Posts

ఆరోగ్యకరమైన శీతల పానీయం

  వేసవిలో భగభగమండే భానుడి ప్రతపానికి చల్లగా ఏమ్మన్న సేవించాలి అనిపిస్తుంది. చక్కగా గడ్డ పెరుగును చిలికి చల్లని మట్టికుండలో నీరు పోసి చేన లస్సీ, మజ్జిగ సబ్జా నీళ్ళు బార్లీ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఎండు ఖర్జూరం నీళ్ళు( రాత్రి అంతా నానపెట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే త్వరగా వేడి తగ్గిపోతుంది) నిమ్మరసం సుగంధ నీళ్ళు, సుగంధ పాలు, సుగంధ మజ్జిగ తాజా పండ్లరసాలు ఇవి అన్ని చాలా ఆరోగ్యకరమైనవి మరియు వేసవి తాపాన్ని తగ్గించి తక్షణమే శరీరానికి శక్తిని ఇస్తాయి. వీటిలో చక్కెరకు బదులు పటిక బెల్లం వాడుకుంటే జలుబు కూడా చెయ్యదు.

బర్బరీకుడి శాప వృత్తాంతమేమిటి?

బర్బరీకుడు భీముడికి మనవడు. ఘటోత్కచుడికి కుమారుడు. అతని తల్లి మౌర్వి.బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి, అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. ‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. ‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు. ‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకుల...

దశోపచారాలు

 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం

పంచోపచారాలు

 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం

షోడశోపచారాలు

 1. పాద్యం 2. అర్ఘ్యం  3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం

అష్టాదశోపచారాలు

 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం  5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం

ముప్ఫైఆరు ఉపచారాలు

 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5. సమ్మార్జనం 6. సర్పిఃస్నపనం 7. ఆవాహనం 8. పాద్యం 9. అర్ఘ్యం  10. ఆచమనం 11. స్నానం 12. మధుపర్కం 13. పునరాచమనం 14. యజ్ఞోపవీతం, వస్త్రం 15. అలంకారం 16. గంధం 17. పుష్పం 18. ధూపం 19. దీపం 20. నైవేద్యం 21. నైవేద్యం 22. పుష్పమాల 23. అనులేపనం 24. శయ్యా 25. చామరం 26. వ్యంజనం 27. ఆదర్శం 28. నమస్కారం 29. గాయనం 30. వాదనం 31. నర్తనం 32. స్తుతిగానం 33. హవనం 34. ప్రదక్షిణం 35. దంతకాష్ఠం 36. విసర్జనం