Posts

Showing posts from 2018

(Telugu) ఒక్క క్లిక్‌తో మహిళా పధకాల సమాచారం

[:te]కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మహిళా పధకాల సమాచారాన్ని పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 'నారీ' అనే వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా 350 పధకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. సంక్షేమ పధకాలతో పాటు మహిళా హక్కులు, ఆర్ధికావశాలు, సాంఘిక సహకారం, న్యాయ సహాయం, గృహ నిర్మాణ పధకాల గురించి ఈ వెబ్‌సైట్‌లో ఉంచారు. పలు మంత్రిత్వశాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి డేటాను సేకరించారు. పోషకాహారం, వైద్య సలహాలు, ప్రధానమైన వ్యాధుల గురించి సమచారం కూడా ఇందులో ఉంది. మహిళలపై జరుగుతున్న నేరాలు, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు ఈ వబ్‌సైట్ ద్వారా అందిస్తారు. లీగల్‌సెల్‌కు సంబంధించిన ఫోన్ నంబర్లు, పిల్లలను దత్తత తీసుకోవడానికి సరళమైన విధానాల గురించి సమాచారం అందుబాటులో ఉంచారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అవకాశాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వావలంబనకు అవసరమైన ప్రతి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. Reference URL: http://nari.nic.in/  [:]

(Telugu) బ్యూటి టిప్

[:te]ఒక టీ స్పూన్ మీగడలో అంతే మోతాదులో నిమ్మరసం కలిపితే హోమ్‌మేడ్ క్లెన్సింగ్ క్రీమ్ రెడీ. దీనిని ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో కాని గోరువెచ్చటి నీటితో కాని శుభ్రం చేయాలి. ఇది చర్మానికి టోనర్‌గా పని చేస్తుంది. చర్మాన్ని తెల్లబరుస్తుంది కూడా. *రోజుకు ఒక టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి చప్పరిస్తే క్రమంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. *టేబుల్ స్పూన్ శనగపిండి, ఒకటిన్నర టీ స్పూన్ల నీళ్లు, చెంచాడు తేనె కలిపి ముఖానికి రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. *నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖం నిగనిగలాడుతుంది.[:]

ఏ పూలతో పూజిస్తే..? పూజాఫలం

[:en] ఏ పూలతో పూజిస్తే..? పూజాఫలం *సంపద కోరేవారు బిల్వపత్రం, కమలం, శతపత్రం, శంఖపుష్పాలతో శివుడిని పూజించాలి. *మోక్షం కోరేవారు దర్భలతో, శమీ పత్రాలతో పూజించాలి. *దీర్ఘాయువు కోరేవారు గరికతో పూజ చేస్తే మంచిది. *సుపుత్రుడు జన్మించాలని కోరుకునేవారు ఉమ్మెత్తపూలతో (ఎర్ర కాడలు ఉన్నది శ్రేష్టం) పూజించాలి. భోగభాగ్యాల మోక్షం కోసం తులసి దళాలతో.. ఎర్ర లేదా తెల్ల జిల్లేడు, శ్వేత కమలాలతో పూజించాలి. *ధర్మానికి ద్రోహులైన శత్రువుల నాశనం కోరినవాళ్లు జపాకుసుమాల(ఎర్ర మందారం)తో పూజించాలి. *రోగనివారణకు కరవీర (గన్నేరు) తో పూజించాలి. *వాహన కోరికను నెరవేర్చుకునేందుకు జాజిపూలతో పూజించాలి. *శుభలక్షణ సంపన్నమైన భార్యను కోరువారు మల్లెలతో పూజించాలి. *సుఖసంపదలకు పారిజాతపుష్పాలతో పూజించాలి. *సర్వకామ్యాలకోసం శంఖుపుష్పాలతో పూజించాలి. *చంపక (సంపెంగ),మొగలి పుష్పాలు తప్ప మిగతా పుష్పాలన్నీ శివుడికి సమర్పించవచ్చు.[:]

