[:te]ఒక రాజ్యంలో ఒక గొప్ప గురువు ఉండే వాడు. అతని పేరు విద్యా నాధుడు. అతని వద్ద చాలా మంది శిష్యులు ఉండేవారు. విద్యా నాధుడు శిష్యులను ప్రేమతో చూస్తూ విద్య బుద్దులు నేర్పేవాడు. అప్పుడప్పుడు వారికి విద్యలోనే కాక వేరే విషయాలలో కుడా పరీక్షలు పెడుతుండే వాడు. ఆయన వద్ద అనంతుడనే శిష్యుడు విద్య నేర్చుకునేవాడు. ఒకసారి అనంతుడు గురువుగారు ఏది అడిగిన ఇస్తాను అని తోటి విద్యార్దులతో గొప్పలు చెప్పాడు. ఆవిషయం గురువు గారికి తెలిసింది. అవి నేరేడు పండ్లు కాసే రోజులు కావు. కాని అనంతుని పరీక్షించ డానికి గురువు గారు అనంతుని నేరేడు పండ్లు తీసుక రమ్మని చెప్పాడు. అందరు ఆశ్చర్యంతో అనంతుడు ఏమి చేస్తాడా అని చూడ సాగారు. అనంతునికి గూడా ఏమి చెయ్యాలో తోచలేదు. గురువు గారు ఏది అడిగిన ఇస్తానని తోటివారితోచెప్పాడు. ఇప్పుడు గురువు గారుఅడిగిన పండ్లు దొరికేరోజులు కావు. ఎలానా అని అనుకుంటుండగా అతనికి ఒక ఉపాయం తోచింది. గురువుగారి దగ్గరకు వెళ్లి “గురువుగారు నేను పండ్ల కోసం వెళుతున్నాను. నేను వచ్చేదాకా మీరు ఇక్కడినుండి కదలవద్దు.” అనిచెప్పి వెళ్ళాడు. అతడు కాసేపట్లోవచ్చి పండ్లుదొరకలేదని చెపుతాడని అప్పుడు గొప్పలు చ...
[:te]మధ్వాచార్యులు (కన్నడ:ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯರು) ద్వైత వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మాధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలిస్తారు. మధ్వాచార్యుడు, హనుమంతుడు మరియు భీముడు అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. పుట్టుక / బాల్యము మద్వాచార్యులు ఉడిపి వద్ద నున్న పాజక గ్రామంలో 1238 సంవత్సరంలో విజయదశమి రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు. బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే ఆయన పేరు పూర్ణప్రజ్ఞుడు గా మారింది. ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ...
చంద్రుడు పుష్యమి నక్షత్రం లో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనది గా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం గా చెప్ప బడింది. ఈ మాసం లో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపం లో లక్ష్మీ దేవి ని విష్ణు మూర్తి సమేతం గా పూజిస్తారు. ఈ మాసం లో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖు స్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్య కార్యాలకి విశేష మాసం గా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాదిపతి అయిన గురువు ని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది.. పుష్యమాసం లో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటి తో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్న దానం చేయడం వలన శని యొక్క దోషాల...
Comments
Post a Comment