Posts

Showing posts from January, 2020

(Telugu) చాణుక్యుని "నీతి దర్పణము

Image
[:te] క్రీ//పూ//300సంవత్సరములలో నీతి దర్పణము"అనే ఉద్గ్రంధము వెలసినది.సర్వ కాలములలోనూ,సర్వావస్థలలోనూ సర్వ దేశములకూ ఆదర్శ ప్రాయమైన సిద్ధాంతాలను వచిస్తూ,నిర్వచిస్తూ ఈ మహోన్నత ప్రమాణాలు కలిగిన గ్రంధ రాజమును నిర్మించిన వ్యక్తి"విష్ణు గుప్తుడు".అతని తండ్రి పేరు "చణకుడు" అగుటచే "చాణుక్యునిగా" లోక ప్రసిద్ధి గాంచాడు."ద్రమిశుడూ,"కౌటిల్యుడు"అనే నామ ధేయములతో కూడా వ్యవహరించ బడే వాడు. చంద్ర గుప్త మౌర్యునికి కుడి భుజముగా నిలిచి,ప్రజా శ్రేయస్సును కాంక్షిస్తూ,అలనాడే"శ్రేయో రాజ్యమును"నెలకొల్పిన ధీశాలి. నాటి మగధ రాజైన ధనక నందునితో విభేదించి,విరోధించి,చంద్ర గుప్త మౌర్యుని రాజుగా చేసి,పాటలీ పుత్రము రాజధానిగా ,సామ్రాజ్యము తీరు తెన్నులను రూప కల్పన చేసి,రాజ్య వ్యవహారాలను నిర్వహించేవాడు. చంద్ర గుప్తునికి మహా మంత్రిగా,సలహా దారునిగా,సైనిక దళముల పర్య వేక్షకునిగా,పదవులను,బాధ్యతలను,చేపట్టి,బహు చాతుర్యంగా నిర్వహిస్తూ,తన ఆ అనుభవ సారముతో "రామ రాజ్యము"ను ఎలాగ రూపొందించ గలము?"అని అహో రాత్రులూ మధన పడి,అహర్నిశలూ శ్రమించి,రూపొందించిన ఉద్గ్రంధమే...

పరాశరస్మృతి

అన్యే కృతయుగే ధర్మా: త్రేతాయాం ద్వాపర యుగే అన్యే కలియుగే న్రూణా౦ యుగాపానుసారత: - ఆయా యుగాల స్వరూప స్వభావభేదాలననుసారించి అన్ని యుగాలలోను ధర్మాలు భిన్నభిన్నంగా ఉంటాయి తప: పరం కృతయుగే త్రేతాయాం జ్ఞానముచ్యతే ద్వాపరే యజ్ఞమేవాహు: దానమేవ కలౌయుగే !! – కృతయుగంలో మానవధర్మం తపస్సు, త్రేతాయుగం లో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం అయితే కలియుగ ధర్మం దానం పరాశరస్మృతి – ఉపోద్ఘాతము “కృతేతు మానవాధర్మాః త్రేతాయాం గౌతమస్మృతాః ద్వాపరేశంఖలిఖితాః కలౌ పరాశరాఃస్మృతాః” – మనుస్మృతి కృత యుగానికి, అలాగే కలియుగానికి పరాశర స్మృతి అన్నది ఆర్యోక్తి. కానీ కొందరు దుష్టులు కొన్ని వేల ఏళ్ళ క్రితం నిర్దేశింపబడిన మనుస్మ్రుతిని పట్టుకుని అదే హైందవం అంటూ ఎగతాళి చేస్తున్నారు. అసలంటూ కొన్ని కొన్ని జాతులలో బట్టలు వేసుకోవడం నేర్వని కాలంలో, గొర్రెలు, అడవిపందులు తింటున్న కాలంలో, వావి వరసలు లేక పశువుల్లా అందరితో జత కడుతున్న సమయానికి మన సంస్కృతిలో ధర్మం, దిశానిర్దేశం అన్నీ ఉన్నాయి. అవి ఆ కాలానికి సరిపడ్డ నియమాలు. కాలప్రవాహంలో మార్పు సహజం. ఆ మార్పు చాలామటుకు మంచికి దోహదపడుతుంది. సమయానికి సరిపడ్డ ధ...

శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించడం లో అంతరార్ధం ఏమిటి?

కొందరు పెద్దలు కవి హృదయంతో నెమలి లైంగిక కార్యక్రమంలో పాల్గొనకుండా సంతానం పొందే ఏకైక పక్షి అని చెప్పిన విషయాన్ని చిలవలు పలవలు చేసి మొత్తానికి వేదాన్నే తిరస్కరించాలి అని కుసంస్కారులు ప్రచారం ప్రారంభించారు. అసలు కృష్ణ తత్త్వమే తప్పని తీర్మానించేసి చంకలు గుద్దుకుంటున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఆయన ధరించినది నెమలిని కాదు నెమలి పింఛాన్ని. నెమలి పించ్హానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిని గుర్తు చేసేదే శ్రీ కృష్ణ తత్త్వం నెమలి పింఛానికి ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనబడే అన్ని రంగుల సప్తవర్ణ సమాహారం అందులో ఉంటాయి. ఈ లోకమంతా ఆకాశం ఆవరింపబడి ఉంటుంది. పగలు నీలం రంగులోను,రాత్రుళ్ళు శ్యామ వర్ణంలోను కనబడుతుంది. సూర్యోదయానికి ఒక రంగు,అస్త్యమయానికి మరొక రంగు, మండుటెండలో మరొక రంగు కనబడుతుంది. అన్ని రంగులు ఒక సమాహారంగా కనబడేది నెమలి పించంలోనే. కాలానికి ప్రతీక ఆ నెమలి పించం. కృష్ణపక్షం,శుక్ల పక్షం పరంగా కాలమంతా ఈ రంగుల మయమే. మనలో ఉన్న మంచి,చెడు అన్ని రకాల ఆలోచనా తరంగాలు ఈ ఏడు రంగుల ద్వారానే ప్రకటితంఅవుతాయి. ఆ పించం మాయకు ప్రతీక ప్రకృతికి మరొక ప్రతీక ఆ నెమలిపించం ఒక న...

రాముణ్ణి గుర్తు చేసే సీత ఆకృతి

అశోక వనంలో  హనుమకి కనబడిన సీత ఆకృతి రాముణ్ణి స్ఫురింప జేసిందని శ్రీ విశ్వనాథ సత్యనారాయణ వారి అద్భుత కల్పన, వారి 'రామాయణ కల్పవృక్షం' కావ్యంలోనిది:. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా- పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే- హాకృతి, సర్వ దేహమునయందున రాఘవ వంశ మౌళి ధ- ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ణ యట్లుగాన్ ఆదర్శ  దాంపత్యమంటే, ఆయన్ని చూస్తే ఆవిడా గుర్తుకు రావాలి, ఆమెను చూస్తే అయన గుర్తుకు రావాలి, వారి ఇంటి మర్యాద గుర్తుకి రావాలి.

ప్రసిద్ధమైన ముక్కు తిమ్మన పద్యం

నానా సూన వితాన వాసనలనానందించు సారంగమే- లా నన్నొలదటంచు గంధఫలి బల్కాకన్ తపంబంది యో- షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్. సారంగము = మధుకరీ = తుమ్మెద నన్నొల్లదు = నన్ను స్వీకరించదు గంధఫలి = సంపెంగ పూవు బల్కాకన్ = పలు + కాకన్ = చాలా కొపంతో

గజేంద్ర మోక్షణం

అడిగెదనని కడు వడిఁ జను- నడిగిన దను మగుడనుడుగడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడఁ బడ నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్ గజేంద్ర మోక్షణ ఘట్టం. భర్తగారు ఎక్కడికో హడావుడిగా పరిగెడుతున్నారు.  లక్ష్మి తటపటాయింపు ఆమె అడుగుల్లో కనబడుతోందని పోతన యీ పద్యంలో పదాలలో చూపించారు.  ఇది 'సర్వలఘు కంద పద్యం'. `ఎక్కడికి వెళ్తున్నారు?' అని అడుగుదామని తొందరగా ముందుకెళ్తుంది. అడిగినా వెనుకకి పొమ్మంటారని వెనుకకు జంకుతుంది. ఇలా అటూ యిటూ ఆగి, వెళ్ళి, తడబడుతూ అడుగులేస్తోంది. పైకి చదివితే ఈ పద్యం అందం బయటపడుతుంది.