(Telugu) అడవిలో హాస్పిటల్

[:te] అడవిలో హాస్పిటల్ 'కొన్ని కొన్ని జంతువులు -కొంతమంది డాక్టర్ల్ ను కలిసి ట్రిట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంత్తెనా ఉంది నాన్నా' అన్నాడు మా బుజ్జిగాడు. నేనూ మా బుజ్జిగాడు కలిసి డిస్కవరీ ఛానెళ్ళూ, యానిమల్ ప్లానిట్లూ చూడటం నాపాలిట పెద్ద శాపమైంది. పాపం ... కొన్ని జంతువులును కొంతమంది డాక్టర్ల్ ను చూపించక తప్పదంటూ వాడు తనదైన శైలిలో నా దృష్టికి తెచ్చాక ... గొంతు పెగుల్చుకొని ఒక మాట మాత్రం అనగలిగాను. అదేమిటంటే ... 'ఏయే జంతువులు ... ఏయే స్పెసలిస్టులను కలవాలి? అసలెందుకు కలవాలి' అడిగా. ' చెబుతా వినండీ అంటూ చెప్పిన విషయాలూ ... కారణాలివి... ****** * ఏనుగులూ, హిప్పోలూ, రైనోలు అనునిత్యం శాకాహారం మాత్రమే తింటున్నా వాటికి విపరీతంగా ఒళ్ళొచ్చొంది. ఆ ఒబేసిటీ తగ్గడం ఎలాగో తెలుసుకొని, అవసరమైతే లైపోనో లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోడానికి అవి బేరియాట్రిక్ సర్జన్ ను కలవాలి. *'పాముచెవులూ అంటూ సామెత ఉన్నప్పటికీ వాటికి చెవులు అస్సలు వినపడవట.'జాకబ్ సన్ ఆర్గాన్' లాంటి ఇప్పుడున్న జ్ఞానేంద్రియాలకు తోడు చెవులు కూడా వినపడితే పాములు మరింత చురుగ్గా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అంద...

ఇంటి నుంచే 9జాబ్స్

[:en]ఆఫీసుకు వెళ్ళి పని చేసేందుకు అవకాశం లేదు. ఇంట్లోనే ఉండాల్సిన పరిస్ధితి. ఏదైనా చేయాలన్న ఉత్సాహం మాత్రం ఉంది. అప్పుడు ఏం చేయాలి అనుకుంటే, ఇదిగో మీకూ ఈ అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు సంబంధిత నిపుణులు. అవేంటో చూద్దాం. తగు నైపుణ్యం ఉంటే చాలు, అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే ఇక తరువాయి.......... ఇంటి నుంచే 9జాబ్స్ 1.వర్చ్యువల్ అసిస్టెంట్ షిప్:-అంత్రప్రెన్యూర్లు, వృత్తి నిపుణులు, చిన్నపాటి బృందాలకు అడ్మినిస్ట్రిటివ్ కార్యకలాపాల కోసం సిబ్బంది అవసరమవుతారు. సమావేశాల షెడ్యూలింగ్, క్లయింట్లు- ఇన్వెస్టర్లతో టచ్ లో ఉండటం, వివిధ ఆర్డర్ల ఫాలోఅప్, బిజినెస్ డాక్యుమెంట్లు సృష్టి అంటే పవర్ పాయింట్ ప్రజంటేషన్లు, ఎక్సెల్ సీట్లు, బ్లాగులు - వెబ్ సైట్స్ నిర్వహణ వంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వర్చువల్ అసిస్టెంట్ల పని ఇక్కడ ముఖ్యంగా వివిధ వ్యవహారాలను సమన్వయపర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బిజీలో ఉండే వ్యక్తులకు సంబంధించిన ఆయా పనుల్లో సహకరించాలి. ఇందుకోసం కొద్దిపాటి శిక్షణ చాలా అవసరం. అలాగే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ వంటి అప్లీకేషన్స్ తెలియాలి.Elance and Zirtual వంటి సైట్ల ద్వారా వర్...

