Posts

Showing posts from September, 2019

సీతారామకళ్యాణం తెలుగువారికే సొంతమా!

చైత్రశుద్ధ నవమినాడు, మధ్యాహ్నం పన్నెండుగంటల వేళకి రాములవారు జన్మించారన్నది పురాణగాథ. అందుకే భారతదేశమంతా ఆ రోజు శ్రీరామనవమి పేరుతో ఘనంగా జరుపుకొంటారు. కొన్ని చోట్ల రామకథలను గానం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో రాముని విగ్రహాన్ని ఊయలలో వేసి ఆడిస్తారు. ఇంకొన్ని ప్రాంతాలలో సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ రథయాత్రను నిర్వహిస్తారు. కానీ ఒక్క తెలుగనాట మాత్రమే వాడవాడలా సీతారామకళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. తెలుగువారు రాముని తమవాడిగా భావిస్తారు. రాముని తల్లి కౌసల్యాదేవిది ఆంధ్రదేశమే అని చాలామంది నమ్మకం. అందుకనే రాముని వనవాసానికి పంపినప్పుడు, తన తల్లి రాజ్యమైన ఆంధ్రదేశంలో కూడా సంచరించాడట. ఆ సమయంలో ఆయన భద్రాచలంలోని పర్ణశాలలో ఉన్నాడనీ, అక్కడే రావణాసురుడు సీతమ్మవారిని అపహరించాడనీ చెబుతారు. ఆ తరువాత వానరసైన్యంతో కలిసి రాముడు లంకకు చేరుకోవడం, అక్కడ రావణాసురుని సంహరించడం తెలిసిందే! రాముని జీవితం భద్రాచలంతో ఇంతగా ముడిపడి ఉంది కాబట్టి... అక్కడి ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం చేసే ఆచారం మొదలై ఉంటుంది. భద్రాచల రాముని ఆలయాన్ని పునర్నిర్మించిన కంచర్ల గోపన్నే ఈ  ఆచారాన్ని మొదలుపెట్టి ఉంటాడని అంటారు. అలా భద్ర...

(Telugu) చెరుకురసం తాగితే బరువు తగ్గుతారా!

[:te]ఎండాకాలం వస్తోందంటే చాలు... ఎలా దాహం తీర్చుకోవాలా అని శరీరం తపనపడిపోతుంది. అందుకోసం కూల్‌డ్రింక్స్‌ తాగుదామంటే.... అవి మన దాహాన్ని పూర్తిగా తీర్చకపోగా లేనిపోని సమస్యలని తెచ్చిపెడుతుంటాయి. వాటి బదులు కాస్త చెరుకురసాన్ని గుటకవేశామంటే దాహం ఎలాగూ తీరుతుంది, దాంతో పాటు కావల్సినంత ఆరోగ్యమూ దక్కుతుంది. ఎలాగంటారా... బరువు తగ్గి తీరతారు- చెరుకురసంలో కొవ్వు పదార్థాలు కొంచెం కూడా ఉండవు. పైగా ఇందులో ఉండే సహజమైన చక్కెరల వల్ల మన ఒంట్లోని చెడు కొలెస్టరాల్‌ తగ్గుతుంది. వీటికి తోడు చెరుకురసంలో ఉండే పీచు పదార్థాలు ఒంట్లోని మలినాలను తొలగించడంలో తోడ్పడతాయి. షుగర్‌ వ్యాధిగ్రస్తులకూ మంచిదే – షుగర్‌ వ్యాధి ఉన్నవారు, వస్తుందని భయపడేవారు కాస్త మోతాదులో చెరుకురసాన్ని పుచ్చుకోవచ్చునట! చెరుకురసంలోని glycemic index చాలా తక్కువ. అంటే ఇందులో ఉండే చక్కెర పదార్థాలు మన శరీరానికి ఒక్కసారిగా కాకుండా.... నిదానంగా శక్తిని అందిస్తూ ఉంటాయన్నమాట. పళ్లకి మంచిది – తీపి పదార్థాలు తినడం వల్ల పళ్లు పాడైపోతాయని చెబుతూ ఉంటారు. చెరుకురసం ఇందుకు మినహాయింపుగా నిలుస్తుంది. చెరుకురసంలో కాల్షియం, ఫాస్పరస్‌ ఉండటం వల్ల పళ్ల ఎనామిల్‌కు ...

ఇలా చేస్తే కోపం మాయం

సంతోషం, బాధ ఎలాగో కోపం కూడా సహజమైన లక్షణమే! కోపంతోనే మన అసంతృప్తిని, అసహనాన్నీ వ్యక్తం చేయగలం. కానీ మనిషి కోపాన్ని కాకుండా కోపమే మనిషిని అదుపుచేస్తే బంధాలు ఛిద్రమైపోతాయి. అదే కోపాన్ని మనసులో దాచిపెట్టుకుంటే మన అంతరంగాన్ని దహించివేస్తుంది. అందుకనే కోపాన్ని జయించే మార్గాలు ఇవిగో... విశ్లేషణ తప్పదు - మనలో హద్దుల మీరి కోపం ఏర్పడినప్పుడు, దానికి కారణం ఏమిటా అని విశ్లేషించుకోక తప్పదు. నిజంగా అవతలివారి తప్పుందా? ఉంటే ఆ తప్ప పట్ల మీ అసమ్మతిని తెలియచేస్తే ఉపయోగం ఉంటుందా! మీ కోపాన్ని వ్యక్తపరిచి తీరాలి అనుకున్నప్పుడు... కర్ర విరగకుండా, పాము చావకుండా మీ మాటలను ఎలా ప్రయోగించాలో నిర్ణయించుకోవాలి. ఒక్క క్షణం కోపాన్ని పక్కన పెట్టి విచక్షణకు పనిపెడితే ఇంత విశ్లేషణా కూడా నిమిషంలో తేలిపోతుంది. కోపాన్ని గ్రహించండి – కోపమనేది ఒక భావన మాత్రమే కాదు... దాని వెనుక చాలా శారీరిక స్పందనలు కనిపిస్తాయి. కోపం వల్ల పెరిగిపోయే అడ్రినల్‌ ప్రభావంతో హృదయవేగం పెరగడం, కండరాలు బిగుసుకోవడం వంటి స్పందనలు కనిపిస్తాయి. ఈ మార్పులను కనుక గ్రహించగలిగితే మరింత విచక్షణతో మెలుగుతాం. లేకపోతే మనకి తెలియకుండా ఒక్కసారిగా విరుచుకుపడిపోయే...

(Telugu) వేసవితో మనసు చెడిపోతుంది

[:te]వేసవికాలంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. డీహైడ్రేషన్ వంటి సందర్భాలలో ఈ సమస్యలు మెదడు మీద కూడా ప్రభావం కలిగిస్తాయన్న విషయమూ తెలుసు. కానీ ఎండాకాలం క్రుంగుబాటు, మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు తీవ్రతరం అవుతాయని ఎప్పుడన్నా విన్నారా! వియత్నాంలో మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే  Hanoi అనే ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్యకీ ఎండలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకునికి. దాంతో 2008 నుంచి 2012 వరకు ఓ ఐదేళ్ల పాటు అక్కడ చేరిన రోగుల వివరాలను సేకరించాడు. వీటిని విశ్లేషించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి. - వేసవిలోని ఒక మూడు నుంచి ఏడు రోజుల వరకూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే... మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కూడా పెరిగిందట. - చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య 24 శాతం ఎక్కువగా ఉంది. - సాధారణంకంటే ఒక్క శాతం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఆసుపత్రిలో రెండు శాతం ఎక్కువ రోగులు చేరుతున్నారు. - మూడురోజులకు మించి వడగాలులు వీచినప్పటికంటే వారంపాటు విడవకుండా వడగాలి వీచినప్పుడు రెట్టింపు రోగులు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. -...

(Telugu) వేసవిలో దాహం తీర్చుకోవడం ఓ కళ!

[:te]వేసవి మొదలైపోయింది. అది కూడా ఉధృతంగా! ఇంతటి వేసవిని ఎదుర్కోవాలంటే ఒంట్లో తగినంత నీరు ఉండాలని అందరూ చెప్పేమాటే! ఒంట్లో తగినంత నీరు లేకపోతే ఇంటపట్టునే ఉన్నా సమస్యలు తప్పవు. చెమటపొక్కుల దగ్గర్నుంచీ విరేచనాల దాకా.... నీరు తాగకపోవడం అనే సమస్య ఒకోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. మరి ఈ చిక్కుని విప్పాలంటే... మద్యంతో అసలుకే మోసం – వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది చల్లటి బీరు తాగితే చాలనుకుంటారు. ఆల్కహాల్‌తో శరీరానికి నీరు దొరక్కపోగా, ఉన్న నీరు కూడా పోతుందంటున్నారు నిపుణులు. మద్యం మన శరీరంలో ఉండే anti-diuretic అనే హార్మోను మీద ప్రభావం చూపుతుందట. దీని వల్ల శరీరం అవసరమైనదానికంటే అదనపు నీటిని కోల్పోతుందంటున్నారు. అది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుందని వేరే చెప్పాలా! లెక్కలు పక్కన పెట్టండి – రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలా? రెండు లీటర్ల నీరు తాగాలా? లాంటి సందేహాలను పక్కన పెట్టండి. దాహం వేసినప్పుడల్లా కావల్సినంత నీరు తాగాలి. దాహం వేయనప్పుడు కూడా తరచూ నీరు తాగుతూనే ఉండాలి. కూల్‌డ్రింక్స్‌ దండగ – ఎండాకాలం వచ్చిందంటే మనకి శీతల పానీయాలే గుర్తుకువస్తాయి. వీటిలో ఉండే చల్లదనం వల్ల, కార్బన్‌డయాక్సైడ్‌...

(Telugu) సర్పాలకు అధిపతి – మానసా దేవి!

[:te]హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతారు. వారిలో ప్రతి ఒక్కరిదీ ఒకో ప్రత్యేకత. ఒకొక్కరికీ ఒకో ప్రాంతంలో ఆదరణ కనిపిస్తుంది. అలా ఉత్తరభారత ప్రజలంతా భయంతోనూ భక్తితోనూ కొలుచుకునే మానసాదేవి ఒకరు. ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందట. పృధ్వి మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులని చేస్తున్నాయట. అలా విచ్చలవిడిగా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యప ముని తన మానసం నుంచి ఒక అధిదేవతను సృష్టించాడు. ఆమే మానసాదేవి! మరికొన్ని గ్రంథాలలో ఆమె శివుని కుమార్తెగా పేర్కొన్నారు. ఏది ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో మాత్రం సందేహం లేదు. క్షీరసాగరమథనం సందర్భంగా పరమేశ్వరుడు హాలాహలాన్ని మింగినప్పుడు, ఆ విషం ఆయన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుకుందని చెబుతారు. కేవలం సర్పాలకే కాదు... సంతానానికీ, సంపదకు కూడా మానసాదేవి అధిపతే! అందుకనే కులాలకు అతీతంగా బెంగాల్లోని ఇంటింటా మానసాదేవి ప్రతిమ పూజలందుకుంటూ కనిపిస్తుంది. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు ఉత్తరాది అంతా దర్శనమిస్తాయి. మానసాదేవి ఒడిలో కూర్చున్న బిడ్డ ఆమె ...

(Telugu) పిల్లలు హాయిగా పడుకోవాలంటే!

[:te]పిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడం అనేది కనిపించని వేదన. దాని వల్ల అటు పిల్లలూ ఇబ్బంది పడతారు, వారితో పాటుగా పెద్దలూ బాధపడతారు. పిల్లలలో నిద్రలేమి, భవిష్యత్తులో కూడా వారిలో అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా Stephanie Zandieh అనే నిపుణుడు కొన్ని సలహాలను అందిస్తున్నారు. ముఖ్యంగా 1- 5 ఏళ్లలోపు పిల్లలకి ఈ సలహాలు దివ్యంగా పనిచేస్తాయంటున్నారు. - పిల్లలు నిద్రపోయేందుకు ఓ సమయాన్ని అలవాటు చేయాలి. అంతేకానీ నిద్రపోతే వారే అలసిపోయి పడుకుంటారులే అనుకోవద్దు. నిజానికి అలసిపోయి పడుకునే పిల్లలు నిద్ర మధ్యలో లేచే సందర్భాలు ఎక్కువగా ఉంటాయట!!! - పిల్లలు నిద్రపోయేటప్పుడు తమ పక్కన ఏదన్నా బొమ్మనో, బొంతనో ఉంచుకోవడాన్ని గమనించవచ్చు. ఇది మంచి అలవాటే అంటున్నారు నిపుణులు. ఇలా ఏదో ఒక వస్తువుతో వారి అనుబంధం వల్ల, పిల్లలు ఒక సురక్షితమైన భావనలో ఉంటారట. తద్వారా ప్రశాంతంగా నిద్రపోతారు. - పిల్లవాడు ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేలా ఒకే తరహా వాతావరణాన్ని కొనసాగించండి. నిద్రపోయే ముందర స్నానం చేయించడమో, కథలు చదివి వినిపించడమో, జోలపాటలు పాడటమో చేస్తూ ఉండటం వల్ల.... పిల్లవాడు న...

(Telugu) ఇక్కడి దేవతను తిడతారు

[:te]కేరళ అనగానే పచ్చని ప్రకృతి గుర్తుకువస్తుంది. అక్కడి ప్రజల భిన్నమైన జీవినశైలీ గుర్తుకువస్తుంది. కానీ మిగతా ఏ రాష్ట్రానికీ తీసిపోని విధంగా అక్కడ ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్నాయన్న విషయం మాత్రం చాలామందికి తెలియదు. అలాంటి ఓ అరుదైన ఆలయమే ‘కొడుంగల్లుర్‌ భగవతి’ ఆలయం. కేరళలోని ముఖ్య పట్నం కొచ్చిన్‌కి కేవలం 29 కిలోమీటర్ల దూరంలో కొడుంగల్లుర్‌ అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఉన్న అతి ప్రాచీన ఆలయమే కొడుంగల్లుర్‌ అమ్మవారి ఆలయం. విష్ణువు అవతారమైన పరశురాముడు, కేరళను సముద్రం నుంచి వెలికితీసిన విషయం తెలిసిందే! అందుకే ఈ రాష్ట్రానికి ‘పరశురామ క్షేత్రం’ అన్న పేరు కూడా ఉంది. అయితే ఇలా వెలికితీసిన తరువాత కేరళను దారుక అనే రాక్షసుడు పట్టిపీడించసాగాడట. అతని నుంచి ఎలాగైనా రక్షించమంటూ పరశురాముడు, ఆ మహాదేవుని ప్రార్థించాడు. అంతట ఆ పరమేశ్వరుడు ‘భద్రకాళి’ని ప్రతిష్టించమని సూచించాడట. ఆ సూచన మేరకు పరశురాముడు కొడుంగల్లుర్‌ ఊరిలో భద్రకాళి అమ్మవారిని ప్రతిష్టించారని చెబుతారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో దారుక రాక్షసుడు మృత్యువాత పడ్డాడు. కొడుంగల్లుర్‌ భద్రకాళి ఆలయం చాలా ప్రాచీనమైనది అని చెప్పేందుకు ఇక్కడి ఆచారాలే సాక్ష్యం. రాష్ట్రంలో,...

(Telugu) ప్రేమికుని మనసు గ్రహించకపోతే కష్టం

[:te]ప్రేమ గుడ్డిదంటారు! అది నిజమేనని తేల్చేందుకు చాలా పరిశోధనలే జరిగాయి. ప్రేమలో ఉన్నవారికి మిగతా ప్రపంచం సరిగా కనిపించదనీ, తమకి ఏం జరుగుతోందో పట్టదనీ ఈపాటికే తేలింది. ప్రేమలో ఉన్నప్పుడు మన శరీరంలో పనిచేసే హార్మోన్లే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రేమలో ఉన్నవారు అవతలివ్యక్తి భావాలని కూడా గమనించకపోతే ఎలా! - కొంతమంది వ్యక్తులకి కోపం వచ్చినప్పుడు... ఆ కోపాన్ని లోలోపచే అణచుకునే ప్రయత్నం చేస్తారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తులలోని ముభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టీ వారికి కోపం వచ్చిందని తెలుసుకోవచ్చు. కానీ చాలామంది ప్రేమికులు ఈ విషయంలో అంతగా శ్రద్ధ చూపరని తేలింది. - తమ కోపాన్ని దిగమింగుకునేవారి సంగతి ఇలా ఉంటే... మరికొందరేమో ఏం జరిగినా కూడా ‘అంతా మన మంచికే’ అనే సానుకూల స్వభావంతో ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటివారి కోపాన్ని కూడా వారి ప్రేమికులు తక్కువగా అంచనా వేస్తారట. అన్నింటిలోనూ సానుకూలత చూపిస్తారు కాబట్టి, ఏం జరిగినా కూడా సానుకూలంగానే స్వీకరిస్తారులే అన్న తేలికభావంతో వీరిని తక్కువగా అంచనా వేస్తారట. - ఒక వ్యక్తి తరచూ తన భావోద్వేగాన్ని ప్రకటించేవాడై ఉంటే......

(Telugu) ఎదుటివారిని చూసి ఆవలిస్తామెందుకు?

[:te]కళ్లు మూతలు పడిపోయేలా నిద్ర వస్తుంటేనో, ఏమీ తోచకుండా నిస్సారంగా ఉంటేనో ఆవలింతలు రావడం సహజం. కానీ అవతలివారు ఆవలించినప్పుడు మనకి కూడా ఆవలింత రావడంలో ఆంతర్యం ఏమిటి! ఒకోసారైతే ఆవలిస్తున్న ఫొటోని చూసినా, ఆవలింత అన్న మాట విన్నా కూడా మనలో ఆవలింత వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి చర్య వెనుక కారణం ఏమిటి! శరీరం నిద్రాణంగా ఉన్నప్పుడు మనలోని శ్వాస కూడా నిదానిస్తుంది. ఇలాంటి సమయంలో ఒంటికి తగినంత ప్రాణవాయువు లభించదు. దాంతో అవసరమైనంత ఆక్సిజన్‌ని గ్రహించేలా ఎక్కువ గాలిని పీల్చుకునే ప్రయత్నం చేస్తాము. అదే ఆవలింత! ఇంతవరకూ బాగానే ఉంది. మరి ఒకరి ఆవలింత మరొకరికి ఎలా వ్యాపిస్తుంది? అనే ప్రశ్నకు అవతలివారితో మనకి ఉన్న అనుబంధమో, వారి పట్ల సహానుభూతి చూపడమో కారణం అనుకునేవారు. కానీ ఈ చర్య వెనుక భావోద్వేగాలు ఏమాత్రం కారణం కాదని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. - ఒకరిని చూసి వేరొకరు ఆవలించడం వెనుక మన జన్యువులే కారణం అని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం. ఆ కారణంగానే కొంతమంది ఎదుటివారు ఆవలించిన వెంటనే నోరుతెరిస్తే, మరికొందరు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉండగలుగుతారు. అంతేకాదు! ఈ ఆవలింతను నియంత్రించే జన్యువు మామూలు వ్యక్తులలో ఒకలా ఉ...

ఇవి కూడా రంగుల పండుగలే!

హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... వాటిలో కొన్ని... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ... రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒ...

రంగు పడుతుంది జాగ్రత్త!

హోళీ ఓ రంగుల పండుగ. కానీ అజాగ్రత్తగా ఉంటే, అవే రంగుల ఇతరుల జీవితాలలో చీకటిని నింపుతాయని హెచ్చరిస్తున్నారు. పిల్లవాడు తాగే పాల దగ్గర నుంచీ అంతా కలుషితం అయిపోతున్న ఈ రోజులలో, హోళీ సందర్భంగా ఎక్కడపడితే అక్కడ చవకగా దొరికే రంగుల గురించి చెప్పేదేముంది. మరి హోళీలో వాడే రంగులలో ఎలాంటి రసాయనాలు ఉంటాయో, వాటికి ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలో ఆలోచించాల్సిందే1 రంగు – ఆకుపచ్చ. ఉపయోగించే రసాయనం – కాపర్‌ సల్ఫేట్‌. విషప్రభావం – కొంట్లో పడితే చాలా ప్రమాదకరం. కళ్లు నీరుకారడం, ఎర్రబడటం, వాయడం జరగవచ్చు. ఒకోసారి తాత్కాలికంగా చూపు కూడా కనిపించకుండా పోవచ్చు. రంగు – ఎరుపు. ఉపయోగించే రసాయనం – మెర్క్యురీ సల్ఫేట్‌. విషప్రభావం – చర్మం మీద ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒకోసారి చర్మ కేన్సర్‌కు కూడా దారితీయవచ్చు. గర్భిణీల శరీరంలోకి కనుక ఇది చేరితే వారి కడుపులో ఉన్న శిశువు ఎదుగుదల మీద తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఒకోసారి ఆ శిశువుకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది ఈ రసాయనం. రంగు – నీలం ఉపయోగించే రసాయనం – ప్రష్యన్‌ బ్లూ. విషప్రభావం – మాడు మీదా చర్మం మీదా దద్దుర్లు. రంగు – సిల్వర్‌ ఉపయోగించే రసాయనం – అల్యూమినియం బ్రొమైడ్‌. విష...

మణిపూర్‌లో హోళీని చూసితీరాల్సిందే!

హోళీ అనగానే రంగులే గుర్తుకువస్తాయి. ఆ రంగులతో పాటు పంచుకునే సంబరాలూ గుర్తుకువస్తాయి. కానీ హోళీ ముసుగులో ఆకతాయిలు హద్దులు దాటేస్తారనీ, తాగుబోతులు పీపాలు పట్టిస్తారనీ ఆరోపణ ఉంది. ముఖ్యంగా ఉత్తరాదిన జరిగే హోళీ అనేక అపవాదులకు తావిస్తూ ఉంటుంది. కానీ వీటన్నింటికీ భిన్నంగా హోళీ అంటే ఇలా ఉండాలి అంటూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది మణిపూర్. మణిపూర్లో హోళీని ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదురోజులపాటు చేసుకుంటారు. అక్కడ ఈ పండుగను ‘యాసంగ్‌’ అని పిలుస్తారు. హోళీకి ఐదురోజుల ముందర హోళికా దహనంతో ఆ యాసంగ్ సంబరాలు మొదలవుతాయి. దీనికోసం ఎండుగడ్డిన ఓ గుడిసె ఆకారంలో నిర్మించి దానికి నిప్పు అంటిస్తారు. యాసంగ్‌ పండుగ జరిగే అయిదు రోజుల్లోనూ రాష్ట్రమంతా క్రీడల పోటీలు నిర్వహించడం విశేషం. ఉదయం వేళల్లో కుర్రకారంతా ఆటల్లో మునిగిపోతే, పిల్లలేమో ఇళ్లిళ్లూ తిరుగుతూ చందాలు సేకరిస్తుంటారు. ఇక యాసంగ్‌నాటి రాత్రివేళల్లో జరిగే నృత్యం గురించి చెప్పుకొని తీరాలి. యాసంగ్‌ సందర్భంలో మాత్రమే జరిగే ఈ నృత్యం పేరు ‘తబల్‌ చోంగా’. తబల్‌ అంటే వెన్నెల, చోంగా అంటే నృత్యం. పౌర్ణమి రోజుల్లో వచ్చే యాసంగ్‌ రాత్రుళ్లో యువతీయువకులు కలిసి ఈ నృత్యం చే...

హోళీ ఆడే తీరు... ఒకో చోట ఒకోలా!

హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి... లాఠ్‌మార్‌ హోళీ ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్‌మార్‌ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట. తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు. షిమోగా గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగక...

హోళీ పండుగ కావాలంటే!

హోళీకి రసాయనాలతో చేసిన మందులు వాడవద్దు, వీలైనంతవరకూ సహజసిద్ధంగా దొరికే మందులనే వాడండి. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త, బెలూన్లను వాడవద్దు, పిల్లలని ఓ కంట గమనించుకోండి... అంటూ రకరకాల సూచనలు వినిపిస్తూ ఉంటాయి. మనం వాటిని పాటించినా, నలుగురిలోకి వెళ్లి హోళీ ఆడేటప్పుడు రసాయనాల రంగులతో ముద్ద కాక తప్పుదు. అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే... ఇలాంటి బట్టలు హోళీ అడేటప్పుడు పాతబట్టలు వేసుకున్నామో లేదో గమనిస్తామే కానీ... అవి రంగుల నుంచి ఏమేరకు అడ్డుగా నిలుస్తాయో పట్టించుకోము. హోళీ అడేటప్పుడు ఒంటిని వీలైనంత కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అవి కూడా కాటన్ దుస్తులైతే మరీ మంచిది. ఎందుకంటే పాలిస్టర్‌ బట్టల మీద పడిన రంగులను అవి పీల్చుకోవు సరికదా... వాటి మీద మరోసారి నీటిని కుమ్మరించగానే ఆ రంగులన్నీ మళ్లీ ఒంటి మీదకి జారతాయి. శరీరానికి తగినంత తేమ పొడబారిన చర్మం మీద పడే రంగుల చర్మరోగాలకు దారితీస్తాయి. అందకనే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అందుకోసం ఒంటినిండా కాస్త నూనెని పట్టించడం మేలు. అది మరీ అతిగా కనిపిస్తుందనుకుంటే... అందుబాటులో ఉన్న మాయిశ్చరైజింగ్‌ లోషను ఏదన్నా రాసుకోవచ్చు. జుట్టు పాడవకూడదనుకుంటే, త...