కొత్త ఇంట్లోకి వెళ్ళగానే పాలెందుకు పొంగిస్తారు ?

ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ఆదిపరాశక్తి నిర్ణయించుకుంది. తర్వాత త్రిమూర్తులను పిలిచి... బ్రహ్మకు సృష్టికార్యాన్ని, విష్ణువుకు స్థితి కార్యాన్ని, శివుడికి లయ కార్యాన్నీ అప్పగించింది. తను మాత్రం సృష్టిలోనే ఉత్తమ సృష్టి అయిన మానవులకు పరిపుష్టిని కలిగించేందుకుగాను గోమాత రూపంలో భూమికి దిగి వచ్చింది.అందువల్ల గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమత నుండి వచ్చే పాలు, మూత్రం, పేడ అన్నీ పవిత్రమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాలు స్వచ్ఛతకు, అభివృద్ధికి చిహ్నం. అందుకే అవి పొంగిన ఇంట్లో అష్టయిశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ పొంగి పొర్లుతాయని అంటారు. కాబట్టే కొత్త ఇంట్లోపాలుతప్పక పొంగిస్తారు.....

విభూతి ఎందుకు రాసుకుంటారు ?

నెయ్యి, పలురకాల వనమూలికలను కలిపి, ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి ఆహుతిగా సమర్పించినప్పుడు.... అందులో నుంచి వచ్చే భస్మమే విభూతి. విభూతిని సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. కొందరు భుజాలూ, ఛాతి, ఇతరత్రా శరీర భాగాలకు కూడా రాసుకుంటారు. దానికి కారణం... ఏదైనా వస్తువును కాల్చినప్పుడు బూడిదగా మారుతుంది. అయితే బూడిదను కాల్చితే మళ్లీ బూడిదే మిగులుతుంది తప్ప అది రూపాంతరం చెందదు.అందుకే అది అతి పవిత్రమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. అది మత్రమే కాక... విభూతిని ఒంటికి రాసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది....

కుడివైపునకు తిరిగి మనం ఎందుకు నిద్ర లేవాలి ?

Image
నిద్రకు ఉపక్రమించడం, నిద్రలేవడం మరియు రోజును గడిపే విధానాలను గూర్చి మన సంప్రదాయం ఎన్నో విషయాలను వెల్లడిచేస్తుంది. మనం ఉదయాన నిద్రలేచే విధానం రోజులో మనం చురుకుగా లేదా మందకొడిగా వుండటంపై ప్రభావాన్ని చూపుతుందని మన పాత తరం వారు విశ్వసించేవారు. ఉదయాన నిద్రలేచేటప్పుడు కుడివైపునకు తిరిగి లేవాలని చెప్పబడిన ఋషివాక్కు మన ఆరోగ్యానికి సంబంధించినది. మన శరీరం చుట్టూ రెండు అయస్కాంత వలయాలు ఉన్నాయి. మొదటిది పాదం నుండి తల వరకు, తలనుండి పాదం వరకు తిరుగుతుంది. రెండవది ఎడమవైపు నుండి కుడికి, కుడివైపు నుండి ఎడమకు మన చుట్టుతా తిరుగుతుంది. అనుకూలదిశగా మన శరీర కదలిక వల్ల  రెండవ వలయ ప్రవాహం ప్రభావితమై బలం చేకూరుస్తుంది. ఒకవేళ ఈ రెండు వలయాలు ఒకదానికొకటి విరుద్ద దశలో ఉంటే శరీర యంత్రాంగం బలహీనపడును. ఈ విషయాన్ని గుర్తించిన ఆధునిక సైన్స్ కుడివైపునకు తిరిగి లేవడం వల్ల వలయ ప్రవాహం బలం పుంజుకుంటుందని తెలపడం జరుగుతోంది. పిల్లలు తమ పనిలో మందకోడిగా ఉన్నట్లయితే ఎడమ వైపునకు తిరిగి నిద్రలేచావని పెద్దలు ఈ కారణంగానే మందలిస్తారు. కాబట్టి పెద్దల మాట పాటించడం ఉత్తమం.