Posts

Showing posts from 2020

(Telugu) మంచి మాటలు

[:te] 1. జీవితంలో ఎప్పుడైనా ఎవరి నైనా పనికి రాని వారిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడ రోజుకు రెండు సార్లు సరైన సమయం సూచిస్తుంది 2. ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదలి పుండు మీద వాలే ఈగ లాంటి వాడు 3. పేదరికం ధరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడ దూరమైతారు అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడ మిత్రులవుతారు 4. ఒక్క సారి నవ్వుతూ చూడు ప్రపంచంలో ఉండే అందాలన్ని నీ సొంతమవ్వుతాయి కానీ తడిసిన కనురెప్పలతో చూసే అద్దంకూడ మసక బారి పోతుంది 5. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువకాలం మన్నికరాదు ఎక్కువకాలం మన్నిక వచ్చేది అంతతొందరగా దొరకదు 6. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితులు ఎవరైనది 7. మనిషికి రోగాలు కుందేలు లాగా వస్తాయి తాబేలు లాగా వెళ్లుతాయి కానీ డబ్బులు తాబేలు లాగ వస్తాయి కుందేలు లాగా వెళ్లుతాయి 8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి 9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదని బాధపడకు ఎందుకంటే నీకు అక్కడ ఇవ్వక పోయ...

దొంగ సాధువు

అక్బరు చక్రవర్తి సువిశాల సామ్రాజ్యంలో సుల్తాన్‌పురి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ఆశ్రమం ఉండేది, అందులో ఒక గుడ్డివాడైన సాధువు నివసిస్తుండేవాడు. ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండే ఆ సాధువుకు ఊరి జనాలందరి భవిష్యత్తు తెలుసని ప్రజలందరూ నమ్ముతూ ఉండేవారు. ఒకరోజు అతడి ఆశ్రమానికి ఒక వ్యక్తి తన అన్నకూతురును తీసుకొస్తాడు. ఆ అమ్మాయికి ఆరోగ్యం సరిగా లేదు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల క్రితం ఆమె కళ్లెదురుగానే ఆమె అమ్మా, నాన్నలను ఎవరో దారుణంగా చంపేశారు. ఆ అఘాయిత్యాన్ని కళ్లారా చూసిన ఆ అమ్మాయికి అప్పటినుండి బుద్ధి స్వాధీనంలో లేకుండా తయారవుతుంది. దీనికి బాధపడ్డ ఆ అమ్మాయి చిన్నాన్న ఈ సాధువు బాగుచేస్తాడన్న నమ్మకంతో వైద్యం కోసం తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సాధువును చూడగానే... ఏడుపు మొదలుపెట్టింది. తన అమ్మానాన్నలను చంపింది అతడే అని ఏడుస్తూ చెప్పింది. అది విన్న జనాలంతా ఆశ్చర్యపోయారు. మహానుభావుడైన సాధువు ఎవరినైనా ఎందుకు చంపుతాడు. పైగా గుడ్డివాడు ఆ పని ఎలా చేస్తాడని తమలో తాము అనుకోసాగారు. అంతే కాదు ఆ అమ్మాయికి పిచ్చిపట్టిందని, అందుకే ఏవేవో మాట్లాడుతోందని అన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ సాధువు కూడా ఆ విషయాన్నే...

మతిలేని మృగరాజు

ఒక దట్టమైన అడవిలో ఒక సింహం నివసించేది. అడవికి రాజైన ఆ సింహం, ప్రతిరోజు జంతువులని తినేది, ఒకేసారి ఒక్కటి, ఒక్కోసారి రెండు లేదా మూడింటిని కూడా తింటూ ఉండేది. జంతువులన్నీ తమ రాజుతో విసిగిపోయాయి. అందుకని అవి ఒకరోజు సమావేశం ఏర్పాటుచేసి, ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమంటే, ఒకవేళ సింహం తన గుహనుండి బయటికి రాకుండా ఉండాలంటే అవి రోజుకి ఒక జంతువును ఆహారంగా ఆ సింహం వద్దకే పంపించాలి. రోజుకో జంతువు తనకి తానుగా సింహం దగ్గరికి వెళితే, మిగతావి మనశ్శాంతిగా అడవిలో జీవించగలవు. రోజులు గడుస్తున్నాయి. జంతువుల సంఖ్య తరిగిపోతూనే ఉంది. మృగరాజు తన గుహలోనే కుర్చుని తన దగ్గరకు వచ్చిన భోజనాన్ని ఆనందిస్తూ తినేది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు భయపడుతూనే గుహకు బయలుదేరింది. అది తాబేలులాగా నెమ్మదిగా నడుస్తూ గుహ చేరుకునేసరికి సాయంత్రం అయింది. ఆకలితో అలమటిస్తున్న సింహానికి కుందేలుపైన ఎంతగానో కోపం వచ్చింది. కుందేలు భయంతో ఏడవడం మొదలు పెట్టింది. "ఓ రాజా! ఇది నా తప్పు కాదు. మా జంతువుల సభ తప్పు కుడా కాదు. మా సభ వాస్తవానికి ఏడు కుందేళ్ళని పంపిందికానీ, మమ్మల్ని దారిలో ఒక దుర్మార్గుడు ఆపాడు. వాడు మిమ్మల్ని తిట్టాడు ...

