మధురలో *అమ్మవారిదే పెత్తనం*!

సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే.  

నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి.  

                

అదే చిదంబరంలో నటరాజస్వామి మాటే శాసనం.  

శివకామసుందరి *తలుపుచాటు ఇల్లాలు*.

  

ఒక్క మధురై, ఒక్క చిదంబరం ఏంటి!

ఇలా *ఎన్నోచోట్ల భార్య పెత్తనం*

అలానే *భర్త పెత్తనం మరి కొన్నిచోట్ల*.

అందుకే వారు ఇద్దరూ జగత్తును ఏలే *ఆదిదంపతులు* అయినారు *పార్వతీపరమేశ్వరులు.

అందుకే ఏ జంటను దీవించాలన్నా *పార్వతి పరమేశ్వరులు గా కలకాలం ఉండండి* అని దీవిస్తారు.


[:]

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము