(Telugu) అడవిలో హాస్పిటల్
[:te]అడవిలో హాస్పిటల్
'కొన్ని కొన్ని జంతువులు -కొంతమంది డాక్టర్ల్ ను కలిసి ట్రిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంత్తెనా ఉంది నాన్నా' అన్నాడు మా బుజ్జిగాడు.
నేనూ మా బుజ్జిగాడు కలిసి డిస్కవరీ ఛానెళ్ళూ, యానిమల్ ప్లానిట్లూ చూడటం నాపాలిట పెద్ద శాపమైంది. పాపం ... కొన్ని జంతువులును కొంతమంది డాక్టర్ల్ ను చూపించక తప్పదంటూ వాడు తనదైన శైలిలో నా దృష్టికి తెచ్చాక ... గొంతు పెగుల్చుకొని ఒక మాట మాత్రం అనగలిగాను. అదేమిటంటే ...
'ఏయే జంతువులు ... ఏయే స్పెసలిస్టులను కలవాలి? అసలెందుకు కలవాలి' అడిగా.
' చెబుతా వినండీ అంటూ చెప్పిన విషయాలూ ... కారణాలివి...
******
* ఏనుగులూ, హిప్పోలూ, రైనోలు అనునిత్యం శాకాహారం మాత్రమే తింటున్నా వాటికి విపరీతంగా ఒళ్ళొచ్చొంది. ఆ ఒబేసిటీ తగ్గడం ఎలాగో తెలుసుకొని, అవసరమైతే లైపోనో లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోడానికి అవి బేరియాట్రిక్ సర్జన్ ను కలవాలి.
*'పాముచెవులూ అంటూ సామెత ఉన్నప్పటికీ వాటికి చెవులు అస్సలు వినపడవట.'జాకబ్ సన్ ఆర్గాన్' లాంటి ఇప్పుడున్న జ్ఞానేంద్రియాలకు తోడు చెవులు కూడా వినపడితే పాములు మరింత చురుగ్గా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అందుకే పాములన్నీ ఒకసారి 'ఈ ఎన్ టీ' డాక్టర్ తో మెడికల్ క్యాంపు పెట్టించుకోవడం చాలా అవసరం.
* తల నిండా తగినంత జుట్టు లేకపోవడంతో రాబందు బట్టతల స్పష్టంగా కనిపిస్తుంది. బట్టతల కారణంగా దానికి ఓ క్రూరమైన లుక్ వచ్చింది. కాబట్టి అది తక్షణం ట్రైకాలజిస్టును కలిసి తల మీద 'ఈకల ట్రాన్స్ ప్లాంటేషన్' చేయించుకుంటే మంచిది.
* కష్టలూ, బాధలూ ఏవీ లేకపోయినా మొసలి కళ్ళలోంచి అదేపనిగా నీళ్లు కారుతుంటాయి. ఆ కన్నీళ్లు కారణంగా 'మొసలి కన్నీళ్లు' అంటూ ఓ బ్యాడ్ నేం కూడా వచ్చింది. అందుకే మొసలి తక్షణం కంటి డాక్టరును కలవాలి.
* చెక్కర చుట్టూ చీమలూ, బెల్లం చుట్టూ ఈగలు తెగ ముసురుతుంటాయి.ఇలా స్వీట్స్ చాలా ఎక్కువగా తినడం వల్ల తమకు ముందు ముందు మధుమేహం వస్తుందేమోనని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోడానికి అవి ఒక డయాబెటాలజిస్టును కలిసి ముందుస్తు పరిక్షులు చేయించుకుంటే మరీమేలు.
* జీర్ణశక్తి సరిగా లేకపోవడంతో ఆహారం ఒంటికి సరిగా అందక కుందేళ్లు విసర్జంచిన వాటినే రెండోసారి తింటాయట. అందుకే ఈనో లాంటి యాంటసిడ్స్ తీవడంతో పాటు, మంచి జీర్ణశక్తిని పెంపొదించుకోడానికి ఏం చేయాలో తెలుసుకోవాలి. అందుకోసం కుందేళ్లు ఒకసారి గ్యాస్ట్రోఏంటరాలజిస్ట్ ను కలవడం చాలా అవసరం.