మణిహారం దొంగ

అక్బర్ చక్రవర్తికి ఒక రోజు ఉన్నట్టుండి... బీర్బల్‌ను ఏడిపించాలని ఓ సరదా ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించిన ఆయన తన మెడలోని హారాన్ని ఒకదాన్ని తీసి చేతబట్టుకుని, తన సేవకుడిని పిలిచి దాచిపెట్టమని చెప్పాడు. రాజాజ్ఞను శిరసావహించిన ఆ సేవకుడు హారాన్ని తీసుకుని దాచిపెట్టాడు. ఈ విషయాలేమీ తెలియని బీర్బల్ ఎప్పట్లాగే ఆరోజు కూడా సభకు విచ్చేశాడు. బీర్బల్‌ను చూసిన రాజు తాను వేసిన పథకాన్ని గుర్తుకు తెచ్చుకుని నవ్వుకున్నాడు. అంతేగాకుండా... బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడోనన్న కుతూహలం కూడా ఆయన కలిగింది. బీర్బల్‌తో అక్బర్ ఇలా అన్నాడు. "బీర్బల్ ఈ రోజు నామనసు ఏమి బాగాలేదు." అన్నాడు. ఈ మాట విన్న బీర్బల్ కంగారుతో.. చెప్పండి మహాప్రభూ.. ఏమైంది? మీ మనస్సు ఎందుకు బాగుండటం లేదు? అని అడిగాడు. ఏం లేదు బీర్బల్...! మహారాణి ప్రేమగా బహూకరించిన నా మణిహారాన్ని ఎవరో తస్కరించారు అని చెప్పాడు మహారాజు. "స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెట్టిమర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా!" అని అన్నాడు బీర్బల్. స్నానానికి వెళుతూ హారం తీసి పక్కన పెట్టాను. తిరిగి వచ్చి చూస్తే, హారం మాయమైపోయింది... అంటూ చెప్పసాగాడు రాజ...

టక్కరి నక్క

ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకుని నివసించేవాడు. అతడికి కోళ్లు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి, పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి.ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్నుపడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండటం వల్ల దీనికి సాధ్యం కాలేదు. ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపు తట్టినా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కుని వింటోన్న టక్కరి నక్క, ఇదే మంచి సమయమని, ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది. తల్లిమేక వెళ్లిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్లి, "నేనే మీ అమ్మను, తలుపు తియ్యండర్రా. ..!" అని అరచింది.లోపల ఉన్న చిన్న పిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించక పోవటంతో... "నువ్వు మా అమ్మవు కావు. మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు" అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించి...

అందరిలోకి అదే తెలివైంది కదా..?!

ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ... తన సేవకుడైన జమాలుద్దీన్‌ను తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వారిద్దరూ అడవికేసి నడుస్తుండగా... ఇంతలోనే ఆకాశంలో కారు మబ్బులు అలముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశంకేసి చూస్తూ.. జమాలుద్దీన్...! వాన వస్తుందంటావా...? అని అడిగాడు. `నేనెలా చెప్పగలను ప్రభూ... నేనేమైనా భవిష్యత్తు తెలిసినవాడినా..?!' అన్నాడు జమాలుద్దీన్. అలా కొద్ది దూరం సాగిపోయిన తరువాత వారికి ఓ గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుతూ కనిపించాడు. సరే జమాలు...! ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి, వాన వస్తుందో, రాదో కనుక్కుని రా...! అని పంపించాడు అక్బర్. పరుగు పరుగున గొర్రెలకాపరి వద్దకు వెళ్లిన జమాలుద్దీన్... "వాన వస్తుందో, రాదో నీవేమైనా చెప్పగలవటోయ్..!" అని అడిగాడు. గొర్రెల కాపరి తన కంచర గాడిద తోకను పైకెత్తి పట్టుకుని, తేరిపారజూసి "మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతోంది.." అని అన్నాడు. అక్బరు వద్దకు చేరుకున్న జమాలుద్దీన్.. జరిగిన విషయాన్నంతా వివరించి చెప...

కథ అడ్డం తిరిగింది..!

ఒకరోజు బీర్బల్ రాజదర్బారుకు వస్తున్నాడు. దారిలో రేగుపండ్లు అమ్మేవాడు కనిపించాడు. రేగుపండ్లు చూడ్డానికి చాలా బాగా, అనిపించటంతో గంప మొత్తాన్ని కొనేసి రాజు అంతఃపురానికి తీసుకువచ్చాడు బీర్బల్. అక్బర్ చక్రవర్తి దర్బారుకు వెళ్లేందుకు తయారవుతూ గంపవైపు చూశాడు. ఏంటయ్యా ఆ గంప..? అందులో ఏముంది అని ఆరా తీశాడు. ప్రభూ.. ఇవి రేగుపండ్లు, చాలా బాగున్నాయి. ప్రభువులవారు తింటారని తెచ్చాను అన్నాడు. బీర్బల్ ఆ అంతఃపురంలో తనతోనూ, రాణిగారీతో చనువు ఉన్నవాడు కాబట్టి, వెంటనే రాణీగారిని కూడా అక్కడకు పిలిపించాడు అక్బర్ చక్రవర్తి. ఒక పెద్ద పళ్లెంలో రేగుపండ్లు పోసి బల్లమీద ఉంచారు. రాణీగారూ, చక్రవర్తీ ఒకవైపు... వారిద్దరికీ ఎదురుగా బీర్బల్ కూర్చొన్నారు. ముగ్గురూ పండ్లు తినడం ప్రారంభించారు. కానీ రాజుగారు పండ్లు తినేసి, గింజలను మాత్రం రాణీగారివైపు వేస్తున్నాడు. రాణిగారిని తిండిపోతుగా చేసి హేళన చేయాలని రాజు ఉద్దేశ్యం గాబోలు. తినగా, తినగా... రాణీగారి వైపు గింజలు ఎక్కువయ్యాయి. అక్బర్ చక్రవర్తి దగ్గర మాత్రం అసలు గింజలే లేవు. బీర్బల్ వద్ద మాత్రం కాసిన్ని గింజలు ఉన్నాయి. ఇంతలో అక్బర్ చక్రవర్తి.. "చూశావా బీర్బల్... రాణీగార...