(Telugu) వేమన పద్యాలు

[:te] 1.తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు తలచి చూడనతకు తత్వమగును వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా విశ్వదాభిరామ వినుర వేమ! 2.తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి మిగిలి వెడలవేక మిణుకుచున్న నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ విశ్వదాభిరామ వినుర వేమ! 3.తనదు మనసుచేత దర్కించి జ్యోతిష మెంత చేసే ననుచు నెంచి చూచు, తన యదృష్టమంత దైవ మెఱుంగడా? విశ్వదాభిరామ వినుర వేమ! 4.టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు లోకమందు జెప్పి మంచు కాకులట్టి జనుల కానరీ మర్మము విశ్వదాభిరామ వినుర వేమ! 5.జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి రెంటినందు రిమ్మరేచునపుడు రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా విశ్వదాభిరామ వినుర వేమ! 6.జాణలమని యంద్రు చపలాత్ములగువారు తెలివిలేక తమ్ముతెలియలేరు కష్టమైన యడవి గాసీలుచున్నారు విశ్వదాభిరామ వినుర వేమ! 7.జనన మరణములన స్వప్న సుషుప్తులు జగములందు నెండ జగములుండు నరుడు జగమునంట నడుబాటు కాదొకో విశ్వదాభిరామ వినుర వేమ! 8.ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు లడగి దరినిజేరి పడయవచ్చు నట్టునిట్టు దాటనది పోవునిది రామ విశ్వదాభిరామ వినుర వేమ! 9.నరుడెయైన లేక నారాయణుండైన ...

(Telugu) విజయానికి ఎనిమిది సూత్రాలు

[:te]  ధారణాశక్తిని పెంపొందించడానికి ఉపకరించే తొలి ప్రయోగాత్మ పుస్తకమిది. విద్యార్థుల ధారణాశక్తిని పెంపొదిందించి ప్రగతిపధంలో నడిపించే లక్ష్యంతో వ్రాయబడిన ప్రయోగాత్మక పుస్తకం. ఈ పుస్తకలో ఆలోచనలకు మూలమైన మెదడు కంప్యూటర్‌తో పోల్చబడింది. మెదడుకున్న శక్తిని గిర్తించడం, ఆలోచనాతీరును మార్చుకోవడం, ధారణాశక్తిని అభివృద్ధిచేసుకోవడం ఎలాగో వివరించబడింది. చదువును ఆరాధించడం మంచి విద్యార్థిగా, మంచి శిస్యుడిగా, పలువురికి ఆదర్శంగా నిలవడానికి అవసరమైన మార్గాలు సూచించబడ్డాయి. తమను తాము మార్చుకుని ప్రపంచన్ని కొత్త దృష్టికోణంతో చూస్తూ విజయం సాధించడమెలాగో తెలియజేస్తుంది. సాధారణంగా వ్యక్తిత్వ నిర్మాణం ( పర్సనాలిటీ బిల్డింగ్) గురించిన ఇలాంటి పుస్తకాలు ఆంగ్లభాషలో అత్యధికంగా లభిస్తున్నాయి. అచ్చ తెలుగులో సరళమైన భాషలో రచించబడి విద్యార్థులలో ప్రేరణకలిగించి ఉన్నతిని సాధించడానికి సహకారాన్ని అందించే ఇటువంటి ప్రయోగాత్మకమైన పుస్తకాలలో ఇది మొదటిదని పుసకం కడపటి పత్రంలో వివరించబడింది. విషయ సూచిక మైండ్ సెట్టింగ్ మోటివేషన్ విన్నర్ యాటిట్యూడ్ స్టడీ స్కిల్స్ టైం మేనేజ్మెంట్ (సమయపాలన) కాన్సన్‌ట్రేషన్ టెన్షన్...

