Posts

విష్ణువు వేయి నామాలు మరియు వాటి అర్థం.............

Image
1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు. 2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు. 3) వషట్కార: - వేద స్వరూపుడు. 4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు. 5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు. 6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు. 7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు. 8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు. 9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు. 10) పూతాత్మా - పవిత్రాత్ముడు. 11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు. 12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు. 13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు. 14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు. 15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు. 16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు. 17) అక్షర: - నాశరహితుడు. 18) యోగ: - యోగము చే పొందదగిన వాడు. 19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు. 20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత. 21) నా...

స్కందగిరివాసా... సుబ్రహ్మణ్యేశ్వరా..!

‘నమో దేవాయ మహా దేవాయ సిద్ధాయ సంతాయ నమో నమః శుభాయ దేవసేనాయ షష్ఠి దేవాయ నమో నమః’ అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి నిండుమనసుతో ఆరాధించే భక్తులు లెక్కకుమిక్కిలిగానే ఉన్నా ఆయన కొలువుదీరిన ఆలయాలు మాత్రం అత్యంత అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి సికింద్రాబాద్‌కు చెందిన స్కందగిరి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఆ ఆలయ విశేషాలు... మార్గశిరమాసం, శుక్లపక్షం, ఆరో తిథి... శివపార్వతుల ద్వితీయ పుత్రుడైన కుమారస్వామి జన్మించిన సుదినం. అదే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి. ఆ రోజుని ఎంతో పవిత్రమైనదిగా భావించి భక్తిశ్రద్ధలతో స్వామిని అర్చిస్తారు. కుమారస్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం. దేవగణాలకు సేనాధిపతి అయిన కుమారస్వామిని షష్ఠినాడు దర్శించుకుని, అభిషేకించి, తమ శక్తికొద్దీ పేదలకు అన్న, వస్త్ర, వస్తు దానాలు చేస్తే బ్రహ్మహత్యా పాతకంతో సహా అన్ని పాపాలనుంచీ విముక్తి కలుగుతుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఐదు తలల పాము రూపంలో ఈ లోకాన్ని సంరక్షిస్తుంటాడనీ పేర్కొంటున్నాయి. అందుకే ఆ రోజున పుట్టలో పాలుపోయడం ద్వారా కుమారస్వామిని పూజిస్తారు. సర్పదోషం ఉన్నవాళ్లు షష్ఠిరోజున...

శ్రీ యంత్రం – గణిత లక్షణాలు

Image
మన వాజ్మయం లో శ్రీ యంత్రం కున్న స్థానం ఎంతో విశిష్టం. శ్రీ విద్యోపాసకులకు, తంత్ర శాస్త్ర ప్రవీణులకు ఈ యంత్ర నిర్మాణం వాటి గొప్పదనం గురించి వివరణ కరతలామలకం. శ్రీయంత్రాన్ని ఆధారం చేసుకుని శ్రీచక్ర నిర్మాణం, శ్రీ చక్రార్చన మన పూర్వులు ఎప్పటినుండో చేస్తున్నారు. ఈ శ్రీ యంత్ర నిర్మాణం ఎన్నో శతాబ్దాలుగా విదీశీయ పరిశోధకులకు అంతుబట్టని అంశం. ఎందరినో పరిశోధనకు ఉద్యుక్తులను చేసింది. ఎందరో ప్రయత్నించి వారు పొడుపు కధ విప్పామని చెప్పగాని దాన్ని మరొకరు ఖండించి దానిలో లోపాన్ని చూపేవారు. ఎన్నో దశాబ్దాల పరిశోధన అనంతరం ఈ యంత్ర విశేషాలను వారు కనుకొని అచ్చెరువొందారు. కొన్ని అంతర్జాతీయ సాంకేతిక ప్రచురణలు శ్రీ యంత్రం మీద సాగిందంటే మీరు ఆశ్చర్యపోకమానరు. వాటిలో మనకు లభ్యమవుతున్న ఒక సాంకేతిక ప్రచురణ శ్రీ అలెక్ష్ కులైచేవ్ అణు రష్యా పరిశోధకుడు 1983 లో ప్రచురించిన శ్రీయంత్ర గణిత లక్షణాలు అనే పేపర్. దాన్ని ఆధారంగా చేసుకుని మరెందరో ప్రచురించారు. తమ పరిశోధనకు శృంగేరి పీఠం లో వున్నా శ్రీయంత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అధర్వణవేదములో శ్రీ యంత్రం గురించిన శ్లోకాలను బట్టి దాని నిర్మాణం వారికి అర్ధమయింది. సరిగ్గా శ్ర...

శ్రీరాముని జాతకం.

Image
శ్రీరాముని  జాతకం. వాల్మికి మహర్షి రామాయణంలో బాలకాండలో 18 వ సర్గ లో 8. 9. 10  శ్లోకాలలో శ్రీరాముని జనము    అప్పటి గ్రహస్తితిని,  లగ్నాన్ని ఇలా చెప్పాడు.  లగ్నం కర్కాటకం ,లగ్నములో గురు చంద్రులు. మరియు  రవి మేషంలోను, మకరంలో కుజుడు, కర్కాటకంలో గురువు.  మీనంలో శుక్రుడు, తులలో శని. ఈ ఐదు గ్రహములు  ఉచ్చ స్తితి పొందియున్నవి. మిగిలిన గ్రహముల స్తితి వాల్మీకి చెప్పలేదు.  ఇలా గ్రహములు ఉన్నచో  ఫలాలు ఎలా ఉండునో , శాస్త్రమున ఏమి చెప్పిరో  వివరించెదను. ఈ గ్రహములు  కుడా లగ్నమునుండి , 1 వ  4 వ, 7 వ, 9 వ  10 వ  స్తానాలలో ఉన్నారు.  ఇందులో 1, 9,  కొణములుగను, 4,7,10 కేంద్రములగను  శాస్త్రమున చెప్పబడినవి.   లగ్నము కర్కాటకము  -  ఈ రాశికి అధిపతి చంద్రుడు  లగ్నములో నున్నాడు. మరియు వృద్ధి చంద్రుడు ఫలములు.  దృఢ శరీరము కలవాడు, చిరంజీవి, నిర్భయుడు, బలిష్టుడు, అగును. రవి మేషమున ఉచ్చస్తితి  పొందిన.-  భూములు, ధనము, భార్య పుత్రులు, కీర్తి, శౌర్యము, పరాక్రమము, కలుగును. కాని విరోధము, ...

ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం

Image
ఇష్ట కామేశ్వరి దేవి ఆలయం శ్రీ శైల ఆలయ తూర్పు శిఖరం వైపుగా శ్రీ శైలం నుంచి 15 కి.మీ దూరం లో నెలకొని ఉంది.  ఈ ఆలయం కి చేరుకోవాలి అంటే శ్రీశైలం లో నంది సర్కిల్ నుంచి జీపులు వెళ్తుంటాయి. అంటే ఇక్కడ అమ్మవారు ఒక గుహలో స్వయంబుగా వెలిశారు. అమ్మవారు చతుర్భుజాలతో దర్సనం ఇస్తుంది. ఆ చతుర్ భుజాలలో రెండు చేతులలో కమలాలు మరో రెండు చేతులలో ఒక దానిలో జప మాలా మరియొక చేతిలో శివలింగం ధరించి ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి మనమే పూజ అభిషేకా లు చేస్కోవచ్చు. ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే మనం ఇష్టకామేశ్వరి దేవి కి నుదుటన బొట్టు పెడితే మనుషుల వలే  ఆ నుదురు చాల మెత్తగా తగులుతుంది. మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం ఇక్కాడ విశేష పూజలు చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి అధిక జనాభ వస్తూఉంటారు. ఆలయ మధ్యాహ్నం 2  గంటల సమయం వరకు తెరచి ఉంటారు. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారు భక్తుల శ్రద్ధగా కోరికలను కోరుకుంటే వాటిని అమ్మవారు ౪౧ (41) రోజులలో ఆ కోరిక ను సిద్ధింప చేస్తుంది  అని భక్తుల నమ్మకం.