చేప ముందుచూపు

అనగనగా ఒక చెరువులో మూడు చేపలు ఉండేవి. అసలే ఎండాకాలం, చెరువులో ఎప్పటికప్పుడు నీళ్లు తగ్గిపోతుండటంతో చేపలన్నీ చచ్చిపోతున్నాయి. దీంతో కలత చెందిన మూడు చేపలు ఒకచోట సమావేశమైనాయి. అయ్యో.. ఈ సంవత్సరం ఇప్పటిదాకా వానలే పడటం లేదు. మన చెరువులో చూస్తే... నీళ్ళు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈరోజు కొంతమంది జాలర్లు వచ్చి, ఇంకో పది రోజుల్లో నీళ్ళన్నీ ఇంకిపోతాయి. అప్పుడు వచ్చి ఈ చేపలన్నింటినీ వలవేసి పట్టుకెళ్లిపోవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడే ఉంటే మనం చచ్చిపోవడం ఖాయం" అని అనుకున్నాయి. మొదటి చేప మాట్లాడుతూ... ఇక్కడికి దగ్గర్లోనే ఇంకో పెద్ద చెరువు ఉంది, మనందరం అక్కడికి వెళ్లిపోదాము అని అంది. ఇది విన్న రెండో చేప... "సర్లే ఆ జాలర్లు వచ్చినప్పుడు కదా మనకి అపాయం. అప్పటిదాకా ఖంగారు పడాల్సిందేమీలేదు" అని తేల్చి చెప్పింది. ఇక మూడో చేప... "నీళ్ళు ఇంకిపోయినప్పుడు, జాలర్లు వచ్చినప్పుడు కదా... ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఇప్పట్లో లేదంటూ" ఎంచక్కా వెళ్లిపోయింది. ఎంతచెప్పినా మిగతా రెండు చేపలు వినక పోవడంతో... మొదటి చేప ఆ రాత్రికి రాత్రే నెమ్మదిగా దొర్లుకుంటూ పక్కనే కొద్ది దూరంలో ఉన్న పె...

గుడ్డివారు ఎవరు..?

ఒకరోజు అక్బరు చక్రవర్తి సభలో కూర్చొని ఉన్నారు. "మన పట్టణంలో గుడ్డివారు ఎక్కువమంది ఉన్నారా..? లేక మంచివారు ఎక్కువమంది ఉన్నారా..?" అంటూ సభికులను ప్రశ్నించాడు చక్రవర్తి. ఆయన ప్రశ్నకు అక్కడున్న ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు బీర్బల్ లేచి... "మహారాజా..! మన పట్టణంలోనే కాదు, లోకంలో చాలామంది గుడ్డివారే ఉన్నార"ని అన్నాడు. అయితే వారిని మీకు చూపేందుకు నాకు రెండురోజులు గడువు ఇప్పించండని అడిగాడు బీర్బల్. అందుకు అక్బర్ సరేనని తలూపాడు. మరుసటి రోజు బీర్బల్ దర్బారుకు వెళ్లలేదు. బాగా జనం తిరిగే ఒక కూడలి వద్ద కూర్చున్నాడు. అతని చుట్టూ చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పును కుడుతూ కూర్చున్నాడాయన. ఆయనకు పక్కనే అక్కడ ఏం జరుగుతుందనేది రాసేందుకు ఇద్దరు పనివాళ్లను నియమించుకున్నాడు. ప్రతిఒక్కడూ వచ్చి "పండిట్ జీ... ఏమి చేస్తున్నారు మీరు..?" అని ప్రశ్నిస్తూ వెళ్లిపోతున్నారు. అలా అడిగిన వారి పేర్లను పనివారు రాస్తూనే ఉన్నారు. అలా సాయంకాలం అయ్యింది. రాజుగారు విహారం కోసం అదే దారిలో వచ్చాడు. ఆయన కూడా బీర్బల్‌ని చూసి అందరూ అడిగిన ప్రశ్ననే అడిగాడు. అంతే రాజుగారి పేరు కూడా లిస్టులో చేరిపోయింది....

చిత్రకారుడి సమయస్ఫూర్తి

కొండవీడు రాజ్యానికి సుదర్శనుడు అనే రాజు ఉండేవాడు. చక్కని రూపం, ఎంచక్కని తెలివితేటలతో సుందరాంగుడు అనేట్టుగా వుండే ఆయనకు పుట్టుకతోనే చిన్న అవలక్షణం ఉండేది. ఎడమకన్ను కాస్త మెల్లగా ఉండటమే ఆ అవలక్షణం.ఆయన అందం గురించి అందరూ మెచ్చుకుంటూంటే పైకి సంతోషించినా మెల్లకన్ను గురించి కాస్త బాధపడేవాడు. అందరూ మెచ్చుకునే తన అందమైన రూపం చిత్రపటంలో చూసుకోవాలనిపించింది సుదర్శనుడికి. ఆ విషయమే మంత్రి మాధవుడితో చెప్పాడు. వెంటనే ‘రాజుగారి అందమైన చిత్రం గీసిన వారికి విలువైన బహుమతులు అందిస్తా’మంటూ రాజ్యమంతా దండోరా వేయించాడు మంత్రి. ఆ వార్త విన్న రాజ్యంలోని చిత్రకారులంతా ఎంతో ఆనందించారు. కాని రాజును చూడగానే వారి ఆనందం ఆవిరై పోయింది. రాజుకున్న మెల్లకన్ను చిత్రంలో చూపిస్తే ఆయన ఆగ్రహానికీ, ఆ పైన వేసే శిక్షను ఊహించుకుని వచ్చిన చిత్రకారులంతా ప్రాణభయంతో బతుకుజీవుడా అంటూ మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారు. చివరికి రాజాస్థానంలో ధైర్యంగా ముగ్గురు చిత్రకారులు ధైర్యంతో మిగిలారు. సింహాసనంపై ఠీవిగా కూర్చున్న సుదర్శనుణ్ని చూస్తూ బొమ్మలు గీయడానికి సిద్ధమయ్యారు ఆ ముగ్గురు చిత్రకారులు. గంటసేపు కష్టపడి ముగ్గురూ ఎవరికి వారు రాజుగారి చిత్ర...