(Telugu) భీష్ముడు చెప్పిన గొడుగు, చెప్పుల కథ

[:te]ఎండాకాలం దగ్గరపడుతోందంటే చాలు... మనకి గొడుగు గుర్తుకువస్తుంది, ఇక ఆరుబయటకి అడుగు వేయాలంటే కాలికి చెప్పులు ఉండాల్సిందే. మనిషిని ఎండ నుంచి ఇంతగా కాపాడతాయి కాబట్టే... గొడుగు, చెప్పులను దానం చేస్తే బోలెడంత పుణ్యం దక్కుతుందని చెబుతారు పెద్దలు. ఇంతకీ ఈ గొడుగు, చెప్పులను ఎవరు కనుగొన్నారన్న విషయం మీద మహాభారంతంలో ఓ ఆసక్తికరమైన కథ కనిపిస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తరువాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్య మీదే నిరీక్షించాడు. ఈ సమయంలో ధర్మరాజు, భీష్ముని చెంతకు చేరి తన ధర్మసందేహాలను నివృత్తి చేసుకున్నాడు. ఆ సందర్భవశాన భీష్ముడు గొడుగులు, చెప్పులు ఏర్పడిన సంగతి గురించి చెప్పుకొచ్చాడు. పూర్వం భృగు వంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఈయన భార్య పేరు రేణుకాదేవి. జమదగ్ని ఓసారి తన భార్యతో కలిసి ఆరుబయట విలువిద్యను అభ్యసిస్తున్నాడు. ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలని అందిస్తానంటూ, రేణుకాదేవి ఆయనకు సాయంగా నిల్చొంది. ఇలా కాసేపు గడిచిన తరువాత జమగద్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, తన భార్య కనిపించనేలేదు. తర్వాత నిదానంగా అడుగులోఅడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి, ఆమె ఆలస్యానికి కారణం అడి...

(Telugu) సాటిలేని వేదాంతి - గార్గి

[:te]వేదకాలం నుంచీ కూడా భరతవర్షం మీద ఆడవారంటే పక్షపాత ధోరణి ఉందంటూ చాలామంది ఆరోపిస్తుంటారు. కానీ ఆడవారి పట్ల వివక్ష కొత్తగా పుట్టుకువచ్చిందే కానీ వేదకాలంలో ఇలాంటి ధోరణులు లేవన్నది ధార్మికుల మాట. అందుకు ఉదాహరణగా గార్గి పేరు ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. వేదాలు స్త్రీలు అభ్యసించకూడదనీ, అసలు వినకూడదనీ ఎలాంటి నిబంధనా లేదనీ... అందుకు గార్గి జీవితమే సాక్ష్యమనీ చెబుతుంటారు. గార్గి, వచక్నుడు అనే రుషి కుమార్తె. వచక్నుడు సకలశాస్త్ర పారంగతుడు. వేదాధ్యయన తత్పరుడు. ఆయన ఇంట్లో పెరుగుతున్న గార్గికి సహజంగానే వేదాలంటే మక్కువ ఏర్పడింది. వాటిని అభ్యసించేందుకు పురుషులతో సమానంగా ఉపనయం చేసుకుంది. ఒకో శాస్త్రాన్నే ఔపోసన పట్టసాగింది. వాటిలో నిష్ణాతురాలై ఏకంగా ‘బ్రహ్మవాదిని’ అన్న బిరుదుని సాధించింది. గార్గి గురించిన ప్రస్తావన బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో జనకుని సభలో యాజ్ఞవల్య్క రుషిని ఆమె ముప్పుతిప్పలు పెట్టిన విధం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. జనకుడు బ్రహ్మ జ్ఞానంలో సాటిలేని వ్యక్తికి వేయి గోవులను బహుమతిగా ఇస్తాననీ, ఆ గోవుల కొమ్ములన్నింటికీ కూడా బంగారు తాపడం చేయిస్తాననీ చాటింపు వేస్...

(Telugu) చండీ యాగం ఎందుకు చేస్తారు?

[:te]యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం! ఎవరీ చండి? చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది. పూజలు చండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్‌లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచీ, మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకూ ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆంతేకాదు! గ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద...

దేవతగా మారిన రాక్షసి - హిడింబి

పాండవులను గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టేందుకు దుర్యోధనుడు వారి కోసం ఒక లక్క ఇంటిని నిర్మించిన కథ తెలిసిందే! ఆ లక్క ఇంట్లోంచి ఉన్న సొరంగం గుండా భీముడు తన సోదరులను, తల్లిని ఓ సురక్షిత స్థానానికి చేరుస్తాడు. అక్కడ మొదలవుతుంది హిడింబి కథ! లక్క ఇంటి నుంచి తప్పించుకుని అరణ్యంలో సేదతీరుతుంటారు పాండవులు. అక్కడికి సమీపంలోనే హిడింబ, హిడింబి అనే అన్నాచెల్లెళ్లు నివసిస్తూ ఉంటారు. రాక్షసులైన ఈ అన్నాచెల్లెళ్ల ముక్కుపుటాలకి నరవాసన తగలగానే జిహ్వచాపల్యం కలుగుతుంది. ఆ నరవాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని బయల్దేరిన వారికి అల్లంత దూరంలో గాఢనిద్రలో ఉన్న పాండవులూ, వారికి కాపలాగా ఉన్న భీముడూ కనిపిస్తారు. మంచి కండపట్టి బలిష్టంగా ఉన్న భీముని చూడగానే హిడింబకు ఓ ఆలోచన కలుగుతుంది. అతడిని ఎలాగైనా ఏమార్చి పక్కకు తీసుకువస్తే సుష్టుగా ఆరగించవచ్చని తన సోదరికి సూచిస్తాడు. దాంతో భీముని ఆకర్షించేందుకు హిడింబి అందమైన యువతి రూపంలో భీముని చెంతకు చేరుకుంటుంది. భీముని మోసం చేయాలనుకున్న హిడింబి ప్రయత్నం ఏమాత్రమూ నెరవేరదు. ఆమెను చూసి భీముడు ఇసుమంతైనా చలించకపోవడంతో... అతని వ్యక్తిత్వం పట్ల నిజంగానే ఆకర్షితురాలవుతుంది హిడింబి. అంత...

ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం – తుంగనాథ్‌

హిమాలయ ప్రాంతం మహిమాన్విత ఆలయాలకు నిలయం. ఎత్తైన పర్వతపానువుల మధ్య, ప్రకృతి ఒడిలో పరమాత్మను దర్శించుకునే భాగ్యం ఇక్కడే లభిస్తుంది. అందుకనే ఇహ సంసారం నుంచి విముక్తి చెందాలనుకునే ముముక్షువులకు ఈ ఆలయాలు తుది గమ్యంగా నిలుస్తాయి. అలాంటి ఆలయాలలో ఒకటి తుంగనాథ్ ఆలయం. హిమాలయాలలోని తుంగనాథ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశిల అనే ఎత్తైన కొండ ఉంది. ఈ కొండ మీద నుంచి చూస్తే నలువైపులా హిమాలయాలే దర్శనమిస్తాయి. ఇంతటి ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి చంద్రుడు సైతం పరవశించిపోయాడట. ఆ పరవశంలో సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయాడట. అందుకనే ఈ పర్వతానికి చంద్రశిల అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతేకాదు! రావణ సంహారం అనంతరం రాముడు సైతం ఇక్కడే తపస్సుని ఆచరించాడన్న గాథ కూడా వినిపిస్తుంది. ఈ తుంగనాథ్‌ క్షేత్రం ‘పంచ కేదార’ ఆలయాలలో ఒకటి. ఈ పంచ కేదారాల వెనక కూడా ఓ గాథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామం తరువాత పాండవులంతా శివుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నారట. కురుసంగ్రామంలో తెలిసోతెలియకో అనేకమందిని చంపిన పాపం వారికి అంటుకుంది కదా! ఆ పాపఫలాన్ని నివారించమని ఆ పరమేశ్వరుని వేడుకోవాలనుకున్నారట. కానీ ఆ శివునికి మాత్రం పాండవులు కురుక్షేత్రంలో ఎంతోకొం...

శివునికి కోపమొచ్చింది – శిల్పాలుగా మార్చేశాడు

మన దేశంలోని ఏ మూలకి వెళ్లినా ఆశ్చర్యాన్ని కలిగించే గాథలు వినిపించక మానవు. వాటికి సాక్ష్యంగా చిత్రమైన కట్టడాలు కనిపించక మానవు. అలాంటి అద్భుతమే ఉనాకోటి. దేశంలో ఓ మూలకి ఉన్నట్లుండే త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాకు 170 కిలోమీటర్ల దూరంలో ఉనాకోటి ఉంది. ఇంతకీ ఆ ప్రాంతం వెనక గాథేమిటంటే... ఉనాకోటి అంటే స్థానిక భాషలో ఒకటి తక్కువ కోటి అని అర్థం. ఇక్కడ ఉన్న కొండ మీద ఒకటి తక్కువ కోటి దేవతామూర్తులు కనిపించడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఈ శిల్పాలను బహుశా 7 లేక 8వ శతాబ్దంలో చెక్కి ఉంటారని ఓ అంచనా! కానీ వీటి వెనక ఉన్న సందర్భం మాత్రం అస్పష్టం. ఆ మాట అంటే స్థానికులు ఒప్పుకోరు. వారి దృష్టిలో ఈ శిల్పాల వెనక ఓ అద్భుతమైన నేపథ్యం ఉంది. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు కొందరు దేవతలతో కలిసి కాశీకి బయల్దేరాడు. శివునితో కలుపుకొని వారందరూ కోటిమంది ఉన్నారు. అలా కాశీకి వెళ్తూ వారంతా ఉనాకోటి సమీపంలోని కైలాశహర్‌ అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రాత్రంతా విశ్రమిద్దామనీ, సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాశీయాత్రను సాగిద్దామనీ శివుడు తెలిపాడు. దానికి దేవతలంతా అంగీకరించారు కూడా! కానీ ఉదయం బారెడు పొద్దెక్కినా శివుడు తప్ప మరెవ్...

