(Telugu) ఒక్క క్లిక్‌తో మహిళా పధకాల సమాచారం
[:te]కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మహిళా పధకాల సమాచారాన్ని పొందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 'నారీ' అనే వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా 350 పధకాలకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. సంక్షేమ పధకాలతో పాటు మహిళా హక్కులు, ఆర్ధికావశాలు, సాంఘిక సహకారం, న్యాయ సహాయం, గృహ నిర్మాణ పధకాల గురించి ఈ వెబ్‌సైట్‌లో ఉంచారు. పలు మంత్రిత్వశాఖలు, స్వయం ప్రతిపత్తి సంస్థల నుంచి డేటాను సేకరించారు. పోషకాహారం, వైద్య సలహాలు, ప్రధానమైన వ్యాధుల గురించి సమచారం కూడా ఇందులో ఉంది. మహిళలపై జరుగుతున్న నేరాలు, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు ఈ వబ్‌సైట్ ద్వారా అందిస్తారు. లీగల్‌సెల్‌కు సంబంధించిన ఫోన్ నంబర్లు, పిల్లలను దత్తత తీసుకోవడానికి సరళమైన విధానాల గురించి సమాచారం అందుబాటులో ఉంచారు. మహిళలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ అవకాశాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వావలంబనకు అవసరమైన ప్రతి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. Reference URL: http://nari.nic.in/ [:]