వర్తకుడి సమయస్ఫూర్తి

ఒకసారి ఒక సామంతరాజు దగ్గరకు ఒక గుర్రాల వర్తకుడు వచ్చాడు. అతనితో పాటు ఒక గుర్రం కూడా ఉంది. ‘‘ప్రభూ! నా దగ్గర ఈ గుర్రంలాంటి మేలైన, నాణ్యమైన గుర్రాలున్నాయి. అవి మీ అశ్వశాలలో తప్పకుండా ఉండవలసినవి. వాటిలోంచి మీకోసం ఏరికోరి ఈ గుర్రాన్ని తీసుకువచ్చాను’’ అని విన్నవించుకున్నాడు. ‘‘అలాగా... దీని ధర ఎంత చెప్తున్నావు?’’ అని అడిగాడు రాజు.‘‘ఎంతో కాదు, మహారాజా... రెండువందల బంగారు నాణాలు ఇవ్వండి చాలు’’ అన్నాడు వర్తకుడు. ‘‘ధర చాలా ఎక్కువ? రెండువందల బంగారు నాణాలకి నేను పది గుర్రాలు కొంటున్నాను’’ అన్నాడు రాజు. ‘‘ప్రభూ! దీన్ని ప్రత్యేకించి మీకోసమే తెచ్చాను. మీకు ఇష్టమైన ధర ఇచ్చి ఈ ఒక్కదానిని తీసుకోండి’’ అని ప్రాధేయపూరకంగా అన్నాడు వర్తకుడు. రాజు ఇరవై బంగారు నాణాలకు బేరం కుదిర్చాడు. అప్పటికప్పుడే ధనం తెప్పించి వర్తకుడికి ఇచ్చాడు. వర్తకుడు తన చేతిలో ధనం పడగానే గబుక్కున గుర్రం ఎక్కి పారిపోసాగాడు. ఆ సంఘటనతో రాజు బిత్తరపోయాడు. అక్కడే ఉన్న సైనికాధికారులు గుర్రాలను అధిరోహించి వర్తకుడిని పట్టుకోవడానికి అతని వెంటే పరుగెత్తారు. చాలాసేపటికి సైనికాధికారులు ముఖాలు వేలాడేసుకుని ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. రాజు వర్తకుడ...

చుక్కల్ని మూటకట్టిన బీర్బల్...!!

మొగలాయి చక్రవర్తులలో అక్బర్ గొప్పవాడు. హాస్యప్రియుడయిన అక్బర్ ఒకరోజు రాజ ప్రాసాదంపై నిలబడి ఆకాశంవైపుకి చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనన్ని కనిపించాయి. వాటిని చూడగానే ఆయనకు ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోని చిలిపితనానికి ఆయనకే నవ్వు వచ్చి, కిసుక్కున నవ్వేశాడు. తెల్లారగానే సభకు వచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చుని ఉన్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ... మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి, అవెన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పినవారికి వెయ్యి బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని చెప్పాడు. నక్షత్రాలను లెక్క పెట్టేందుకు ఓ పదిహేను రోజుల గడువును కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పాడు అక్బర్ చక్రవర్తి. దీంతో సభలోని వారందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో..! ఆకాశంలో లెక్కకు మించి ఉన్న నక్షత్రాలను లెక్కగట్టి, ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా..? అదెలా సాధ్యమవుతుందని అందరూ తమలో తాము అనుకోసాగారు. ఆవగింజల్ని లెక్కపెట్టారట..! అప్పుడు బీర్బల్ లేచి... మహారాజా..! మీరు చెప్పినట్లు చుక్కలు లెక్కపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దానికి మహారాజ...

ధనికుడైనందుకు ప్రాప్తించిన శిక్ష...!

ఒకరోజు అక్బర్‌ పాదుషా తన మంత్రి బీర్బల్‌‌తో కలిసి వేటకు బయలుదేరాడు. అది చలికాలం కావడంతో చలి విపరీతంగా ఉంది. కొంతదూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు దారి ప్రక్కన ఒక పేదవాడు పడుకుని కనిపించాడు. ఆ మనిషి శరీరం మీద ఒక చిరిగిన అంగీ తప్ప మరే వస్త్రం లేదు. అక్బర్‌ ఆ మనిషిని పరీక్షగా చూసి.. "బీర్బల్..‌! ఈ వ్యక్తి మరణించినట్లున్నాడు కదూ..?" అని ప్రశ్నించాడు. బీర్బల్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూసి, "లేదు ప్రభూ..! ఈ వ్యక్తి మరణించలేదు. ఆదమరచి నిద్రపోతున్నాడ"ని చెప్పాడు. బీర్బల్‌ మాటలపై నమ్మకం కలగకపోవటంతో అక్బర్‌... "క్రింద పరుపులేదు. కప్పుకోవడానికి కంబళిలేదు క్రింద రాళ్ళు, రప్పలు, పైన చలి యింత చలిలో విశ్రాంతిగా నిద్రించడం ఎవరికైనా సాధ్యమా...? ఇతడు నిశ్చయంగా మరణించాడు" అని అన్నాడు. "లేదు ప్రభూ...! ఇతను మంచి నిద్రలో ఉన్నాడు. ఇటువంటి నిద్ర మీకూ, నాకు కూడా పట్టద"ని చెప్పాడు బీర్బల్‌. కష్టపడకపోతే ఇంతే మరి...!! వెంటనే అక్బర్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూశాడు. ఆ మనిషి గాఢనిద్రలో ఉన్నట్లుగా గ్రహించి ఆశ్చర్యపోయాడు. వెంటనే... "బీర్బల్...‌! నువ్వన్నట్లుగ...

కుందేలుకు గుణపాఠం

కుందేలు, తాబేలు స్నేహితులు. కుందేలుకు తను తెల్లగా అందంగా ఉంటానని, వేగంగా పరుగెత్తగలనని గర్వంగా ఉండేది. ఒకరోజు కుందేలుకు తాబేలును ఏడ్పించాలని పించింది. ‘‘మిత్రమా! రేపు మా ఇంటికి వస్తావా? నీ కోసం రుచికరమైన ఆహారం సిద్ధం చేస్తాను. సరిగ్గా భోజనాల వేళకు రావాలి’’ అంది. ‘సరే’ అంది తాబేలు. తాబేలు వేగంగా నడవలేకపోవడంతో, కుందేలు ఇంటికి ఆలస్యంగా చేరుకుంది. ‘‘నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావు మిత్రమా! ఇంతసేపూ చూసి నేను తినేశాను’’ అంది కుందేలు నవ్వు బిగపట్టుకుంటూ. తాబేలుకు కుందేలు ఉద్దేశ్యం అర్థమైంది. ఎలాగైనా దానికి గుణపాఠం చెప్పాలనుకుంది. కొద్దిరోజుల తరువాత తాబేలు కుందేలును తన ఇంటికి విందుకు పిలిచింది. కుందేలు... తాబేలు చెప్పిన సమయం కంటే ముందే వెళ్ళింది. ‘‘కాళ్ళు కడుక్కుని రా నేస్తం. భోజనం సిద్ధంగా ఉంది’’ అంది తాబేలు. గుమ్మం అవతల నల్లటి తారును పూసి ఉంచింది తాబేలు. కుందేలు నుయ్యి దగ్గర కాళ్ళు కడుక్కుని, గడప దాటి లోపలికి అడుగుపెట్టగానే ‘‘అయ్యో! నీ కాళ్ళకు నల్లగా ఏదో అంటుకుంది. శుభ్రం చేసుకునిరా!’’ అంది. కుందేలు అలాగే చేసింది. ఈసారి కూడా దాని కాళ్ళకు తారు అంటుకుంది. తాబేలు మళ్ళీ పంపించింది. ఇలా చాలాసార్లు జ...

నా తిండి తింటే.. పని చేయ్యాల్సిందే..!

ఒకసారి అక్బర్ చక్రవర్తి.. తన మందీ మార్బలంతోపాటు బీర్బల్‌ను కూడా వెంటబెట్టుకుని వినోదం కోసం అడవికి వెళ్లాడు. అయితే తన గుర్రం తాను కోరుకున్నంత వేగంగా పరిగెత్తక పోవటంతో అక్బర్‌కు చాలా కోపం వచ్చింది. ఒక కొరడా తీసుకుని దాన్ని కొట్టేందుకు సిద్ధమయ్యాడు. అది చూసిన బీర్బల్ వెంటనే "మహారాజా.. దయచేసి దాన్ని కొట్టకండి" అంటూ అడ్డుపడ్డాడు. "నా తిండి తింటుంది కాబట్టి అది చచ్చినట్లు కా కోసం పని చెయ్యాల్సిందే. అదలా చేయకపోతే దాన్ని కొట్టే హక్కు నాకుంద"ని బదులిచ్చాడు అక్బర్. అయినప్పటికీ.. "దయచేసి తమరు ఆ గుర్రంమీద జాలి చూపించండ"ని పదే పదే వేడుకున్నాడు బీర్బల్. "అది సరేగానీ.. నేను నువ్వు చెప్పినట్లుగానే వింటాను. కానీ నా తిండి తిన్న వాళ్లెవరైనా సరే నా పని చేయాల్సిందే" అన్నాడు మొండిగా అక్బర్. ఆ తర్వాత కొంతదూరం వెళ్లిన తరువాత వారికి జింక ఒకటి కనిపించింది. దాన్ని వేటాడి చంపేసి కోటకు తీసుకెళ్దామని అన్నాడు అక్బర్. అలా ఆ జింకను వేటాడుతూ అక్బర్, బీర్బల్‌లు ఇద్దరూ మిగతా మందీ మార్బలం నుంచి వేరుగా అయిపోయారు. కాసేపటి తరువాత అక్బర్‌కు బాగా ఆకలి వేసింది. మన ఆహార పదార్థాలన్నీ మన వాళ...

చిట్టెలుక ఉపకారం

ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది. ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆ అడవిలోనే చిట్టెలుక కూడా ఉండేది. ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా, పక్క ఉన్న కన్నంలోనుంచి చిట్టెలుక అటూ, ఇటూ పరుగెత్తుతూ సింహం కాలును తొక్కింది.అంతే.. సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి, తన కాలుకింద చిట్టెలుక అదిమిపట్టింది. బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ.. మృగరాజా... నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ... "ఏమన్నావు.. నువ్వు నాకు సాయం చేస్తావా..? నా కాలివేలు గోరంత కూడా లేవు. పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా...? ఎంత విచిత్రం..." అని నవ్వుతూ.. సర్లే బ్రతికిపో.. అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది. దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది. కాలం అలా గడవసాగింది. ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గింజుకుంటూ కనిపించింది చిట్టెలుకకి. ఎంత గింజుకున్నా వలలోంచి తప్పించుకోలేని సింహం... కొంత సేపట్లో వేటగాడు వచ్చి,...

విక్రమాదిత్య కథలు - నాగదేవత

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనవుతూ కూడా, నువ్వు సాధించదలచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చదగిందే.కాని, కార్యం ఫలించనున్న తరుణంలో, ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగావుండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమతెలియకుండా, విను, '' అంటూ ఇలా చెప్పసాగాడు: ధర్మాంగదుడు, విశ్వనాధుడు అనేవాళ్ళు చాలా కాలంగా మంచి మిత్రులు.అయితే, వారిస్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు. దొంగ పత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆ…యన, ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టుపెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ మూడువేల వరహాలయిందనీ, తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటాననీ కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకుని, భూషయ్య మోసం నుంచి తనను కాపాడమని కోరాడు. న్యాయా...

విక్రమాదిత్య కథలు - వడ్డికాసుల చెట్టు!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని  బేతాళుడు, ‘‘రాజా, భీతిగొలిపే ఈ శ్మశానంలో, అర్ధరాత్రివేళ ప్రతి ఒక్కసారీ కార్యభంగం కలుగుతున్నా, మరింత పట్టుదలతో కార్యసాధనకై నువ్వు కనబరుస్తున్న దీక్ష మెచ్చదగిందే. కానీ, లోకంలో కొందరు వ్యక్తుల ప్రవర్తన అతి విచిత్రంగానూ, నిగూఢంగానూ వుంటుంది. అలాంటి వారు పరోపకారం చేస్తున్నామన్న భ్రమ కల్పించి, ఆత్మబంధువుల మధ్యా, రక్తసంబంధీకుల మధ్యా పరస్పర అనుమానాలూ, ద్వేష భావాలూ కల్పిస్తూంటారు. అలాంటి వారెవరో నిన్ను ఏదో దుస్సాధ్యమైన కార్యాన్ని చేపట్టేలా ప్రోత్సహించి వుంటారన్న అనుమానం కలుగుతున్నది. ఈ విషయమై నీకు తగు హెచ్చరికగా వుండేందుకు, జడనాధుడనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా, విను,’’ అంటూ ఇలా చెప్పసాగాడు: భద్రపురంలో మణిదీపుడనే భాగ్యవంతుడున్నాడు. ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబం. ఇద్దరూ ఎంతో మంచి వారు; దానశీలురు. అడిగినవారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవాడు మణిదీపుడు. ఇంటికొచ్చినవారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి. కూర్చుని తింటే కొండలైనా క...

ధృతరాష్ట్రుడి కథ-తెలుగు చిన్నారుల సమాచారం

Image
ధృతరాష్ట్రుడు అంధుడు కావచ్చు. కానీ అమిత బలశాలి. విపరీతమైన పుత్రప్రేమ. ఆ ప్రేమతో కొడుకులు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నప్పటికీ, గుడ్డిగా సమర్ధిస్తూంటాడు. భీష్మ ద్రోణ విదురాది పెద్దలు కౌరవులకు ఎన్ని హితవులు బోధించినప్పటికీ, వాటిని వినమని కొడుకులకు సలహా ఇచ్చేవాడే కానీ, కొడుకులు అందుకు అంగీకరించకపోతే కొడుకులనే సమర్ధించేవాడు. ఆ చనువు, గుడ్డిప్రేమను దుర్యోధనాదులు అలుసుగా తీసుకుని సర్వనాశనం అయిపోయారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు నూరుగురూ పాండవుల చేతుల్లో నిహతులు అయ్యారు. దృతరాష్ట్రుడి సముఖంలో కూర్చుని యుద్ధవిశేషాల గూర్చి సంజయుడు రన్నింగ్ కామెంటరీ ఇచ్చేవాడు. తన కొడుకులు అందరూ తమ్ముడి కొడుకుల చేతుల్లో చావడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. వారిమీద విపరీతమైన కసి, ద్వేషం తో రగిలిపోతాడు. కానీ ఏమీ చెయ్యలేని అశక్తుడు. యుద్ధానంతరం విజయులై పాండుకుమారులను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడు దృతరాష్ట్రుడి మందిరానికి వస్తాడు…యుధిష్టురుడికి పట్టాభిషేకం చెయ్యమని కోరడానికి. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు పాండవులను ఒక వంక దీవిస్తున్నట్లు నటిస్తూనే మరోవంక కడుపుమంటతో రగిలిపోతాడు. తనకు ప్రియాతిప్రియమైన పెద్దకొడు...

అహం ఉంటే పైకి రాలేవు మిత్రమా!

Image
ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు…సజీవంగా వుండేవి…ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [ Ego ] నింపాయి. ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి ‘మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!” అని చెప్పాడు. శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా….అనిపించే శిల్పాలు సృష్టిస్తాను…కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు. అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక...

పొలాల అమావాస్య అంటే ఏమిటి?

Image
*శ్రావణ బహుళ అమావాస్యను ‘పొలాల అమావాస్య’ అంటారు. పొలాల అమావాస్యకు హిందు సాంప్రదాయంలో ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. *పొలాల అమావాస్య అంటే ఏమిటి..? ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట ఆవుపేడతో అలికి, వరిపిండితో అందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి, ఆతర్వాత ఆ కంద మొక్కలోకి మంగళగౌరీదేవినిగానీ, సంతానలక్ష్మీదేవినిగానీ ఆవాహనచేసి షోడశోపచారాలతో అర్చించి, తొమ్మిది పూర్ణం,బూరెలు , గారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని అమ్మవారికి వాయనంగా సమర్పించి దీవెనలు ...

(Telugu) బంగారానికి తుప్పు ఎందుకు పట్టదు?

Image
[:te] మామూలుగా అయితే ఇనుప వస్తువులు కొంత కాలం వాడకపోతే తుప్పు పడుతుంటాయి. తుప్పు పట్టడమనేది ఓ రసాయనిక చర్య. సాధారణంగా ఇనుము, జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. ఇనుము తుప్పు పట్టడం అంటే ఇనుప వస్తువులు, గాలిలో ఉన్న నీటి ఆవిరి, ఆక్సిజన్ వాయువులో కలిసి తదుకు Fe2o3. 2H2O అనే సంయోగ పదార్థాన్నే మనం సాధారణంగా తుప్పు అంటాం. రసాయనిక తమంత తాముగా ఎవరి ఆజమాయిషీ లేకుండా ప్రకృతి సిద్ధంగా జరిగే చర్యల్లో సాధారణంగా శక్తి ఎక్కువగా ఉన్న రూపం నుంచి పదార్థాలు శక్తి తక్కువగా ఉన్న రూపంలోకి వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తాయి. ఆ రీత్యా బంగారం అనే మూలక రూప వస్తువు శక్తి కన్నా బంగారం తుప్పు పడితే ఏర్పడే Auo2 అనే తుప్పు సంయోగ పదార్థాపు శక్తి ఎక్కువ. అంటే బంగారం తుప్పు కన్నా బంగారానికే రసాయనిక స్థిరత్వం ఎక్కువ. కాబట్టి బంగారం సహజంగా తుప్పు పట్టదు. దాని సహజరూపం ప్రకృతిలో మూలక రూపమే. కానీ ఇనుము సహజ రూపం ఖనిజ రూపమైన తుప్పు రూపమే! [:]

ధనుర్మాసం

ధనుర్మాసం - ఈ నెలరోజులు బాలికలు,మహిళలు  తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ ముగ్గులు పెట్టి ఆవుపేడ తో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో ఉంచి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీ దేవిరూపంగా పూలతో,పసుపు కుంకుమలతో  అమ్మవారిని పూజించుతారు చివరరోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఉరిగేస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రధం ముగ్గు తాడును ప్రక్కఇంటి వారు వేసిన రధం ముగ్గుకి కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు  .(ఇది మహిళలకు ఆరోగ్యం కోసం వ్యాయామం గా కూడా ఉండేటట్లు చేసిన ఏర్పాటు ) హరి దాసులు (మాల దాసరులు హరిమాల ధరించిన వారు వీరినే మాలలు అని ప్రస్తుతం పిలుస్తున్న హరిభక్తులు) వచ్చి హరికీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తలు చేస్తూ  ఇంటింటికి తిరుగుతారు.చివరలో గంగిరెద్దుల వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. వాటికి కొత్త బట్టలు గృహస్తులు ఇచ్చి సత్కరిస్తారు. ఈ మాసము శ్రీ మహా విష్ణు వుకు ప్రీతి కరమైనది . శ్రీ వైష్ణవ దేవాలయము లందు చాలా బాగా నిర్వహి స్తారు. " శ్రీ ఆండాళ్  పాశురాలు " చదువుతారు .బ్రాహ్మీ మహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి  కటు పొంగలి ( దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని  ...

ప్రేమ కాలం ఎంత?

Image
వాషింగ్టన్‌: మీరు ప్రేమలో ఉన్నారా? ఎవరితోనైనా ప్రతేక్య బంధం ఉందా? అది ఎంత కాలం ఉంటుందో తెలుసా? మీ రక్తంలో ఆక్సిటోసిన్‌ (ప్రేమ హార్మోన్‌) శాతం తెలుసుకుంటే అది తెలుస్తుందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రక్తంలో ఆక్సిటోసిన్‌ శాతం ఎక్కువ ఉన్న జంటలు చాలా కాలం కలిసి ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఇజ్రాయెల్‌కి చెందిన బార్‌-1 లాన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇటీవలే ప్రేమలో పడ్డ కొందరిలో ఈ హార్మోన్‌ శాతం ఎక్కువ ఉన్నవారు ఆర్నెల్ల తర్వాత కూడా తమ బంధం కొనసాగిస్తున్నారని.. తక్కువగా ఉన్న వారు విడిపోయారని 'లైవ్‌సైన్స్‌' పేర్కొంది. జంటల మధ్య వచ్చిన విభేధాలు తగ్గడానికి ఈ హార్మోన్‌ను ముక్కులోంచి స్ప్రే చేయడం ద్వారా విజయవంతమైనట్లు గత పరిశోధనలు వెల్లడించాయి. ఒత్తిడికి గురైన జంటల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి ఆక్సిటోసిన్‌ చికిత్స అవసరమని... తాజా వివరాలు దానికి బలం చేకూరుస్తున్నాయి. తల్లి, పిల్లల మధ్య పెనవేసుకొనే బంధంలోనూ ఈ హార్మోన్‌ ఉంటుందని, అయితే, ప్రేమ బంధం మొదలవుతున్న తొలినాళ్లలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు.

(Telugu) చెమటకాయలు తీసుకోవలసిన జాగ్రత్తలు

Image
[:te] వేసవికాలం వచ్చిందంటే చాలు... మండే ఎండలు, భరించలేని చెమట. ఇది అందరికీ తెలిసినదే. వేడిమి, చెమట... కొన్నిసార్లు ఇవే కాదు... చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలామందిని బాధించే సమస్య. పిల్లల్లో మరీ ఎక్కువ. ఇదొక రకమైన చర్మవ్యాధి. వేడిగా ఉండే వాతావరణంలో ఈ సమస్య సర్వసాధారణం. పిల్లల్లో స్వేదగ్రంథులు పూర్తిగా రూపొందకపోవడంతో చిన్నారులలో ఇవి ఎక్కువ. వాటితో కలిగే చికాకూ ఎక్కువే. ఒక్కోసారి వాటిని భరించలేక చిదిపేస్తూ ఉంటారు. ఫలితంగా సమస్య తీవ్రమవుతుంది. శరీరంపై కాసే ఈ కాత... మనం కోరని కాత. కాయకముందే కోయాల్సిన కోత. ఈ కాతను రాల్చాలంటే కేవలం ప్రేమ మాత్రమే చాలదు. కాసిని జాగ్రత్తలు కూడా కావాలి. చెమట లేదా స్వేదం చర్మం నుంచి ఉత్పత్తి అయ్యే ఒకరకమైన స్రావం. ఇది చర్మంలోని స్వేద గ్రంథుల నుంచి తయారవుతుంది. ఇది ముఖ్యంగా నీరు, వివిధ లవణాలతో కలిసి ఉంటుంది. స్వేదంలో కొద్దిగా యూరియా వంటి మలిన పదార్థాలుంటాయి. అయితే స్వేదానికి దుర్వాసన ఉండకపోయినా, చెమట పట్టడం వల్ల శరీరంపై అభివృద్ధి చెందే ప్రాపియోనీ బ్యాక్టీరియా పెరగడం వల్ల దుర్వాసన వస్తుంటుంది. (ఇలా దుర్వాసన రావడాన్ని బ్రామ్‌హిడరోసిస్ అంటారు). చెమట పట్టడం అనేద...

పిల్లల పెంపకములో పెద్దల ప్రవర్తన ,పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు టీచర్ల పాత్ర

కొందరు పిల్లలైతే మరింత మెుండిగా ప్రవర్తిస్తారు. ఇటువంటి మెుండి పిల్లలతో పెద్దలు కూడా మెుండిగా ప్రవర్తిస్తే మెుత్తానికి చెడుతుంది. ముఖ్యంగా ఒకరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్న ప్రస్తుత న్యూక్లియర్‌ కుటుంబాల్లో ఇటువంటి ేకసులు చాలా కనిపిస్తున్నారుు. అటువంటి పిల్లలతో ఎలా మెలగాలి, వారి మనస్సుని నొప్పించకుండా ఎలా ప్రవర్తించాలి అనే దానిపై సైకాలజిస్టులు అనేక పరిశోధనలు చేశారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర కీలకం అంటున్న సైకాజిస్టుల విశ్లేషణ - ప్రస్తుతం ఇళ్లలో ఒకరు లేక ఇద్దరు మాత్రమే పిల్లలు ఉంటున్నారు. అటువంటప్పుడు ఈ పిల్లల్ని ముద్దు చేయటం చాలా సహజం. ఈ గారాబం హద్దు దాటితే మాత్రం మొండితనానికి దారి తీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దల ప్రవర్తన కీలకంగా మారుతోంది. పిల్లల పెంపకం నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. ఇంకా చెప్పాలంటే సున్నితంగా మారుతోందని అనుకోవచ్చు. పిల్లల్ని పెంచే పద్దతుల్ని ప్రముఖ సైకాలజిస్టు డయానా బౌమ్‌రిండ్‌ కొన్ని పద్దతులుగా విభజించారు. పిల్లల పెంపకంలో డయానా ప్రచురించిన పరిశోధన వ్యాసాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచాయి. ఈ విభజన ప్రకారం -మొదటి...

(Telugu) వేసవికాలం చమట

Image
[:te] అసలే వేసవికాలం అందులోనూ గతంతో పోల్చితే ఎండలు విపరీతంగా పెరిగాయి. ఇంట్లోనుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం బయపడిపోతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఎంత ఎండ ఉన్నా తమ విధులకు హాజరు కాక తప్పనిపరిస్థితి.ఎండలో శరీరం నిండా చమట నిండి పనిచేసే చోట కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటాము. చికాకు వస్తుంది. ఇంటికి రాగానే హాయిగా చల్లని నీళ్లతో స్నానం చేస్తాము. కానీ తిగిరి ఉక్కపోతకు ఒళ్లంతా దురదగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి చూద్దామా? మన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితిలో ఉన్నపుడు శారీరక పనితీరు సక్ర మంగానే ఉంటుంది. దీనికంటే అధికవేడి ఉత్పన్నమయినప్పుడు మనలో చికాకు మొదలవుతుంది. అం దులో భాగంగానే కాస్త వేడి ఎక్కువవ్వగానే మనం చల్లని ప్రదే శాన్ని వెతుక్కుంటాం. శరీరమంతా స్వేదరంధ్రాలు ఉంటాయి కాబట్టి మనం తాగిన నీరు చెమట రూపంలో విడుదలవుతూనే ఉంటుంది. పెదవులు, జననాంగాల్లో తప్పించి మిగతా భాగమంతా శ్వేదరంధ్రాలుంటాయి. సాధా రణంగా చెమట పట్టడం అంటే శరీరం తనని తాను చల్లబరుచు కోవడమే. కాని అధిక మొత్తంలో చెమట విడుదలవుతే శరీరంలో నీరు తగ్గిపోతుంది. నీరుతగ్గిపోయినప్పుడే మనలో చికాకు మొదవలవుతుంది. కాబట్...

పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు

Image
నడవటం.. పరుగెట్టటం.. చాలా తేలికైన వ్యాయామాలు. వీటికి ఎలాంటి సాధనాలతోనూ పనిలేదు. కాళ్లకు షూ, పరుగెట్టాలనే కోరిక ఉంటే చాలు. ఎవరైనా, ఎక్కడైనా చేసేయొచ్చు. అయితే పరుగెత్తటంలోనూ కొన్ని పద్ధతులు పాటించటం తప్పనిసరి. దీంతో త్వరగా అలసిపోకుండా, ఎక్కువసేపు పరుగెత్తే అవకాశముంది. గాయాల బారినపడకుండానూ కాపాడుకోవచ్చు. ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ ముందుకు సాగొచ్చు. కాబట్టి పరుగెత్తేటప్పుడు పాటించాల్సిన పద్ధతులేంటో చూద్దాం. * పరుగెత్తేటప్పుడు తలను నిటారుగా ఉంచాలి. సుమారు 30-40 మీటర్ల దూరం మేరకు ముందుకు చూడాలి. పాదాలవైపు, కిందికి చూస్తూ పరుగెడితే మెడ, భుజాలపై ఒత్తిడి పడుతుంది. అలాగే దవడ, మెడ గట్టిగా బిగపట్టకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి. * భుజాలు కాస్త వెనకగా, కిందికి ఉండేలా చూసుకోవాలి. పైకి లాక్కుని, బిగపట్టి ఉంచితే భుజాలపై బాగా ఒత్తిడి పడుతుంది. శ్వాస సరిగా ఆడదు. దీంతో కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందదు. * చేతులను మోచేతి వద్ద 90 డిగ్రీల కోణంలో వంచాలి. ముందుకూ వెననకూ కదిలిస్తూ సాగాలి. శరీరానికి అడ్డంగా కదిలించకూడదు. చేతుల కదలికలు శరీరం ముందుకు దూసుకుపోవటానికి తోడ్పడతాయని గుర్తుంచుకోవాలి. * శరీరాన్ని పూర్తిగా న...

గర్భం పోవటం(మిస్‌ క్యారేజ్‌)

Image
నారు పోసిన వాడు నీరు పొయ్యడా.... అన్నది మనందరి నమ్మకం! గర్భం విషయంలో కూడా చాలామంది ఇలాగే అనుకుంటూ.. ఒకసారి గర్భం వస్తే చాలు.. ఇక తర్వాత అంతా సజావుగానే జరిగిపోతుందని భావిస్తుంటారు. ఇందులో కొంత నిజం లేకపోలేదుగానీ.. గర్భం విషయంలో మాత్రం అన్నిసార్లూ ఇలాగే జరగాలనేం లేదు. పైగా గర్భం పోవటం.. కడుపు నిలబడకపోవటమన్నది మనందరం అనుకునేంత అరుదైన సమస్యేం కాదు. దాదాపు ప్రతి ఆరు గర్భాల్లో ఒకటైనా ఇలా అర్ధాంతరంగానే ముగిసిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే చాలకాలంగా వైద్యరంగం గర్భం పోవటం.. (మిస్‌ క్యారేజ్‌) పైన లోతుగా దృష్టిపెడుతోంది. కారణమేదైనా, గర్భం దాల్చిన తొలి వారాల్లోనే జరిగినా లేక ఆ తర్వాత జరిగినా.. అర్ధాంతరంగా గర్భం పోవటమన్నది మాత్రం మానసికంగా తీవ్ర వేదనను మిగిల్చే అంశమే. గర్భం పోవటమన్నది చాలా రకాలుగా జరగొచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి మొత్తం వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు ముక్కలన్నీ బయటకువెళ్లిపోయి గర్భసంచీ శుభ్రం కావటానికి వైద్య సహాయం కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇందుకోసం వైద్యులు మందులు ఇస్తారు. అవసరమైతే కొన్నిసార్లు మత్తు ఇచ్చి, చిన్నాపరేషన్‌ చేసి శుభ్రం చెయ్యాల్సి రావచ్చు. అయితే ఒకసారి గర...