ఉపవాసం ఇలా చేసి చూడండి

శివరాత్రి అనగానే ఉపవాసం గుర్తుకువస్తుంది. ఉపవాసం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు... ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ అది చేకూర్చే లాభం అసమాన్యం. అలాంటి ఉపవాసాన్ని చేసేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు నిపుణులు. - చాలామంది రేపు ఉపవాసం అనగానే ముందురోజు రాత్రి సుష్టుగా భోజనం చేస్తారు. ఇదేమంత మంచి పద్ధతి కాదు. శరీరాన్ని నిదానంగా ఉపవాసాన్ని సిద్ధపరచడం ముఖ్యం. అందుకే మన పెద్దలు ఏకాదశి రోజు ఉపవాసం చేయాలంటే దశమి రాత్రి నుంచే మొదలుపెట్టాలనీ, శివరాత్రి ఉపవాసాన్ని కూడా ముందురోజు నుంచే ఆరంభించాలనీ చెబుతుంటారు. - ఉపవాసం ఉండటం మంచిదే! కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండితీరాలన్న నియమం ఏదీ లేదు. షుగర్ వ్యాధి ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారు, విపరీతంగా కాయకష్టం చేసే పనిలో ఉండేవారు ఉపవాసం ఉండటం వల్ల లేనిపోని సమస్యలు రావచ్చు. - స్వల్ప వ్యాయామం చేసినా కానీ మనకి తెలియకుండానే శరీరంలోని శక్తంతా దహించుకుపోతుంది. దానిని తిరిగి భర్తీ చేసేందుకు తగిన ఆహారం అందదు కాబట్టి నిస్సత్తువ, కళ్లు తిరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఉపవాసం చేసే రోజున వ్యాయామానికి సెలవివ్వడం మంచిది. - శర...

(Telugu) అందుకనే మనిషి గొప్పవాడు

[:te]అది ఓ దట్టమైన అడవి. ఆ అడవిలో ఉన్న జీవాలన్నీ ఓ మిట్టమధ్యాహ్నం కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. అకస్మాత్తుగా ‘అసలు జీవితం అంటే ఏమిటి?’ అన్న చర్చ మొదలైంది. ‘జీవితం అంటే తనివితీరా పాడటం. అలా ఆటలా పాటలా సాగేదే అసలైన జీవితం,’ అని మైమరపుతో చెప్పింది ఓ కోయిల. చెప్పడమే కాదు, వెంటనే ఓ కూనిరాగం తీయడం మొదలుపెట్టింది. ‘పాటా పాడా! జీవితం అంటే భయం భయంగా బతకడం. ఎవరి కంటా పడకుండా భయపడతూ నక్కి నక్కి తిరగడం,’ అని చెప్పిందో పందికొక్కు. ‘అబ్బే అంత భయపడటం ఎందుకు? జీవితం అంటే అందం, జీవితం అంటే సంతోషం,’ అంటూ రెక్కలు చాస్తూ గిరగిరా తిరుగుతూ చెప్పింది ఓ అందమైన సీతాకోకచిలుక. ‘నిరంతరం అలా తిరుగుతూ ఉంటే ఇక పనిచేసేదెప్పుడు. అసలు జీవితం అంటేనే పని. పని చేయకపోతే జీవితానికి అర్థమే లేదు,’ అని నిట్టూర్చింది ఓ తేనెటీగ. ‘నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం. సంతోషం సంగతి పక్కన పెట్టండి. నిరంతరం పనిచేయకపోతే జీవించి ఉపయోగం లేదు,’ అని తేనెటీగ మాటలను బలపరిచింది చీమ. ఇంతలో ‘మీతో నేను ఏకీభవించను,’ అంటూ గంభీరంగా ఓ స్వరం వినిపించింది. ఆ స్వరం ఎక్కడిదా అని పైకి చూసిన జీవులన్నింటికీ ఓ గద్ద కనిపించింది. ‘జీవితం అంటే స...

మృత్యువుని దూరం చేసే బిల్వదళాలు

శివరాత్రి వచ్చిందంటే నీటితో అభిషేకం, బిల్వపత్రాలతో అర్చనా గుర్తుకువస్తాయి. శివుని ఎన్ని విధాలా పూజించినా, అందులో బిల్వ పత్రం లేనిదే మనసుకి లోటుగానే ఉంటుంది. మరి ఆ పరమేశ్వరునికే ప్రీతిపాత్రమైనదంటే... బిల్వ పత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి కదా! వాటిలో కొన్ని... - బిల్వవృక్షంగా పిలుచుకునే మారేడు చెట్టు మన దేశంలోనే ఉద్భవించిందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ చెట్టు -7 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకూ ఎలాంటి వాతావరణాన్నయినా తట్టుకుని ఎంతటి నేలలో అయినా ఎదుగుతుంది. కాబట్టి ఊరూరా కనిపించే ఆ బిల్వదళాలు అటు అర్చనకే కాదు ఇటు ఆయుర్వేదంలోనూ విస్తృతంగా వినియోగించేవారు. - గాలి, వెలుతురు సరిగా సోకని గర్భగుడులలోని తేమకి రకరకాల సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. కానీ అక్కడ శివలింగం చెంతన ఉండే బిల్వదళాలు అక్కడి వాతావరణాన్ని మార్చేస్తాయి. మిగతా ఆకులతో పోలిస్తే బిల్వదళాలు రోజుల తరబడి తాజాగా ఉంటాయి. పైగా సూక్ష్మక్రిములను సంహరించే యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు వీటి సొంతం. కాబట్టి గర్భగుడిని నిరంతరం పరిమళభరితంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో బిల్వానిది గొప్ప పాత్ర! - చక్కెర వ్యాధికి బిల్వం గొప్ప ఔషధం. బిల్వపత్రాల నుంచి తీసి...

శివరాత్రి రోజు ఏం చేయాలి!

వేల ఏళ్లు గడిచి ఉండవచ్చు, వైదిక కాలం దాటిపోయి ఉండవచ్చు... కానీ భరతజాతికి శైవారాధన మీద ఉన్న మక్కువ తగ్గనేలేదు. ఆ ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడనో, మృత్యుంజయుడై ఆరోగ్యాన్ని అందిస్తాడనో మాత్రమే కాదు... సృష్టి తత్వాన్ని బోధపరుస్తాడనీ, సంసారం నుంచి విముక్తం చేస్తాడనీ ఆయన చెంతకు చేరతారు. అందుకు ఓ గొప్ప సందర్భమే శివరాత్రి! మన పండుగలన్నీ పగటి పూజలతోనూ, పిండివంటలు ఆరగించడంతోనూ గడుస్తాయి. కానీ శివరాత్రి దీనికి విరుద్ధం. ఉపవాసంతోనూ, జాగరణతోనూ, రాత్రివేళ పూజలతోనూ శివరాత్రిని జరుపుకుంటాము. శివుడు లింగరూపంలో దర్శనమిచ్చిన సందర్భం శివరాత్రి అని చెబుతారు. దీని వెనుక ఉన్న కథ కూడా చాలామందికి సుపరిచితమే! బ్రహ్మ, విష్ణుదేవుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదులాట మొదలైందట. ఈ సమస్యని తీర్చేందుకు వారిద్దరూ శివుని ఆశ్రయించగా ఆయన ఒక అగ్నిస్తంభంగా అవతరించాడు. ఆ అగ్నిస్తంభపు చివరను ఎవరైతే తెలుసుకోగలరో వారే గొప్పవారంటూ శివుడు సూచించాడు. అంతట విష్ణువు వరాహరూపంలో స్తంభపు దిగువు భాగాన్ని పెళ్లగిస్తూ, బ్రహ్మదేవుడు హంస రూపంలో స్తంభం పైభాగంలోకి ఎగురుతూ దాని ఆద్యంతాలను కనుగొనే ప్రయత్నం చేశారు. చివరికి వారిరువురూ కూడా శివ...

భీముడు నిర్మించిన సరస్సు – భీమ్‌తల్‌

అది ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌ జిల్లా. ఒక పక్క హిమాలయ పర్వతాలు, మరోపక్క అందమైన సరస్సులు నైనితాల్‌ సొంతం. అలాంటి నైనితాల్‌ను అల్లుకుని ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అసలు నైనితాల్‌ అన్న పేరే ‘నయనా తల్‌’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. దక్షయజ్ఞం తరువాత అమ్మవారి కళ్లు (నయనాలు) ఇక్కడ పడ్డాయట. ఆ ప్రదేశంలో ఏర్పడిన సరస్సుని ‘నయనా తల్‌’ పేరు మీదుగా ఈ ఊరు స్థిరపడింది. ఆ నయనా తల్‌ పక్కనే ఉన్న నయనా దేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పోటెత్తుతారు. ఇక నైనితాల్‌కు ఓ 20 కిలోమీటర్ల దూరంలో ‘భీమ తల్‌’ అనే మరో సరస్సు ఉంది. పదిహేడు కిలోమీటర్ల భారీ వైశాల్యం ఈ సరస్సు సొంతం. ప్రజల దాహాన్ని తీర్చేందుకు, పంటలను సాగు చేసేందుకు, చేపలను పెంచేందుకూ... ఈ సరస్సు అనువైంది కాబట్టి దీని చుట్టూ ఏకంగా ఒక గ్రామమే ఏర్పడింది. ఈ భీమతల్ వెనక ఉన్న కథ కూడా ఆసక్తికరమైనదే! పాండవులు అరణ్యవాసం చేసే సందర్భంలో వారు ఈ ప్రాంతానికి చేరుకున్నారట. ఆ సమయంలో భీమునికి హిడింబాసురుడు అనే రాక్షసుడు ఎదురుపడ్డాడు. భీమునికీ అపరబలవంతుడైన ఆ రాక్షసునికీ మధ్య ఘోరయుద్ధం జరిగింది. ఆ పోరులో ఎట్టకేళకు భీముడు గెలిచాడు. కానీ సుదీర్ఘంగా సాగిన యుద్ధ...

గోవాలో దుర్గాదేవి - శాంతదుర్గ

దుర్గాదేవి అంటేనే రక్కసుల పాలిట సింహస్వప్నం. అయినా కానీ... ఆ తల్లిని ఉగ్రరూపంలో చూడాలని ఎవరు మాత్రం కోరుకుంటారు. దుర్మార్గుల వెన్నులోంచి చలిపుట్టించే ఆమె భక్తులకి చల్లని తల్లిలా దర్శనమివ్వాలని ఎవరు మాత్రం ఆశించరు. అలాంటి దుర్గాదేవి శాంత స్వరూపమే శాంతదుర్గ. సయోధ్య కుదిర్చిన శాంతమూర్తి శాంతదుర్గ అన్న పేరు పురాణాలలో పెద్దగా ప్రస్తావనకి కనిపించదు. శాంతముని అనే రుషికి దుర్గామాత దర్శనమిచ్చింది కాబట్టి ఆమెకు శాంతదుర్గ అన్న పేరు స్థిరపడినట్లు ఓ గాథ వినిపిస్తుంది. గోవాలోని జనబాహుళ్యంలో మాత్రం శాంతదుర్గ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి శివకేశవుల మధ్య ఘోర యుద్ధం తటస్థించిందట. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ముల్లోకాలలూ తల్లడిల్లిపోయాయి. కానీ దుర్గాదేవి మాత్రం వారిరువురి యుద్ధాన్ని ఆపేందుకు చొరవ చూపింది. ఒక చేత్తో విష్ణుమూర్తినీ, ఒక చేత్తో శివునీ పట్టుకుని వారిరువురి పోరునీ నిలిపింది. ఇదేదో ఈమధ్య ప్రచారంలోకి వచ్చిన కథ కాదు. దాదాపు 500 ఏళ్ల క్రితం శాంతిదుర్గ పేర ప్రతిష్టించిన మూర్తులలో కూడా శివకేశవులని శాంతింపచేస్తున్నట్లుగా కనిపించే శాంతదుర్గని గమనించవచ్చు. గోవాకు ప్రత్యేకం దుర్గాదేవిని శాంతదుర...

(Telugu) ప్రేమే ఆధారం

[:te]మనుషులలో అనేక అనుభూతులు ఉంటాయి కదా! అవన్నీ కలిసి ఓసారి షికారుకని బయల్దేరాయట. చక్కగా ఆడుతూ పాడుతూ ఆ అనుభూతులన్నీ ఒక ద్వీపం మీద సేదతీరుతున్నాయి. ఇంతలో ఆకాశం నల్లబడిపోయింది. ఎటు చూసినా దట్టమైన మబ్బులు. ఆ మబ్బుల మధ్య నుంచి చీల్చుకువస్తున్న మెరుపులు. మరికాసేపట్లో జోరున హోరున వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం చూసి అనుభూతులన్నీ కలత చెందాయి. అక్కడే ఉంటే ఆ వర్షంలో నిలువ నీడ లేకుండా తడిసి ముద్దైపోక తప్పదు. తమ పడవులన్నీ కొట్టుకుపోకా తప్పదు. అందుకని తలా ఒక పడవ తీసుకుని అవి సురక్షిత తీరం వైపుగా బయల్దేరాయి. ఈ హడావుడిలో పాపం ప్రేమ అనే అనుభూతికి ఏ పడవా కనిపించలేదు. దాంతో తనని తీరానికి ఎవరన్నా తీసుకువెళ్తారేమో అనుకుంటూ ఆందోళనగా అటూఇటూ చూసింది. సాయం కోసం వెతుకుతున్న ప్రేమకు, ఆడంబరం అనే అనుభూతి పడవ నడిపేందుకు సిద్ధపడుతూ కనిపించింది. ‘ఓ నేస్తమా! నన్ను కూడా కాస్త నీ నావలో ఎక్కించుకోవా!’ అంటూ ఆడంబరాన్ని ప్రాధేయపడింది ప్రేమ. ‘నిన్ను నా పడవలో ఎక్కించుకోవడమా! అసలే నా పడవ రకరకాల సంపదలతో కిక్కిరిసిపోయి ఉంది. గుట్టలు గుట్టలుగా బంగారం, కుప్పలుతెప్పలుగా బట్టలు, ప్రశంసాపత్రాలు, ...

ఉత్తరద్వార దర్శనం ఎందుకు

వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటీ... పౌరాణిక గాథ పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకనే ఈ ఏకాదశిక ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదనా లేకపోలేదు. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరూ ఉంది. ఈరోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో, వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో... ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్...

వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు

ఏకాదశి అంటేనే, మనకు ఉపవాస దీక్ష జ్ఞప్తికి వస్తుంది. ఇహ సంసారపు ఆలోచనల్లో మునిగితేలుతున్న మనం, పక్షంలో ఒక్క రోజైనా భగవంతుని వైపుగా దృష్టి సారించేందుకు ఏర్పరిచిన నియమమే ఏకాదశి. దీని వలన మనసు పరిశుద్ధం కావడం అటుంచితే, శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఒకవేళ ప్రతి ఏకాదశికీ ఉపవాసం ఉండటం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వంటి రోజులలో అయినా ఉపవాసాన్ని ఆచరించమని సూచిస్తున్నారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్నట్లు లెక్క అని కూడా పెద్దలు చెబుతారు. వైకుంఠంలోని విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకూ ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనీ పిలవడం కద్దు. వైకుంఠ ఏకాదశినాడు భక్తులు కూడా విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుని తరిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ముందురోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభిస్తారు. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తులసినీటిని మాత్రమే సేవిస్తూ గడుపుతారు. ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆహారాన్...

(Telugu) పిల్లలు తప్పులు ఒప్పుకోవాలంటే

[:te]తల్లిదండ్రులు తిడతారేమో అన్న అనుమానంతో ప్రోగ్రెస్‌ రిపోర్టు కార్డులలో దొంగ సంతకాలు చేసే పిల్లల సంగతి వినే ఉంటాము. ఏదన్నా వస్తువుని పాడుచేస్తే, తండ్రి చేతిలో దెబ్బలు తప్పవన్న భయంతో తనకేమీ తెలియనట్లు నటించే పిల్లల గురించీ మనకి తెలుసు. అంతదాకా ఎందుకు! మన బాల్యంలో కూడా తల్లిదండ్రుల దండననీ, చీవాట్లనీ తప్పించుకునేందుకు ఇలాంటి పనులేవో చేసే ఉంటాము. పిల్లవాడు ఎప్పుడో ఒకసారి అబద్ధం చెప్పడం సహజమే కావచ్చు. కానీ ప్రతిసారీ ఇదే తీరు కనుక కొనసాగితే, అది పిల్లవాడి జీవితం మీదే ప్రభావం చూపక మానదు. అబద్ధం అనేది ఒక అలవాటుగానో, ఒక విషవలయంగానో మారిపోయి అతని భవిష్యత్తులనే నాశనం చేసే ప్రమాదం లేకపోలేదు. తప్పు చేసినప్పుడు నిజాయితీగా దానిని ఒప్పుకోవడమా, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వెల్లడించడమా అనే సంశయం ఏర్పడినప్పుడు పిల్లలో ఎలాంటి భావాలు కలుగుతాయి? అన్న సందేహం వచ్చింది ఓ ప్రొఫెసరుగారికి. దాంతో ఆయన చేసిన పరిశోధన ఇలాంటి పరిస్థితులలో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో ఒక సూచనను అందిస్తోంది. పిల్లల అంతరాత్మ సంఘర్షణని తెలుసుకునే ఈ ప్రయోగం కోసం పరిశోధకులు 4 నుంచి 9 ఏళ్ల వయసు లోపల ఉన్న కొందరు పిల్లలను ఎంచుకున్నారు. వీ...

(Telugu) భోగి పండ్లు ఎందుకంత ప్రత్యేకం!

[:te]సంక్రాంతి వస్తోందనగానే భోగిపండుగే గుర్తుకు వస్తుంది. భోగినాడు ఉదయం వేళ కుర్రకారుకి భోగిమంటలు, సాయంవేళల్లో పిల్లలకి భోగిపండ్ల సంప్రదాయం పూర్తికాకపోతే పండగంతా వెలితిగా తోస్తుంది. ఇంతకీ ఈ భోగిపండ్లకి ఎందుకంత ప్రాముఖ్యత అంతే బోలెడు సమాధానాలు కనిపిస్తాయి. - పిల్లలకు భోగిపండ్లుగా వినియోగించేందుకు చిన్న రేగుకాయలను వాడతారు. ఈ రేగుకాయలకు బదరీఫలం అన్న పేరు కూడా ఉంది. పూర్వం నరనారాయణులు ఈ బదరికావనంలోనే శివుని గురించి ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణునిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందట. - రేగుపండుని అర్కఫలం అని కూడా అంటారు. అర్కుడు అంటే సూర్యుడే! సూర్యుని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. భోగిమర్నాడు నుంచి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారతాడు. అలా సంక్రాంతి సూర్యుని పండుగ కాబట్టి... ఆ సూర్యభగవానుని ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారని కూడా ఒక విశ్లేషణ ఉంది. బహుశా అందుకనే భోగిపండ్ల వేడుక సూర్యాస్తమయం లోపలే ముగించడం మంచిద...

(Telugu) భోగిమంటల్లో ఏం వేయకూడదు

[:te]సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి. భోగి మంట వెనక మరో విశేషం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణసంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు. భోగిమంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగిమంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా రగిలించాలట. ఇందుకోసం సూర్యాదయానికి ముందే...

రేగుపళ్లతో ఆరోగ్యం

ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో తినాలన్నది పెద్దల మాట. అలా చూసుకుంటే చలికాలంలో విస్తృతంగా కాసే పండు రేగు. భోగి పండుగ వస్తోందంటే చాలు, ఇంట్లో పిల్లలకి ఆ రేగితో భోగి పండ్లు పోయకపోతే అదో వెలితిగా తోస్తుంది. పండు అంటేనే పోషకాహారానికీ, ఆరోగ్యానికీ సూచన. ఇక రేగు పండు అంటే మరింత ఆరోగ్యం, మరిన్ని పోషకాలు అంటున్నారు నిపుణులు. - రేగుపండు అనగానే ఠక్కున గుర్తుకువచ్చే అంశం జీర్ణవ్యవస్థ. చలికాలం సహజంగానే మన జీర్ణవ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రేగుపండ్లు ఉపయోగపడతాయి. ఆహారం జీర్ణం కాకపోవడం, ఉబ్బరంగా ఉండటం, గొంతులో మంట వంటి సమస్యలలో రేగు దివ్యంగా పనిచేస్తుంది. - చలికాలంలో పెద్దలకే జీర్ణశక్తి సరిగా ఉండనప్పుడు ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది. ఇప్పుడంటే ప్రోబయాటిక్‌ పొడులూ, డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌తో కూడిన టానిక్కులూ చలికాలంలో పిల్లలకి అందిస్తున్నారు. కానీ ఒకప్పుడు చలికాలంలో పిల్లలకి రేగుపండ్లని అందించడం వల్ల సున్నితంగా ఉండే వారి జీర్ణశక్తికి బలం చేకూరేది. - చలికాలంలో మనకి పెద్దగా దాహం వేయదు. దాంతో మంచినీరు తగినంతగా తీసుకోం. దీని వల్ల మన శరీరంలో అనేక సమస్యలు ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్...

(Telugu) మన దేశంలో సంక్రాంతి – ఒకోచోట ఒకోలా!

[:te]సంక్రాంతి తెలుగువారికి ముఖ్యమైన పండుగ అన్న విషయం తెలిసిందే! మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా పొంగల్‌ పేరుతో దీనిని ఘనంగా జరుపుకుంటారనే విషయమూ చాలామందికి తెలుసు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాలలో దీనిని వేర్వేరు పేర్లతో ఘనంగా చేసుకుంటారు. వాటిలో కొన్ని... పౌష్‌ సంక్రాంతి (పశ్చిమబెంగాల్) - పుష్య మాసంలో వస్తుంది కాబట్టి బెంగాలీయులు ఈ పండుగను పౌష్‌ సంక్రాంతి అని పిలుచుకుంటారు. వీరి పంటలు కూడా ఇప్పుడే ఇళ్లకు చేరుకుంటాయి. అలా ఇంటికి చేరిన కొత్త బియ్యానికి, ఖర్జూరపు బెల్లాన్ని కలిపి రకరకాల పిండివంటలు చేసుకుంటారు. మూడురోజులపాటు జరుపుకొనే ఈ పండుగ రోజుల్లో వీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మకరసంక్రాంతి రోజునే గంగావతరణ జరిగిందని ఓ నమ్మకం. అది జరిగింది కోల్‌కతాకు సమీపంలో ఉన్న గంగాసాగర్ అనే ప్రాంతంలో కాబట్టి, అక్కడ ఉన్న గంగానదిలో స్నానామాచరించేందుకు లక్షలమంది తరలివెళ్తారు. పంజాబ్‌ (మాఘి) – తెలుగువారు భోగి జరుపుకొనే రోజునే పంజాబీయులు లోరి అనే పండుగ చేసుకుంటారు. ఈ రోజున విశాలమైన మైదానాలలో మంటలు వేసుకుని దాని చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ భాంగ్రా అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. దీనికి అనుగుణమైన భాంగ్రా పాట...

(Telugu) ప్రపంచమంతా సంక్రాంతి

[:te]సంక్రాంతి కేవలం ఒక సంప్రదాయం కాదు. అది ఓ జీవన విధానం. పంటలు ఇళ్లకి చేరుకున్నాయన్న సంబరానికి సూచన. సూర్యుని గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారనుందన్న విషయానికి ప్రతీక. అందుకనే సంక్రాంతిని పోలిన పంటల పండుగలు ప్రపంచంలో అనేక చోట్ల కనిపిస్తాయి. ‘హార్వస్ట్‌ ఫెస్టివల్స్’ పేరుతో వీటిని ప్రతి జాతివారూ జరుపుకొంటారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవిగో... ఇండోనేషియా ఇండోనేషియాలో పంటల పండుగ ఎప్పుడో మేలో వస్తుంది. మే 31, జూన్ 1.. ఈ రెండు తేదీలలోనూ వారు ఈ పండుగను జరుపుకొంటారు. మనం సంపదకీ, సమృద్ధికీ లక్ష్మీదేవిని ఎలా కొలుచుకుంటామో ఇండోనేషియా ప్రజలు దేవిశ్రీ అనే దేవతను కొలుస్తారు. ఈ పంటల పండుగనాడు ఆ దేవతను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీధుల్లో రంగురంగుల జెండాలను ఎగరవేస్తారు. పంటపొలాల్లో దిష్టిబొమ్మలను నిలుపుతారు. మన రాష్ట్రంలోలాగానే ఎడ్లపందాలను ఆడి సంబరపడిపోతారు. ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలో అందునా ఘనా, నైజీరియా వంటి దేశాలలో యామ్‌ పండుగ అనే పంటల పండుని చేసుకుంటారు. యామ్‌ అనేది మన పెండలంలాంటి ఒక దుంప. ఆఫ్రికా ప్రజల ఆకలి తీర్చడంలో యామ్‌ది ముఖ్యపాత్ర. వర్షాకాలం ముగిసి ఆ యామ్‌ పంట చేతికి వచ్చే సమయంలో యామ్‌ ప్ర...

(Telugu) గంగమ్మ అవతరించింది సంక్రాంతికే...