* హైనాలూ పొంచి తింటాయి. పైగా బోలెడంత రౌడీయిజం చేసి మరీ వేటజంతువుల నుంచి మాంసం లాక్కుంటాయి. తోడేళ్లూ అంతే. అయినప్పటికి జిత్తులమారీ అని నక్కకే చెడ్డ పేరుంది. తన బిహేవియర్ ను ఎలా సరిదిద్దుకుంటే జిత్తులమారీ అనే ఈ బ్యాడ్ నేం తొలిగిపోతుందో తెలుసుకొని అనుసరించడానికి నక్క సైకియాట్రిస్టు ను కలవాలి .
* మందకొడిగా ఉండటం వల్ల తమకు కలుగుతున్న నష్టాన్ని గుర్తించి, మిగతా పాముల్లా తాము కూడా చురుగ్గా కదలడానికి ఏం చేయాలో సూచనలు తీసుకోవడం కోసం కొండచిలువలూ, అనకొండలూ లైఫ్ స్టైల్ స్పెషలిస్టును
* ఈ లోకంలో ... అందునా మన దేశంలో తెల్లటి మేనిరంగుకే గౌరవం ఎక్కువ. అందుకే పక్షిలోకంలో గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం కాకి డర్మటాలజిస్టును కలిస్తే బెటర్. 'ఫెయిర్ అండ్ లౌలీ'తో లాభం ఏమైనా ఉంటుందేమో తెలుసుకోవడంలోనూ తప్పు లేదు.
* ఇక ఆ తొండలకైతే పొద్దస్తమానం అక్కడ ఇక్కడా బస్కీలు తీస్తూ గడపడం తప్ప మరే పనీ లేదు. ఆ ఊసరవల్లిని చూడండి . క్షణక్షణానికి ఒంటిరంగు మార్చుకుంటూ పురుగులు పట్టుకొని తిని హాయిగా ఉంటున్నాయి. తాము బాగా ముదిరాక ఊసరవెల్లిగా మారడం కంటే ముందునుంచే రంగుమారే టెక్నిక్ ను తెలుసుకోవడం కోసం తొండలూ ఒక సారి డర్మటాజిస్థును కలవడం మంచిదేమో.
* కోయిల విషయానికి వస్తే ... కేవలం వసంతకాలపు వేసవిలో మామిడి చిగుల్లు వచ్చే కాలం లోనే పాడగలుగుతోంది. మిగతా అన్ని కాలాల్లోనూ అలాగే పాడగలిగేందుకు ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇందుకోసం కోయిల కూడా 'ఈ ఎన్ టీ' సర్జన్ కు కలిస్తే వాటి ప్రతిభ అన్ని సీజన్లకూ విస్తరిస్తుంది.
* చాలా ఎత్తుగా ఉండటం వల్ల చెరువు నుంచి నీళ్లు తాగాలంటే జిరాఫీకి చాలా కష్టమవుతోంది. కాళ్లు విశాలంగా చాపుకుంటూ చాలా కష్టంగా మెడ వంచి నీళ్ళు తాగాల్సివస్తోంది. అందుకే కాస్త ఎత్తు తగ్గేలా ఆపరేషన్ ఏదైనా చేయించుకోవచ్చేమో తెలుసుకోడానికి జీరఫీలు ఒకసారి 'ఆర్డోపెడిక్ సర్జన్' ను కలిస్తే మంచిదేమో.
* అదే పనిగా ఎంతసేపు నీళ్ళలో ఉన్నా జలుబు చేయకుండా ఉండటానికి టిప్స్ తెలుసుకోవడం కోసం కొంగలు 'ఈ ఎన్ టీ' సర్జన్ ను కలవాలి.
* 'ఒరేయ్... మరి ఇన్ని తెలిసిన నువ్వు త్వరగా డాక్టర్ అయి జంతుప్రపంచానికంతా ఇతోధికంగా సేవ చేయవచ్చుకదా' సలహా ఇచ్చాను నేను.
"వద్దు నాన్నా... డాక్టర్ అయితే ఏదోఒక స్పెషాలిస్టికీ మాత్రమే పరిమితం కావాలి. ఏ డాక్టర్ కూడా చదవకుండానే పెట్టుబడి పెట్టి ఒక హాస్పిటల్ పెట్టాననుకో... అందరు స్పెషలిస్ట్ లు మన దగ్గరే ... అన్ని జీవులూ మనవద్దకే' అన్నాడు బుజ్జిగాడు.[:]

Comments
Post a Comment