Posts

వాతాపి జీర్ణం అని పాలు తాగిన చిన్న పిల్లల పొట్ట పామే విధానం ఎలా వచ్చింది ?

వాతాపి, ఇల్వలుడు…. ఇద్దరూ అన్నదమ్ములు. రాక్షసులు. తాపసులవలె వేషాలు వేసుకొని, దారిన పోయే బాటసారులను అతిథులుగా పర్ణశాలకు పిలిచేవారు. వాతాపి మేకగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ మేకను వధించి, వండి బాటసారికి పెట్టేవాడు. బాటసారి తృప్తిగా తిన్నతరువాత "వాతాపీ" అని గట్టిగా కేక వేసేవాడు. బాటసారి పొట్టలో మేకమాంసరూపంలో ఉన్న వాతాపి నిజరూపాన్ని ధరించి, ఆ బాటసారి పొట్టను చీల్చుకొని వచ్చేవాడు. ఆ మృతకళేబరాన్ని రాక్షసులిద్దరూ భక్షించేవారు. ఇలా ఎందరో అభాగ్యులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ సంగతి తెలిసి అగస్త్యమహాముని ఆ మార్గాన వచ్చాడు. యధావిధిగా వాతాపి, ఇల్వలుల నాటకం జరిగింది. తృప్తిగా తిన్న అగస్త్యుడు పొట్ట నిమురుకుంటూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అన్నాడు. వాతాపి నామరూపాలు లేకుండా ఋషిపొట్టలో జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు "వాతాపీ, వాతాపీ" అని కేక వేశాడు. "ఇంకెక్కడి వాతాపి? ఎప్పుడో జీర్ణం అయిపోయాడు" అని తాపీగా జవాబిచ్చాడు ముని. తన తపోమహిమతో ఇల్వలుని కూడా నశింపచేశాడు. అప్పటి నుండి పిల్లలకు ఆహారం పెట్టి, లేదా పాలు పట్టి పొట్ట నిమురుతూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం&quo

ఆరోగ్యకరమైన శీతల పానీయం

  వేసవిలో భగభగమండే భానుడి ప్రతపానికి చల్లగా ఏమ్మన్న సేవించాలి అనిపిస్తుంది. చక్కగా గడ్డ పెరుగును చిలికి చల్లని మట్టికుండలో నీరు పోసి చేన లస్సీ, మజ్జిగ సబ్జా నీళ్ళు బార్లీ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఎండు ఖర్జూరం నీళ్ళు( రాత్రి అంతా నానపెట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే త్వరగా వేడి తగ్గిపోతుంది) నిమ్మరసం సుగంధ నీళ్ళు, సుగంధ పాలు, సుగంధ మజ్జిగ తాజా పండ్లరసాలు ఇవి అన్ని చాలా ఆరోగ్యకరమైనవి మరియు వేసవి తాపాన్ని తగ్గించి తక్షణమే శరీరానికి శక్తిని ఇస్తాయి. వీటిలో చక్కెరకు బదులు పటిక బెల్లం వాడుకుంటే జలుబు కూడా చెయ్యదు.

బర్బరీకుడి శాప వృత్తాంతమేమిటి?

బర్బరీకుడు భీముడికి మనవడు. ఘటోత్కచుడికి కుమారుడు. అతని తల్లి మౌర్వి.బర్బరీకుడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభను కనబరిచేవాడు. అస్త్రశస్త్రాల మీద అతనికి ఉన్న పట్టుని చూసిన దేవతలు ముచ్చటపడి, అతనికి మూడు బాణాలను అందించారు. ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని అందించారు. బర్బరీకుడులాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకే బర్బరీకుని వారించేందుకు, ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతాడు. ‘మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయల్దేరుతున్నావు’ అంటూ బర్బరీకుని ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. ‘యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది!’ అని బదులిస్తాడు బర్బరీకుడు. ‘నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు’ అంటూ బర్బరీకుని రెచ్చగొడతాడు శ్రీ కృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకుల

దశోపచారాలు

 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం

పంచోపచారాలు

 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం

షోడశోపచారాలు

 1. పాద్యం 2. అర్ఘ్యం  3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం

అష్టాదశోపచారాలు

 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం  5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం