పూజకు సిద్ధమై పోయారా?

పూజకు సిద్ధమై పోయారా? మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటకి వెళ్ళి తెద్దాం ...అన్నట్టు   భగవంతునికి ఇష్టమైన పూలేంటో తెలుసా!


 ఇవిగో.....

అహింస  ప్రథమం  పుష్పం!
పుష్పం  ఇంద్రియ  నిగ్రహః !!

సర్వ భూత  దయా పుష్పం !
క్షమా  పుష్పం  విశేషతః !!

జ్ఞాన  పుష్పం  తప: పుష్పం !
శాంతి  పుష్పం  తథైవ  చ !!

సత్యం  అష్ట విధం  పుష్పో: !
విష్ణో హో  ప్రీతి కరం  భవేత్ !!

1.అహింసా పుష్పం:
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

2.ఇంద్రియ నిగ్రహం:
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం

3.దయ:
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.....ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం

4.క్షమ:
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ....ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం

5.ధ్యానం:
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం....ఇది దేవుని అందించే ఐదో పుష్పం

6.తపస్సు:
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.....ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం


7.జ్ఞానం:
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం....ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం

8.సత్యం:
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.... ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం

అవి చాలా అరుదైన పుష్పాలు, అవి మా తోటలో అన్ని లేవే అంటున్నారా! మరేం ఫరవాలేదు ఇవాళే మొక్కలు నాటండి..... త్వరలోనే మిగతా పూలు పూయించండి.


ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?
1⏩గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2⏩ ఎంత అవసరమైన కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3⏩మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4⏩శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్త్రీలు వెనక వుండాలి.
5 ⏩ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6 ⏩అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7 ⏩ పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8 ⏩పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9 ⏩చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10⏩పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.



దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు
బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

.....పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం..... చేసే సహాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు....



సాష్టాంగ నమస్కారము

సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చెయ్యాలి.... స్త్రీలకు నిషిద్ధం.... సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు.... తమ ఎనిమిది అంగాలనూ, అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్లు, కళ్లు భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు

కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది..... ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది.... ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది.... అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది.... అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు తెలుసుకుందాం

ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి.

ఉరసా శిరసా దృష్ట్యా
మనసా వచసా తథా !
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం
ప్రణామోష్టాంగ ముచ్యతే !!

“అష్టాంగాలు” :- అంటే “ఉరసా” అంటే తొడలు, “శిరసా” అంటే తల, “దృష్ట్యా” అనగా కళ్ళు, “మనసా” అనగా హృదయం, “వచసా” అనగా నోరు, “పద్భ్యాం” అనగా పాదములు, “కరాభ్యాం” అనగా చేతులు, “కర్ణాభ్యాం” అంటే చెవులు.... ఇలా “8 అంగములతో నమస్కారం” చేయాలి.

''మానవుడు" సహజంగా ఈ “8 అంగాలతో” తప్పులు చేస్తుంటారు.... అందుకే “దేవాలయంలో” బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ “దేవునికి” నమస్కరించి “ఆయా అంగములు” నెలకు తగిలించాలి....
ఇలా చేయడం వల్ల “మనం” చేసినటువంటి “పాపాలు” తొలగి “పుణ్యం” లభిస్తుంది.

ముఖ్యంగా :- “దేవాలయంలో” సాష్టాంగ నమస్కారం “దేవుడికి, ధ్వజస్తంభానికి” మధ్యలో కాకుండా “ధ్వజస్తంభం” వెనుక చేయాలి.

1) ఉరస్సుతో నమస్కారం - అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి....

2) శిరస్సుతో నమస్కారం - అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి....

3) దృష్టితో - అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి.


5) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి.
అంటే - ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో
మాట పలుకుతూ నమస్కరించాలి.

6) పద్భ్యాం నమస్కారం - అంటే - నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) కరాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) కర్ణాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చెవులను కూడా నేలకు తగులుతూ ఉండాలి

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము