(Telugu) పవిత్ర బంధానికి / పండంటి కాపురానికి - పన్నెండు సూత్రాలు
[:te] శ్రీరస్తూ శుభమస్తూ !!! ఒకప్పుడు arranged marriages ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. పెళ్ళికి ముందు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకలా జీవిస్తారు. ఎలా నడుచుకున్నా తల్లిదండ్రులు భరిస్తారు, బుజ్జగించుకుంటారు, భయపెడతారు, నాలుగు తిట్లు తిట్టి మన ఆలోచనలతో పాటు మనల్నీ సరైన దారిలో పెడతారు. అదే భావం మన తోడబుట్టిన వాళ్ళతో ఉండదు. వారితో మనం ప్రేమగా ఉన్నా, కీచులాటలు, పోట్లాటలు, అసూయలు అవ్వి కూడా చాలానే ఉంటూ ఉంటాయి. కొన్ని కుటుంబాలలో ఎక్కువ, మరి కొందరి విషయాల్లో తక్కువ. ఇక్కడ ఈ వ్యత్యాసం మన age difference వల్ల వస్తుంది. అమ్మ నాన్న అంటే గౌరవం ప్లస్ ఒక జనరేషన్ ముందు వారు కాబట్టి, ప్లస్ మనకి నమ్మకం... వారు మన మంచికే చెబుతారు అని. వినడం వినకపోవడం మన మీదనే ఆధార పడి వుంటుంది. అదే మన తోబోట్టువు అయితే? ఇంచు మించు ఒకే వయసు కాబట్టి ప్రేమ ఆప్యాయతలతో బాటు ఈర్హ్స్యా అసూయలు, చిన్ని చిన్ని గిల్లికజ్జాలు, పోట్లాటలు, ఒకొర్నకరు పోల్చుకోడాలు సహజం. ఇప్పుడు అసలు topicకి వద్దాం. పెళ్లి అయ్యాక జంటల పరిస్థితి ఎలా ఉంటుందో. ఇక్కడ కూడా భార్యా భర్తలిద్దరూ ఇంచుమించు ఒక వయసు పరిధిలోని వారే. సో మ...