Posts

Showing posts from October, 2019

శనీశ్వరుడు

Image
  నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు. జనన వృత్తాంతము : అదితి , కస్యపు ముని కుమారుడైన సుర్యభావానునికి ముగ్గురు భార్యలు -- ఉషా(సంజ్ఞా) , చాయ , పద్మిని . లోకాలన్నితికి వెలుగునిచ్చే సుర్యాడు త్వష్ట ప్రజాపతి "విశ్వకర్మ" కూతురు సంజ్ఞా(ఉమా) దేవిని పెళ్ళిచేసుకున్నాడు . పెళ్ళైన నుండే సూర్యకాంతిని , తేజస్సును భారిచలేక , చూడలేక విచారము తో ఉన్న ఉమాదేవి ని నారదుడు చూసి , విషయము తలుసుకొని ... ఈశ్వరుని తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయమార్గము జప్పెను . అప్పటికే తనకి ముగ్గురు పిల్లు -మొదటివాడు వైవాస్తవ . రెండేవ వాడు యముడు . మూడవది కూతురు యమున. నారద సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణము పోసి "చాయాదేవి" గా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను, కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందున అనరాని మాటలతో నిందించి తిరిగి సుర్యునివద్దకే వెళ్ళిపొమ్మని చెప్పగా .. గోప్యం గా ఉన్న ఛాయా...

మహేశ్వరుడు

Image
హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు * బ్రహ్మ - సృష్టికర్త * విష్ణువు - సృష్టి పాలకుదు * మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో శివుడు బ్రహ్మ కుమారుడని ఉన్నది. మధు, కైటభులు అను రాక్షసులు బ్రహ్మను చంపటానికి రాగా, విష్ణువు వారిని తీక్షణంగా చూస్తాడు. ఆ సందర్భములో విష్ణువు నుదుటి నుండి శివుడు త్రిశూలాన్ని ధరించి జన్మించాడని మరొక ఇతిహాసములో ఉన్నది. మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడే...

వినాయక చవితి

Image
వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు) ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక పార్వతీ పుత్రుణ్ని వినాయకుడంటారని అమరం చెబుతోంది. సర్వప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజచేసే విధానమూ విశిష్టమైందే. వినాయక చవితినుంచి తొమ్మిది రోజులపాటు కొనసాగే వినాయక పూజలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గణపతి తత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతికీ, ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది. మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని, ఓషధుల్ని పూజాద్రవ్యాలుగా, యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమనే సంప్రదాయాన...

వసంత పంచమి

Image
  వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడ్డాయి .అలాంటివాటిలో శ్రీ పంచమి ఒకటి . మాఘ శుద్ధ పంచమి నాడు ఈపండుగను జరుపుకొంటారు . దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి,వసంత పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత రుతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది . శ్రీ పంచమిని విద్యారంభదినం గా భావిస్తారు . మన రాష్ట్రములోని బాసర క్షేత్రం లోనూ , మరియూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీ పంచమి నాడు పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయిస్తారు .ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజ చేయవలెనని హేమాద్రి తెలిపెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. చైత్ర శుద్ధ పంచమి నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది. వసంతరుతు...

యమ ధర్మరాజు

Image
యమ ధర్మరాజు దక్షిణ దిక్పాలకుడు . చిత్ర గుప్తుడు ఈయన దగ్గర చిట్టాలు వ్రాసే సేవకుడు . సకల జీవరాశుల పాపపుణ్యాల బేరీజు వేసి శిక్షించడమే యముడి పని . సంజ్ఞాదేవి దక్షప్రజాపతి కూతుళ్లలో ఒకతె. ఆమె సూర్యభగవానుణ్ని పెళ్లాడింది. ఆమెకు వైవస్వతుడు, యముడు అని ఇద్దరు కొడుకులు, యమి అనే కూతురు కలిగారు. ఛాయాదేవి వారి సవతి తల్లి. ఆమెకు సావర్ణి, శని అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అంతవరకు తన సవతి బిడ్డలను సొంత బిడ్డలలాగా చూసుకుంటున్న ఛాయాదేవి, తనకు పిల్లలు కలుగగానే, భేద బుద్ధితో చూడటం ఆరంభించింది. ఆమె పక్షపాత వైఖరిని సహించలేక, ధర్మం అంటే ప్రాణమైనా ఇచ్చే యముడు, ఒకనాడు తన సవితి తల్లిని కాలితో తన్నాడు. అందుకు ఆమె కోపంతో 'నన్ను తన్నిన నీ కాళ్లకు కుష్ఠురోగం ప్రాప్తించుగాక!' అని శపించింది. సంజ్ఞాదేవి కూతురైన యమికి పెళ్లీడు వచ్చింది. ఆమె అతిలోక సౌందర్యవతి. ఆమె తండ్రివెంట సూర్య రథంలో తిరుగుతూ తనతో తులతూగే అందగాడి కోసం ముల్లోకాలను గాలించింది. యుముడు ఒకనాడు 'చెల్లీ! నీకు తగిన అందగాడు దొరికాడా, లేదా? దొరికితే వాడు ఎవరో, ఎక్కడున్నాడో చెప్పు' అని అడిగాడు. అందుకు యమి 'అన్నా! నీకంటే అందగాడు నాకు ఎక్కడా...

