విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా ?
బేతాళుడు శవాన్ని భుజాన వేసుకుని నడచి పోతూ ఉండే పట్టువదలని విక్రమార్కుడు కథ మనందరికీ తెల్సిందే.. ఐతే ఆ విక్రమార్కుడుకి ఉన్న 32 సాలభంజికల సింహాసనం గురించి తెలుసా.. అసలు విక్రమార్కుడి ఆ సింహాసనం ఎలా వచ్చింది, దాని విశిష్టత ఏంటి మనం ఇపుడు తెలుసుకుందాం.. పూర్వం మాళవ దేశంలో శిప్రానదీతీరంలో ఉజ్జయనీ అనే మహానగరం ఉంది.. ఇక్కడే సాందీప మహాముని ఆశ్రమం కూడా ఉంది. కృష్ణ బలరాములు ఇద్దరు విద్యనభ్యసించినడి ఇక్కడే… ఈ మహాపట్టణంలోని మేడలు మేరుపర్వతాన్ని మించి ఎత్తు ఉంటాయట. ఆ మేడల్లో నివసించే ప్రజలు పాపరహితులు, భాగ్యవంతులు, అజాతశత్రువులు. అంతటి మహత్తరమైన ఉజ్జయనీ నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి, సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు. విక్రమార్కునికి మంత్రి భట్టి. అయితే భర్తృహరి కొన్నాళ్ళ తర్వాత రాజ్య భారాన్ని తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి రాజ్యత్యాగం చేసి దేశాంతరం వెళ్ళి పోతాడు. అనంతరం విక్రమార్కుడు ధనకనకవస్తువాహనాలతో పేరుప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలుస్తుంది… ఎలాగైనా తపోభంగం చేయాలని రంభా ఊర్వశులన...