గజేంద్ర మోక్షణం

అడిగెదనని కడు వడిఁ జను-
నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్
వెడవెడ చిడిముడి తడఁ బడ
నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్

గజేంద్ర మోక్షణ ఘట్టం.
భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు.  లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు.  ఇది 'సర్వలఘు కంద పద్యం'.

`ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది.

పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

Comments

Popular posts from this blog

గురుశిష్యులు

(Telugu) మధ్వాచార్యులు

ఉపనయనము