(Telugu) వచ్చే డబ్బు, పోయే డబ్బు, దాచుకునే డబ్బు

[:te]ధనవంతుడివి కావాలన్న లక్ష్యంతో ఎండనక, వాననక కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు. ఆ డబ్బు మితంగా వాడుకుంటూ మిగిలిన సొమ్ముని ఆదా చేస్తున్నావు. నీ సంపద సృష్టిలో అత్యంత కీలకమైన విషయం – డబ్బులు ఎక్కడ ఎలా ఆదా చెయ్యాలి అన్న విషయం పైన నీ పరిజ్ఞానం తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడుతున్నాను. ఇది ఎందుకు కీలకమన్నానంటే, దాచుకున్న డబ్బు సకాలంలో, అత్యధిక వడ్డీ సంపాదిస్తేనే సంపద సాధించే అవకాశం వుంటుంది. డబ్బులు దాచుకోడానికి వున్న వివిధ మార్గాలలో ఏ మార్గంలో వెళ్తే ఎంత లాభం వస్తుందో తెలుసుకోలేక చాలమంది తమ డబ్బులను వృధా చేసుకుంటారు. ఈ విషయం నీకు అర్థం అయ్యేలా ఓ కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను. సింగరాయకొండ బస్టాండులో బస్సు భోజనాలకి ఆగింది. వెంకటప్పయ్య, ఆయన భార్య తిరపతమ్మ కొడుకు గోవిందు ముగ్గురూ హోటల్లోకి వెళ్ళారు. వెంకటప్పయ్య మెనూ చూశాడు. అందులో ఫుల్ మీల్స్, ప్లేట్ మీల్స్, హాఫ్ మీల్స్, ఎగస్ట్రా మీల్స్ అని రాసి ధరలు వేసి వున్నాయి. ముగ్గురూ వాళ్ళ వాళ్ళ ఆకలిని బట్టి భోజనాలు ఆర్డర్ ఇచ్చారు. ఓ ఐదు నిముషాలలో ముగ్గురికీ భోజనాలు వడ్డించాడు సర్వర్ సుందరం. ముగ్గురూ భోజనం ప్రారంభించారు. అన్ని పదార్థాలు రుచిగా వున్నాయి. ...

(Telugu) రిస్క్ రివార్డ్ ఎక్కువగా వున్న పథకంలో దీర్ఘకాలిక పెట్టుబడి

[:te]ధనవంతుడివి కావాలన్న కోరికతో నీవు పడుతున్న శ్రమ అభినందించదగినది. డబ్బులు ఆదా చేసే వాళ్ళు తమంతట తామే నిర్ణయించుకోవాల్సినవి, అమలు పరచాల్సినవి కొన్ని వుంటాయి. అవి తెలుసుకోకుండా వుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం వుంది. రాజగోపాలం ఇరవై ఏళ్ళుగా అమెరికాలో వుండి ఇక చాలనుకోని సొంత ఊరు కరువదికి తిరిగి వచ్చాడు. విదేశంలో అవకాశం ఉన్నంతవరకు మన సాంప్రదాయాల్ని పాటించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ అనీ కుదరక కొన్ని కొన్ని విషయాలలో సర్దుకుపోతుండేవాడు. ముఖ్యంగా తన తండ్రి ఆబ్దికం పెట్టాలంటే అక్కడ కుదిరేది కాదు. తిరిగి వచ్చిన రెండు నెలల తరువాత, మరో రెండు రోజుల్లో అతని తండ్రి చనిపోయిన రోజు వస్తుందనగా అతనికి తండ్రి కల్లో కనిపించాడు. “ఒరే రాజగోపాలం, ఇన్నేళ్ళుగా అమెరికాలో నీకు చేతకాకో, వీలుపడకో నాకు తద్దినం తూతూ మంత్రంగా జరిపించావు. ఇన్నాళ్ళకు మన ఊరికి తిరిగి వచ్చేశావు కాబట్టి ఈసారైనా ఆ కార్యక్రమం బాగా జరిపించు. ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన గారెలు చేయించి, బాగా తినగలిగిన బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు పెట్టు” అని కోరాడు. తెల్లవారాక రాజగోపాలం కల గురించి చాలాసేపు ఆలోచించాడు. నిజంగా తండ్రి కనపడ్డాడా లేక అదంతా తన భ్ర...