పుత్రగణపతి వ్రతం

Image
విఘ్నేశ్వరుని పూజలలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రాలలో పుత్రగణపతి వ్రతం ఒకటి .భగవంతుడు కాల స్వరూపుడు. చైత్రంలోనే బ్రహ్మ సృష్టి ఆరంభించాడంటారు. చైత్రం నుంచి ఫాల్గుణం వరకు మన సంప్రదాయంలో పన్నెండు మాసాలు ఉన్నాయి. చివరిదైన ఫాల్గుణం ఎన్నో పండుగలకు పర్వాలకు నెలవు. ఫాల్గుణం విష్ణుప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ తదియ శాలివాహన శక సంవత్సరాది. ఫాల్గుణ శుద్ధ చవితినాడు పుత్రగణపతి వ్రతం. వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. ఆరోజు కూడా గణపతిని పుత్రసంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి. గణపతి శబ్ద బ్రహ్మస్వరూపము . అంటే ఓంకారానికి ప్రతీక . మంత్రాలన్నింటికీ ముందు ఓంకారము ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభం లో గణేశపూజ విధిగా ఉంటుంది . గణేశుదు ఆది , అంతం లేని ఆనందమూర్తి , సకల సంపత్తులనిచ్చే సిద్ధిదేవత . ఓంకారనాదం ఉద్భవించి , ఆ నాదం క్రమక్రమం గా గజానరూపం గా వెలుగొందింది . గణపతిని ఓంకారస్వరూపునిగా " గణపత్యధర్వశీర్షం " కూడా పేర్కొన్నది . దేవతాగణాలకు ఆదిపురుషుడై ,...

నవరాత్రోత్సవము(దసరా)

దసరా ఒక హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు ... పదవరోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈపండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరవాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరవాతిమూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలనుఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులునవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బ...

ధనుర్మాసము

Image
విష్ణువుకి ప్రియం ధనుర్మాసం . సంక్రాంతి నెల ఆరంభం . భక్త వత్సలుడైన ఆ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనది "ధనుర్మాసము" . ఈమాసములో ఆ స్వామిని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా అక్షయ , అమోఘ సత్పలితాలను ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనేవిషయం మనకుపురాణాల ద్వారా తెలుస్తుంది . ఆమె " తిరుప్పావై పాసురాలు" జగద్విక్యాతి నార్జించాయి .దీనిలో తిరు అంటే మంగళ కరమైన అని ,పావై అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది .వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందున భాగవతానికి సమన్వయము చెస్తూ వస్తారు . ధనుర్మాసం అంటే ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం .అంటే ఈధనుర్మాసము లో దర్మాని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రమన మాట . ధనుస్సు మాసాల రిత్యా మార్గశిర మాసము లో వస్తుంది . ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి ."గో "అనే శబ్దానికి జ్ఞానము అని ,"ద" అనే శబ్దానికి అర్ధం ఇచ్చునది అని .గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణాలయాలలో తప్పనిసరిగా గానము చేస్తారు . ప్రతీ...

దీపలక్ష్మీ పూజ

Image
భక్తితో , ఏకాగ్రతతో ప్రతిదినమూ శక్టి కొలదీ శ్రీ మహాలక్ష్మిని పూజించినవారికి ... ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణము గా లభిస్తుంది . నియమ నిస్టలతో 9 శుక్రవారారాలు అర్చిస్తే మనోభీష్టాలన్నీ నెరవేరతాయి . ఆశ్వయుజమాసము లో వచ్చే దీపావళి పండుగరోజున ఆభరణాలకీ , ధనానికీ పూజ చేయడం . . . లక్ష్మీపూజలో ఓ భాగము . ఇంటిని గోమయం తో శుబ్రము చేసి (పూరము ఇల్లు శుబ్రము చేయడానికి ఆవు పేడ, ఆవు మూత్రము తప్ప ఏమీ దొరికేవికావు .. ప్రస్తుతం ఫ్లోర్ క్లీనర్స్ ఎన్నో దొరుకుతున్నాయి ) కల్లాపిజల్లి , ముగ్గులు పెట్టి దీపాలును వెలిగించడమే లక్ష్మీపూజలో ముఖ్యమైనది . వెలుగునిచ్చే దీపం ఒక్కటి ఉన్నా ఆ వెలుగు రేఖల్లో ప్రయాణం చేయడం సులభమవుతుంది. దీపాన్ని లక్ష్మితో పోల్చడం కూడా మన సంప్రదాయంలో ఉంది. దీపలక్ష్మి పూజ దీపావళి సందర్భంగా సర్వత్రా జరుపుకోవడం ఏనాటి నుంచో ఓ ఆచారంగా ఉంది. ఈ ఆచారం వెనుక కొన్ని విశ్వాసాలు, మరికొన్ని సమాజ చైతన్య విషయాలు కూడా ఉన్నాయి. దీప పూజలో ఆశ్వయుజ బహుళ త్రయోదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పూజ దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క నమ్మకంతో చేస్తుంటారు. దీపావళి పండుగ అనగానే సాధారణంగా నరక చతుర్దశి, దీపావళి అమావాస్య అనే రె...

మాఘమాసం మహిమ

Image
స్నానం సాధారణంగా నీటికి గల శక్తులు పరమ పావనమైనవి. స్నానం, పానం జలానికి ఉపయోగాలు. కల్మషాలను కడిగేది, దాహాన్ని తీర్చేది నీరు. స్నాన, ఆచమనాలనే మార్గాల్లో జలశక్తి మానవులకు మేలు చేస్తుందని వేదవాక్కు. సాధారణ స్నానం దేహాల్ని శుద్ధిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి శాంతాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందంటారు. అందుకే స్నానం నిత్యవిధి అని విజ్ఞులు చెబుతారు. జపహోమాది కర్మలకు, పితృ దైవ కార్యాలకు శారీరక స్నానం చేతనే అధికారం కలుగుతుంది. వివిధ కార్యక్రమాలకు చేసే స్నానాలను నిత్యస్నానం, నైమిత్తికస్నానం, కామ్యస్నానం, క్రియాంశస్నానం, అభ్యంగనస్నానం, క్రియాస్నానం అని ఆరు విధాలుగా చెబుతారు. వైశాఖ, కార్తీక, మాఘ మాసాల్లో ప్రత్యేక ఫలితాలను ఆశిస్తూ ఆచరించే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాల్ని 'కామ్యస్నానాలు'గా వ్యవహరిస్తారు. చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. యజ్ఞాలకు అధిష్ఠాన దైవం ఇంద్రుడు. ఇంద్రునికి 'మఘవుడు' అనే పేరు కూడా ఉంది. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. ఇది శిశిర రుతుమాసం...

మానవ జీవన భవన స్తంభాలు

Image
లోకంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే, నాలుగు వైపులా నేలలో పునాదులు తీసి, మొదట స్తంభాలు నిర్మించాలి. ఆ స్తంభాలపైన మాత్రమే ఇల్లు కట్టుకోవాలి. ఇది గృహ నిర్మాణ విషయంలో ప్రాథమిక సత్యం. అలాగే మానవుని జీవనం కూడా ఒక భవనంలాంటిదే. అది నూరేళ్లూ చలించకుండా, ఆరోగ్యంగా, ఉండాలంటే నాలుగు స్తంభాలు తప్పనిసరి. ఆ స్తంభాలే ధర్మార్థ కామమోక్షాలు. ఈ నాలుగింటి గురించి వివరించడానికే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు... ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త విశ్వసాహిత్యం నేటికీ అంకితమై ఉంది. ఈ నాలుగు విషయాలూ జటిలంగా, గంభీరంగా కనబడినంత మాత్రాన వాటి గురించి తెలుసుకోవడం సామాన్యులకు అసాధ్యమేమీ కాదు. మనసుపెట్టి ఒక్కసారి వీటిలో ఉన్న అసలు సంగతి ఏమిటో గ్రహించడానికి ప్రయత్నించాలి. అప్పుడు జీవనం అమృతమయభావనం అవుతుంది. 'ధర్మం' అనే మాటకు విశేషార్థాలు ఎన్నో ఉన్నా- స్థూలంగా చెప్పాలంటే 'సదాచారమే' అంటే మంచి నడవడి అనేదే ధర్మం. ఇంతకన్న మంచి నిర్వచనం మరొకటి లేదు. మనిషి జీవితం కేవలం వైయక్తిక కర్మలతో మాత్రమే ముడివడి ఉండదు. ప్రతిమనిషికీ అతని జన్మకు కారణమైన పూర్వుల వారసత్వం ఉంటుంది. కుటుంబ జీవనం ఉంటుంది. సామాజిక బ...