[:te] గంగావతరణం గురించిన కథ మనందరికీ సుపరిచితమే! అయినా టూకీగా చెప్పుకోవాలంటే... సూర్యవంశానికి చెందిన సగరుడు అనే రాజు ఒకసారి అశ్వమేథయాగాన్ని నిర్వహించ తలపెట్టాడు. అదే సమయంలో కపిలమహాముని తన ఆశ్రమంలో ఘోర తపస్సుని ఆచరిస్తున్నాడు. కపిలమహాముని తపస్సు కనుక సఫలం అయితే తన ఇంద్రపదవికే ఎసరు వస్తుందనుకున్నాడు ఇంద్రుడు. అందుకోసం ఆ మహర్షి తపస్సుని భగ్నం చేసేందుకు ఎలాంటి ఎత్తు వేయాలా అనే ఆలోచనలో పడ్డాడు. ఈలోగా ఇంద్రుని దృష్టి సగరుడు యాగం కోసం విడిచిపెట్టిన అశ్వం మీద పడింది. ఆ అశ్వాన్ని కనుక కపిలముని ఆశ్రమంలో విడిచిపెడితే! దానిని వెతుక్కుంటూ సగరుని సైన్యం వస్తుంది. యాగ నియమం ప్రకారం ఎవరైతే యాగాశ్వాన్ని బంధిస్తారో వారితో పోరు సలిపి ఆ అశ్వాన్ని విడిపించుకోవలసి ఉంటుంది. అలా కపిలముని తపస్సు చెదరకు తప్పదు అనుకున్నాడు ఇంద్రుడు. ఆ మేరకు యాగాశ్వాన్ని దొంగిలించి కపిలముని ఆశ్రమంలో ఆ ముని చెంతనే కట్టివేశాడు. యాగాశ్వాన్ని వెతుక్కుంటూ వచ్చి సగరుని అరవై వేల కుమారులకి కపిలముని ఆశ్రమంలో యాగాశ్వం కనిపించింది. దానిని కపిలమునే తీసుకువచ్చాడని భ్రమించి అతడి తపస్సుని భగ్నం చేశారు. ఘోరమైన తపస్సు ఒక్కసారిగా భగ్నం కావడంతో ఒక్...

(Telugu) ముద్దబంతిపూవులో ఆరోగ్యపు ఊసులు

[:te]సంక్రాంతి వస్తోందంటే చాలు... ఆ పండుగ హడావుడికి కొత్త రంగునీ రూపునీ ఇస్తాయి బంతిపూలు. గుమ్మాలకి తోరణాలు కట్టాలన్నా, ఎద్దులని అలంకరించాలన్నా, భోగిపండ్లు పోయాలన్నా, గొబ్బెమ్మల తల మీద అద్దాలన్నా... బంతిపూలతో సంక్రాంతి కొత్త శోభని సంతరించుకుంటుంది. బంతిపూల వాడకం ఈమధ్యకాలంలో కాస్త ఎక్కువయిన మాట వాస్తవమే కానీ మన రైతులకి ఈ పూలు కొత్తేమీ కాదు. మరీ వేడిగానూ అలాగని మరీ చల్లగానూ ఉండని మన దేశ వాతావరణం ఈ బంతిపూలకి చాలా అనువుగా ఉంటుంది. అందుకనే పొలాల గట్ల మీద ఈ మొక్కలను తప్పకుండా నాటేవారు. వీటి వలన పొలంలోని పంటకీ పురుగూ పుట్రా ఆశించవని రైతుల నమ్మకం. బంతిపూలకి క్రిమికీటకాలు దూరంగా ఉంటాయి కాబట్టి ఈ నమ్మకంలో నిజం లేకపోలేదు. బంతిపూలకి పెద్దగా వాసన ఉండదు. పైగా ఇవి బరువుగా కూడా ఉంటాయి. బహుశా ఈ కారణాల చేత వాటిని పూజకి వాడం. కానీ అలంకారం కోసమూ, ఆరోగ్యరీత్యా వీటిని ప్రతి సందర్భంలోనూ వినియోగిస్తూనే ఉంటాము. బంతిపూలని ఆంగ్లంలో మేరీగోల్డ్‌ అంటారు. ఇక దీని శాస్త్రీయ నామమేమో Calendula officinalis. బంతిపూలు తినేందుకు ఏమంత రుచిగా ఉండకపోయినప్పటికీ, కుంకుమపువ్వుకి బదులుగా వీటిని వాడుతుంటారు. దుస్తులకి రంగులనిచ్చే ...

(Telugu) ఒకటే సంక్రాంతి – పది పండుగలు

[:te]తెలుగునాట పెద్దపండుగ అంటే తప్పకుండా సంక్రాంతే! మిగతా పండుగల్లాగా తిథులతో దీనికి సంబంధం లేకపోయినా, ప్రత్యేకించి ఏ దేవుడినీ ఈ సందర్భంగా కొలుచుకోకపోయినా... సంక్రాంతికి ఉండే ప్రత్యేకతలే వేరు. కీడు పండుగ భోగి – భోగిని కీడు పండుగ అంటారు. చలికి పరాకాష్టగా నిలిచే దక్షిణాయపు చివరి రోజైన భోగితో మన ఇంట్లో, ఒంట్లో ఉన్న కీడు అంతా తొలగిపోతుందని నమ్ముతారు. దీనికి సూచనగా పాతబడిన జీవితాన్ని భోగిమంటల్లోనూ, ఒంట్లో పేరుకున్న దిష్టిని భోగిపండ్లతోనూ తొలగిపోయినట్లు భావిస్తారు. గొబ్బెమ్మల పండుగ – గోపి అన్న మాట నుంచి గొబ్బెమ్మ వచ్చిందంటారు. సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తిని వివాహమాడిన గోదాదేవికి ప్రతిరూపంగా ధనుర్మాసమంతా ఇంటి ముంగిట గొబ్బెమ్మలని నిలుపుతారు. కుదరకుంటే కనీసం సంక్రాంతి రోజుల్లో అయినా వీటిని ఉంచి, వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడతారు. గోమయంతో చేసిన గొబ్బెమ్మలు ప్రతిమలుగానే కాదు. ఈ కాలంలో విజృంభించే క్రిమికీటకాలను ఇంట్లోకి రానీయకుండా కూడా కాపాడతాయి. అల్లుళ్ల పండుగ – అల్లుడిని పిలిచి అతనికి తగిన మర్యాదలు చేయాలంటే చేతిలో కాస్తో కూస్తో ధనధాన్యాలు ఉండాలి. అలాంటి శుభసమయం సంక్రాంతే! వ్యవసాయం మీద ఆధారప...

(Telugu) సంక్రాంతి వంటకాలు – ఆరోగ్యానికి సూత్రాలు

[:te]సంక్రాంతి అంటేనే ఆరోగ్యం. రేగుపండ్లని భోగిపండ్లగా మార్చుకున్నా, బంతిపూలతో ఇల్లిల్లూ అలంకరించుకున్నా... ఇంటిముందు గొబ్బెమ్మలని పేర్చినా, ఆ గొబ్బెమ్మలని భోగిమంటలలో వేసినా.. ఏ పని చేసినా దాని వెనక అధ్మాత్మిక అర్థంతో పాటుగా లౌకకమైన పరమార్థం కూడా గోచరిస్తాయి. ఇక సంక్రాంతినాడు చేసుకునే పిండివంటల సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అనాదిగా సంక్రాంతి సమయాలలో ఫలానా పదార్థాలను తినాలంటూ పెద్దలు సూచించిన వంటకాలను కనుక గమనిస్తే ఆరోగ్యపరమైన రహస్యాలు ఎన్నో గోచరిస్తాయి. నువ్వులు సంక్రాంతినాడు నువ్వులు తినాలని పెద్దలు చెబుతుంటారు. మనవైపు ఎలాగూ నువ్వులతో అరిసెలూ, సకినాలు చేసుకుంటాం కాబట్టి ఫర్వాలేదు. ఇతర రాష్ట్రాలలో అయితే కేవలం నువ్వులతోనే పిండివంటలు చేసుకునే సంప్రదాయం ఉంది. బీహార్లో తిల్‌వా, గుజరాత్‌లో నువ్వుల చిక్కీలు, మహారాష్ట్రలో తిల్‌గుల్‌, రాజస్థాన్‌లో తిల్గుడ్... ఇలా దేశమంతటా ఏదో ఒక పేరుతో నువ్వులతో చేసిన తీపిపదార్థాన్ని తింటారు. ఇక కర్ణాటకలో అయితే ఏకంగా నువ్వుల ఉండలని ఇచ్చిపుచ్చుకుంటారు. నువ్వులు నిజంగా గొప్ప బలవర్థకాలు. 100 గ్రాముల నువ్వులు తింటే 500కి పైగా కెలోరీల శక్తి శరీరానికి అందుతుంది. నువ్వ...