గర్భవతులు విన్నా, చదివినా కీర్తి ప్రతిష్ఠలు కలిగిన పుత్రులు కలుగుతారు.

*స్కందోత్పత్తి* 1. తప్యమానే తపో దేవే దేవాస్సర్షిగణాః పురా! సేనాపతిమ్ అభీప్సంతః పితామహముపాగమన్!! 2. తతో బ్రువన్ సురాస్సర్వే భగవంతం పితామహమ్! ప్రణిపత్య సురాస్సర్వే సేంద్రాస్సాగ్ని పురోగమాః!! 3. యో నస్సేనాపతిర్దేవ దత్తో భాగవతా పురా! తపః పరమమాస్థాయ తప్యతే స్మ సహోమయా!! 4. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయా! సంవిధత్స్వ విధానజ్ఞ త్వం హాయ్ నః పరమా గతిః!! 5. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోక పితామహః! సాంత్వయాన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్!! 6. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా స్సంతు పత్నిషు! తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః!! 7. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్త్రం హుతాశనః! జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమమ్!! 8. జ్యేష్టా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతమ్! ఉమాయాస్తద్బహుమతం భవిష్యతి న సంశయః!! 9. తచ్చ్రుత్వా వచనం తస్య కృతార్థా రఘునందన! ప్రణిపత్య సురా స్సర్వే పితామహమపూజయన్!! ౧౦. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితమ్! అగ్నిం నియోజయామాసుః పుత్రార్థం సర్వదేవతాః!! ౧౧. దేవకార్యమిదం దేవా సంవిధత్స్వ హుతాశన! శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజ ఉత్సృజ!! 12. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః! గర్భం ధార...

కాశీలో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు..!!

Image
కాశీలో విరాజిల్లుతున్న 56 వినాయక దేవాలయాలు..!!💐 గణేశుడు కాశీ క్షేత్రాన్ని, విశ్వనాధ మందిరాన్ని అష్టదిక్కులా, సప్తవలయ రక్షణవ్యవస్ధ ద్వారా రక్షిస్తూ ఉంటాడు. ఈ సప్త వలయ రక్షణలో ముఖ్యమైన ఎనిమిది వినాయక అవతారములు కలవు. ఒక్కొక్క వలయము, వాటిలోని వినాయక దేవాలయములు ఇక్కడ ప్రస్తావించ బడినవి. ఒకటవ వలయము: 💐 1. శ్రీ అర్క వినాయకుడు, 2. శ్రీ దుర్గా వినాయకుడు, 3. శ్రీ భీమచండ వినాయకుడు, 4. శ్రీ డేహ్లివినాయకుడు, 5. శ్రీ ఉద్దండ వినాయకుడు, 6. శ్రీ పాశపాణి వినాయకుడు, 7. శ్రీ ఖర్వ వినాయకుడు, 8. శ్రీ శిద్ద వినాయకుడు. ఈ అష్ట వినాయకులు కాశీ క్షేత్ర వెలుపలి పరిక్రమమములో ఉండి భక్తులకి సిద్ధిని ప్రసాదిస్తూ, నాస్తికులని శిక్షిస్తూ కాశీని కాపాడుతూ ఉంటారు. రెండవ వలయము..!!💐 రెండవ వలయములో కూడా అష్టవినాయకులు కాశీపురవాసుల సమస్త విఘ్నాలను తొలగిస్తూ రక్షణ కల్పిస్తారు. 9. శ్రీ లంబోదర వినాయక, 10. శ్రీ కూట దంత వినాయకుడు 11. శ్రీ శాల కంటక వినాయకుడు 12. శ్రీ కూష్మాండ వినాయకుడు 13. శ్రీ ముండ వినాయకుడు 14. శ్రీ వికట దంత వినాయకుడు 15. శ్రీ రాజ పుత్రా వినాయకుడు 16. శ్రీ ప్రణవ వినాయకుడు మూడవ వలయము..!!💐 ఇక మూడవ వలయములోని అష్ట వి...