మాఘ పూర్ణిమ

సంవత్సరానికి నెలలు 12 . నెలకి ఒక పూర్ణిమ . ఇది సర్వ సాధారణం . ఆకాశం లో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు , పూర్ణిమలు మనకి లెక్కల్లోకి వస్తాయి. శాస్త్రీయం గా చందృడు .. భూమి .. సూర్యుడు గమనాల బట్టి పగలు , రాత్రులు , నెలలు , సంవత్సరాలు అని మనం లెక్కలు వేసి అనుకున్నవే . దీనినే కేలండర్ అంటాము . తిథుల్లో ఏ పూర్ణిమ అయినా సరే ఆ పూర్ణిమకి సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి . పూర్ణిమ నాడు తెల్లవారు ఝామున వెళ్లి సముద్రస్నానము చేయడం మంచిది . పూర్ణిమలలొకెల్ల మాఘమాసం లో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసం లో వచ్చే పూర్ణిమ , వైశాఖ మాసం లో వచ్చే పూర్ణిమ లు ఎంతో ఉత్కృస్ట మైనవి . ఆ పూర్ణిమల లో చేసే దేవతారాధం మరింత శ్రేస్టమయినది . " మహామాఘి , అలభ్యయోగం " అని ఈ మాఘ పూర్ణిమను అంటారు .అంటే ఈ రొజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట . వైశాఖీ కార్తీకీ మాఘీ తిధయోతీవ పూజిత: స్నానదాన విహీనాస్తా ననేయా: పాండునందన . అని చెప్పబడింది . స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పూర్ణిమలను గడుపకూడదు . ఈ మాఘపూర్ణిమ తోపాటు ఇదే మాసం లో వచ్చే రధసప్తమి , భీష్మఏకాదశి ., మహ...

ముక్కోటి ఏకాదశి

ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.సుక్లాపక్షము ,2. కృష్ణ పక్షము ... పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమవాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి . ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు . ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి. ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులనువిశేషదాయకంగా పరిగణిస్తాము. అవి: 1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి) 2. కార్తీక శుద్ధ ఏకాదశి 3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి) 4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి పుష్య శుద్ధ ఏకాదశిని...

వరలక్ష్మి వ్రతము

Image
భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది. పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు. ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు. అది పూజతో నిమిత్తం లేనిది. సంతోష ఉత్సాహాలకు నిలయమైనది. కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది. ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు. పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. ప్రార్థన నమస్తేస్తు మహామామే శ్రీ పీఠే సుర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే తాత్పర్యం : మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ...

జ్యేష్ట మాసం - విశేషం

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రక్రుతి లో ఉండే భీబస్తవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన, లన నుండి బయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టానో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టాను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు .దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడ...

చుక్కల అమావాస్య నోము

Image
  చుక్కల అమావాస్య : శ్రావణ మాసం అమావాస్య రోజు నుండి మొదలు అగును. ఆ అమావస్యనే చుక్కల అమావాస్య అని కూదా అందురు. కొంతమంది స్త్రీలకు చుక్కల అమావాస్య నోమును నోచుకుంటారు. ఈ వ్రతం ఐదు ఏళ్ళు చేసుకుంటారు. దీనికి దీపస్తంభ వ్రతము అని కూడా పేరు ఉంది.

చాతుర్మాస్య వ్రతం

చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి 'అర్థచాతుర్మాస్యం' అనే పేరుతో చేస్తున్నారు. ఈ వ్రతాచరణకు స్త్రీ,పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మున్నగువారెవరైనా చేయవచ్చును. ఇది హిందువులతో పాటు జైన , బౌద్ధ మతస్తలుండే సమాజములోను ఆచరణలో కనిపిస్తుంది . ఈ వ్రతము చేస్తే సంవస్తార కాలపు పాపాలు పోతాయని , చెయ్యని వారికి పాపాలన్నీ సంక్రమిస్తాయన్నది ఓ విశ్వాసం . ఈ వ్రతాన్ని ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు గానీ , వీలుకాకపోతే కటక సంక్రాంతి , కాకపొతే ఆషాడ శుద్ధ పూర్ణిమ నుంచి విధిగా ఆచరించాలి అంటున్నాయి వ్రత గ్రంధాలు . ఇంతగా ఈ వ్రతాన్ని గురించి మన ఋషులు ఎందుకు నొక్కి చెప్పారు ... అని క్షణం కాలం ఆలోచిస్తే ... అది ,వ్రతాచరణ చేసేవారి ఆరోగ్య పరిరక్షణ కోసమేనని భోదపడుతుంది . ఆషాడం నుంచి నాలుగు నెలలు వర్షాలు బాగా పడుతుంటాయి , నేల బురద మాయమవుతుంది .. ఇలాంటి తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిముల వ్యాప్తికి అనువుగా ఉంటుంది . ...